ఆయన ఐఐటీ ప్రొఫెసర్, ఇంటర్ ఫిజిక్స్ బుక్ రచయిత.! ఏటా వచ్చే కోటి రూపాయలను ఏం చేస్తున్నారో తెలుసా.?

గొప్ప‌వారు అనే వారు ఎక్క‌డో ఉండ‌రు. వారు నిజానికి మ‌న మ‌ధ్యే ఉంటారు. కానీ వారు గొప్ప‌వారు అనే విష‌యం మ‌న‌కు ఎవ‌రో చెబితే కానీ తెలియ‌దు. అలా సింపుల్‌గా ఉండ‌డం నిజంగా అలాంటి గొప్ప‌వారికే చెల్లుతుంది. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా అలాంటి ఓ గొప్ప వ్య‌క్తి గురించే. ఆయ‌న పేరు మోసిన ప్రొఫెస‌ర్‌. కానీ చూసేందుకు అలా క‌నిపించ‌రు. త‌న వృత్తి ద్వారా ఆయ‌న‌కు ఎన్నో ల‌క్ష‌ల రూపాయల ఆదాయం వ‌స్తుంది. అయినా అందులో అధిక మొత్తాన్ని పేదల కోసం ఖ‌ర్చు చేస్తారాయ‌న‌. ఆయ‌నే.. ప్రొఫెస‌ర్ హెచ్‌సీ వ‌ర్మ‌.

ప్రొఫెస‌ర్ హెచ్‌సీ వ‌ర్మ Concepts of Physics అనే పుస్త‌కాన్ని రాశారు. ఫిజిక్స్ చ‌దివే విద్యార్థుల‌కే కాదు, దాన్ని బోధించే అధ్యాప‌కుల‌కు కూడా అదొక మార్గ‌ద‌ర్శిని. ఆ బుక్ చేతిలో ఉంటే ఫిజిక్స్ అల‌వోక‌గా వ‌చ్చినట్టేన‌ని కొంద‌రు భావిస్తారు. అలాంటి పుస్త‌కాన్ని ఆయన ర‌చించారు. కొంద‌రు దాన్ని బైబిల్ ఆఫ్ ఫిజిక్స్ అని కూడా పిలుస్తారు. 1994 వ‌ర‌కు ఆ పుస్త‌కాన్ని రివైస్ చేసి కొత్త ప్రింట్ విడుద‌ల చేయ‌లేదంటే.. ఆయ‌న ఆ పుస్త‌కాన్ని ఎంత బాగా రాశారో మ‌న‌కు ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ఇక కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ పుస్త‌కాన్ని రాసినందుకు ప్రొఫెస‌ర్ హెచ్‌సీ వ‌ర్మ‌కు ఏటా రూ.1 కోటి రాయ‌ల్టీని ఇస్తారు. కానీ దాన్నంతా ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి రిలీఫ్ ఫండ్‌కు, ఇత‌ర చారిటీ సంస్థ‌ల‌కు విరాళంగా ఇస్తారు. అలాగే ఆయ‌న‌కు ఒక‌ప్పుడు శాల‌రీ కావ‌చ్చు, ప్ర‌స్తుతం పెన్ష‌న్ కావ‌చ్చు. చాలా పెద్ద మొత్తంలో వ‌స్తుంది. అయిన‌ప్ప‌టికీ ఆ డ‌బ్బును కూడా ఆయ‌న సొంతానికి వాడుకోరు. మొత్తాన్ని పేద‌ల‌కు విరాళంగా ఇస్తారు. ఆయ‌న ఉండేది కాన్పూర్‌లో. ఐఐటీ కాన్పూర్‌లోనే ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేశారు. త‌న‌కు ఒక‌ప్పుడు వ‌చ్చిన జీతంతోపాటు ఇప్పుడు పెన్ష‌న్‌గా అందుతున్న డ‌బ్బులో అధిక మొత్తాన్ని కాన్పూర్‌లో మురికి వాడల్లో ఉండే పిల్ల‌ల చ‌దువుల‌కు కేటాయిస్తున్నారు. అలాగే అవ‌స‌రం అయిన‌ప్పుడు ఆయనే స్వయంగా వెళ్లి ఆ పిల్ల‌ల‌కు పాఠాలు చెబుతుంటారు.

ప్రొఫెస‌ర్ హెచ్‌సీ వ‌ర్మ అసాధార‌ణ ప్ర‌తిభ ఉన్న గొప్ప వ్య‌క్తి అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌కు ల‌భించే డ‌బ్బును విరాళంగా ఇస్తారు క‌నుక ఇప్ప‌టికీ ఆయ‌న ఒక కారును కూడా కొన‌లేదు. చాలా సింపుల్‌గా బ‌తుకుతారు. న‌లుగురిలోనూ సాధార‌ణ వ్య‌క్తిలా క‌నిపిస్తారు. పాత స్కూట‌ర్‌పైనే ఇప్ప‌టికీ బ‌య‌ట‌కు వెళ్తుంటారు. ఇలాంటి గొప్ప వ్య‌క్తుల గురించి నిజంగా ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top