చిన్నారిని కాపాడాల‌ని ఆ పోలీస్ ఆఫీస‌ర్ ప్ర‌ద‌ర్శించిన సాహ‌సం ఎలాంటిదో తెలుసా..?

పోలీసులంటే అంద‌రూ ఒకేలా ఉండ‌రు. వారిలో నీతిగా, నిజాయితీగా బ‌తికే వారు కూడా ఉంటారు. అలాంటి వారు ఎలాంటి స‌మ‌స్య ఎదురైనా ముందుకే సాగుతారు త‌ప్ప వెన‌క‌డుగు వేయ‌రు. ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డం కోసం త‌మ ప్రాణాల‌నే ప‌ణంగా పెడ‌తారు. ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఓ పోలీసు అధికారి కూడా సరిగ్గా ఇదే కోవ‌కు చెందుతారు. ఇంత‌కీ ఆయన ఎవ‌రో, ఏం చేశారో తెలుసా..? అదేంటో మీరే చ‌దివి తెలుసుకోండి..!

sanjeev-kumar

ఆయ‌న పేరు సంజీవ్ కుమార్. ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అమ్‌రోహా గ్రామం స‌మీపంలో ఉన్న దిదౌలి పోలీస్ స్టేష‌న్ సీఐగా విధులు నిర్వ‌హిస్తున్నాడు. అయితే ఈ మ‌ధ్యే ఓ రోజున సంజీవ్ కుమార్ అమ్‌రోహా గ్రామం ర‌హ‌దారిపై వెళ్తుండ‌గా అక్క‌డ ఓ రోడ్డు ప్ర‌మాదం జ‌ర‌గ‌డాన్ని అత‌ను చూసి వెంట‌నే అక్క‌డ ఆగాడు. ఓ కారు, ఆటో రెండూ ఢీకొన‌డంతో వాటిలో ఉన్న వారికి తీవ్ర గాయాల‌య్యాయి. అయితే ఆ కారులో ప్ర‌యాణిస్తున్న ఓ కుటుంబంలో భార్య‌, భ‌ర్త వారి 6 ఏళ్ల పాప ఉన్నారు. వారు యాక్సిడెంట్ అవ‌డంతో ప‌క్క‌నే ఉన్న ఓ మ‌డుగులో ప‌డిపోయారు. ఆ మ‌డుగులో మొత్తం మురుగు నీరే ఉంది. అదంతా చుట్టూ ఉన్న ప‌రిశ్ర‌మ‌ల నుంచి వ‌చ్చిన కెమిక‌ల్స్ వ్య‌ర్థాల‌తో నిండిన మ‌డుగు.

filthy-waste

జ‌రిగిన‌ విష‌యం తెలుసుకున్న సంజీవ్ కుమార్ ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌లేదు. అది ప్రమాద‌క‌ర‌మైన మురుగు మ‌డుగు అని తెలిసి కూడా అందులోకి దూకాడు. అందులో ఇరుక్కున్న వారిని ర‌క్షించ‌డమే అప్ప‌టికి అత‌ని ధ్యేయం. అంతే..! అయితే అత‌ను మ‌డుగులో దూకే స‌రికే ఆ భార్య‌, భ‌ర్త ఇద్ద‌రూ అప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చారు. కానీ వారి 6 ఏళ్ల పాప ఉంద‌ని చుట్టూ ఉన్న జ‌నాలు అరుస్తుండ‌డంతో సంజీవ్ కుమార్ ఆ మ‌డుగులో మునిగి మొత్తం వెదికాడు. అయితే నిజానికి అస‌లు ఆ కుటుంబంలో 6 ఏళ్ల పాప లేద‌ట‌. అయినా ఆ విష‌యాన్ని క‌చ్చితంగా కన్‌ఫాం చేసుకునేంత వ‌ర‌కు సంజీవ్ ఆ మ‌డుగులోనే వెద‌క‌సాగాడు. విష‌యం క‌న్‌ఫాం అయ్యాక మ‌డుగు నుంచి బ‌య‌టికి వ‌చ్చాడు. పాప అందులో ప‌డ‌కున్నా, ఎవ‌రో అరిచార‌ని చెప్పి సంజీవ్ ఆ మ‌డుగులోకి దూకి ఆమెను కాపాడే ప్ర‌య‌త్నం చేశాడు. దీంతో అత‌ని సాహ‌సానికి చుట్టూ ఉన్న జ‌నాలే కాదు, అత‌ని పై ఉన్న‌తాధికారులు కూడా మెచ్చుకున్నారు. అందులో భాగంగానే సంజీవ్ ధైర్యాన్ని ప్ర‌శంసిస్తూ అత‌నికి రూ.2వేల న‌గ‌దు బ‌హుమ‌తిని అంద‌జేశారు. అయినా సంజీవ్ ఏమంటున్నాడో తెలుసా..? అది త‌న బాధ్య‌త అని, ఏ న‌గ‌దు కోస‌మూ అలా చేయ‌లేద‌ని అంటున్నాడు. అవును మ‌రి..! అది నిజ‌మే క‌దా..! అయితే అలా కెమిక‌ల్ వ్య‌ర్థాల మ‌డుగులో తిరిగే స‌రికి సంజీవ్‌కు చ‌ర్మంపై దద్దుర్లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం అత‌ను ఆ ఇన్‌ఫెక్ష‌న్‌కు చికిత్స చేయించుకునే ప‌నిలో ప‌డ్డాడు..! ఏది ఏమైనా… సంజీవ్ ధైర్య సాహ‌సాల‌ను మెచ్చుకోకుండా ఉండ‌లేం క‌దా..!

Comments

comments

Share this post

scroll to top