రాత‌లు అస‌భ్యంగా ఉన్నాయి, టీ ష‌ర్టు మార్చుకో… అంటూ యువ‌కున్ని వేధించిన పోలీసు..!

మ‌న దేశంలోనే కాదు, ప్ర‌పంచంలో ఎవ‌రైనా త‌మ ఇష్టాల‌కు అనుగుణంగా దుస్తులు వేసుకుంటారు. కొంద‌రు జీన్స్ ఇష్ట‌ప‌డితే కొంద‌రు ఫార్మ‌ల్స్ వేస్తారు. ఇక మ‌న దేశంలో అయితే చాలా మంది ర‌క ర‌కాలుగా దుస్తులు వేసుకుంటారు. అయితే ఎవ‌రు ఏ దుస్తులు ధ‌రించినా వారి ఇష్ట ప్ర‌కార‌మే ధ‌రిస్తారు క‌దా, అందులో ఎవ‌రి బ‌ల‌వంతం ఉండ‌దు. అలాగే ఆ యువ‌కుడు కూడా త‌న ఇష్టానికి అనుగుణంగానే దుస్తుల‌ను ధ‌రించాడు. కానీ… ఆ దుస్తులు మంచివి కావ‌ట‌, అవి ఇత‌రుల‌ను ప్ర‌భావితం చేస్తాయ‌ట‌. అలాంటి దుస్తుల‌ను ఎలా ధ‌రిస్తావ్‌..? అంటూ ఓ పోలీసు ఆ యువ‌కున్ని ప్ర‌శ్నించాడు. మ‌రి ఆ యువ‌కుడు ఎలా స్పందించాండంటే…

బెంగుళూరు న‌గ‌రంలో తాజాగా జ‌రిగింది ఈ సంఘ‌ట‌న‌. అక్క‌డి ఫోరం మాల్ కోరమంగ‌ళ‌లో ఉన్న పీవీఆర్ థియేట‌ర్‌కు ఓ యువ‌కుడు సినిమా చూసేందుకు వ‌చ్చాడు. అయితే అప్ప‌టికే అక్క‌డ ఉన్న ఓ పోలీసు ఆ యువ‌కుడి టీ ష‌ర్ట్ ప‌ట్ల అభ్యంత‌రం వ్యక్తం చేశాడు. దాని మీద అస‌భ్య‌క‌ర రాత‌లు (Stop Jerking Start Fuc*ing) రాసి ఉన్నాయని అంటూ వెంట‌నే దాన్ని మార్చుకుని రావాల‌ని ఆ యువ‌కుడికి సూచించాడు. దీంతో ఆ యువ‌కుడు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యాడు. తాను చెడ్డ వాడిని కాద‌ని, టీ ష‌ర్ట్‌పై రాత‌ల‌ను గ‌మ‌నించ‌లేద‌ని, క్యాజువ‌ల్‌గా వేసుకున్నాన‌ని, అంతే త‌ప్ప ఎవ‌రినీ కించ ప‌రిచే ఉద్దేశం త‌న‌కు లేద‌ని అత‌ను చెప్పాడు.

అయిన‌ప్ప‌టికీ ఆ పోలీసు విన‌లేదు. టీ ష‌ర్ట్ మార్చుకోవాల్సిందే..! అంటూ ప‌ట్టుబ‌ట్టాడు. ఈ క్ర‌మంలో ఓ ద‌శ‌లో ఆ యువ‌కున్ని ఆ పోలీసు ఇబ్బందుల‌కు గురి చేశాడు. వేధించాడు కూడా. కాగా ఘ‌ట‌న‌ను గ‌మ‌నించిన ఓ మ‌హిళ దీనిపై ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. వెంట‌నే బెంగుళూరు పోలీసుల దృష్టికి ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది. దీంతో వారు స్పందించారు. ఎక్క‌డ సంఘ‌ట‌న జ‌రిగిందో దాని తాలూకు వివ‌రాలు తెల‌పాలంటూ వారు ట్వీట్ చేయ‌గా, అప్పుడామె వివ‌రాల‌ను షేర్ చేసింది. అయితే మ‌రి ఆ పోలీసులు ఇక ఏం చ‌ర్య‌లు తీసుకున్నారో మాత్రం తెలియ‌రాలేదు. అయిన‌ప్ప‌టికీ స‌ద‌రు పోలీసు అలా ఓ వ్య‌క్తిని వేధించ‌డం సరికాద‌ని చుట్టూ ఉన్న వారు అభిప్రాయ‌ప‌డ్డారు. ఏమో మ‌రి, ఆ పోలీసుకి ఎందుకు అలా అనిపించిందో, అయినా ఎవ‌రు ఎలాంటి బ‌ట్ట‌లు వేసుకుంటే ఏంటి, అస‌లు బ‌ట్ట‌లు లేక‌పోతేనే అడ‌గాలి కానీ..!

Comments

comments

Share this post

scroll to top