ఫుట్‌పాత్‌పై చదువుకుంటున్న బాలుడు తనకు సీఎం ఇచ్చిన రూ.5 లక్షల చెక్కును వద్దన్నాడు… ఎందుకో తెలుసా..?

నేటి టెక్ ప్రపంచంలో సోషల్ మీడియా ప్రభావం ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిందే. ఏదైనా ఒక విషయం వైరల్‌గా వ్యాప్తి చెందాలన్నా, దాని వల్ల ఏదైనా జరగాలన్నా ఇప్పుడు సింపుల్‌గా సోషల్ సైట్లలో ఒక పోస్ట్ పెడితే చాలు. అది అందరినీ ఆకట్టుకునేది అయితే కొన్ని క్షణాల్లోనే లక్షల మంది యూజర్లకు చేరుతుంది. సరిగ్గా ఇదే సూత్రం తెలుసుకున్న వికాస్ శార్దా అనే వ్యక్తి కొద్ది నెలల క్రితం ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ పోస్ట్ వైరల్‌గా మారి ఓ బాలుడిపై అందరి దృష్టి పడేలా చేసింది. అయితే ఆ బాలుడి పరిస్థితి చివరికి ఏమైంది? తెలుసుకుందాం రండి!

ఆ బాలుడి పేరు హరేంద్ర సింగ్ చౌహాన్. వయస్సు 13 సంవత్సరాలు. నోయిడా సిటీలో నివాసం ఉంటున్నాడు. తన తండ్రికి ఇటీవలే ఉద్యోగం పోవడంతో వారికి పూట గడవడమే కష్టంగా మారింది. దీంతో హరేంద్ర చదువుకు ఆటంకం ఏర్పడింది. అయితే హరేంద్ర మాత్రం ధైర్యం కోల్పోలేదు. తన స్వశక్తితో చదువుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే నోయిడా సిటీ సెంటర్ మెట్రో రైల్ స్టేషన్ వద్ద ఉన్న రహదారి పక్కన ఓ వెయింగ్ మెషీన్‌ను పెట్టుకుని చదువుకోవడం ప్రారంభించారు. బరువు చూసుకునే వారు ఇచ్చే రూ.1 కాయిన్‌లను జమ చేసి, వాటితోనే తాను చదువుకోవాలని నిర్ణయించుకుని, ఆ దిశగా అతను అలా చేశాడు.

harendra-singh

అయితే పైన చెప్పిన వికాస్ శార్దా అనే ఓ వ్యక్తి విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఫుట్‌పాత్‌పై వెయింగ్ మెషిన్ పక్కన చదువుకుంటున్న హరేంద్ర అతనికి కనిపించాడు. దీంతో స్పందించిన వికాస్ ఆ బాలుడికి సహాయం చేయాలని పేర్కొంటూ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్‌ను పెట్టాడు. కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ విషయం ఆ రాష్ట్ర సీఎం అఖిలేష్ యాదవ్ దాకా వెళ్లింది. వెంటనే అఖిలేష్ ఆ బాలుడికి సహాయం కోసం గాను రూ.5 లక్షల చెక్కును అందజేశారు. అయితే హరేంద్ర మాత్రం ఆ చెక్కును తీసుకోలేదు. ఎందుకంటే అప్పటికే అతని తండ్రికి మరో జాబ్ లభించింది. దీంతో ఆ చెక్‌ను హరేంద్ర వద్దన్నాడు. తాను తన తండ్రి ఇచ్చే డబ్బుతోనే చదువుకుంటానని, తనకు ఎవరి సహాయం వద్దని చెప్పేశాడు. కాగా హరేంద్ర మాట్లాడిన ఈ మాటలు సీఎం అఖిలేష్‌నే కాదు, ఆ బాలుడికి సహాయం చేసేందుకు వచ్చిన ఎన్‌జీవోలను కూడా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ సందర్భంగా హరేంద్ర పెద్దయ్యాక తాను ఏం కావాలని అనుకుంటున్నాడో, వారికి ఏం చెప్పాడో తెలుసా? ఆర్మీ ఆఫీసర్ కావాలని. అవును, పెద్దయ్యాక హరేంద్ర ఆర్మీ ఆఫీసర్ అయి దేశానికి సేవ చేస్తానని చెప్పాడు. ఎవరిపై ఆధార పడకుండా స్వశక్తితో ఎదగాలని చాటి చెప్పిన బాలుడు హరేంద్ర ఆలోచనా శక్తికి, ఆత్మవిశ్వాసానికి నిజంగా మనం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Comments

comments

Share this post

scroll to top