జైలుకు వ‌చ్చిన ఖైదీతో ప్రేమ‌లో ప‌డి ఆమెను పెళ్లి చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్‌..!

నిజ‌మే మరి..! ప్రేమంటే అంతే..! దానికి హ‌ద్దులు లేవు. కుల‌, మ‌త‌, వ‌ర్గ భేద‌భావాలు, చిన్నా, పెద్దా తార‌త‌మ్యాలు లేవు. ఎవ‌రు ఎప్పుడైనా ఎవ‌రితోనైనా ల‌వ్‌లో ప‌డ‌వ‌చ్చు. ప్రేమ‌కు ఎవ‌రూ అతీతులు కారు. అందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణే ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఘ‌ట‌న‌. ఇది జ‌రిగింది బీహార్‌లో..! కిడ్నాప్ నేరం మీద జైలుకి వ‌చ్చిన ఓ మ‌హిళ‌ను ఓ పోలీస్ కానిస్టేబుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే..! ఇంత‌కీ ఆ క‌థేంటంటే…

bihar-love

అత‌ని పేరు మ‌హ‌మ్మ‌ద్ ఇనాముల్. వ‌య‌స్సు 52 సంవ‌త్స‌రాలు. భార్య‌, పిల్ల‌లు కూడా ఉన్నారు. వృత్తి రీత్యా ఇనాముల్ పోలీస్ కానిస్టేబుల్ అవ‌డంతో స‌హ‌జంగానే అత‌నికి ట్రాన్స్‌ఫ‌ర్స్ అవుతూ ఉంటాయి. అయితే ఈ క్ర‌మంలోనే అత‌నికి బీహార్‌లో ఉన్న క‌తిహార్ జైలులో కానిస్టేబుల్ డ్యూటీ ప‌డింది. దీంతో అక్క‌డే గ‌త ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రాలుగా విధులు నిర్వ‌హిస్తున్నాడు. అయితే 8 నెల‌ల కింద ఓ మ‌హిళ ఆ జైలుకు వ‌చ్చింది. ఆమె పేరు స‌రిఫుల్ ఖ‌తున్‌.

స‌రిఫుల్ ఖ‌తున్ కిడ్నాప్ నేరం కింద జైలు శిక్ష అనుభ‌వించ‌డం కోసం క‌తిహార్ జైలుకు వ‌చ్చింది. అయితే ఆమె జైలులో శిక్ష అనుభ‌విస్తుండ‌గా ఆమెకు ఇనాముల్‌కు మ‌ధ్య ప్రేమ బంధం ఏర్ప‌డింది. ఇద్ద‌రికీ అక్క‌డే చూపులు క‌లిశాయి. ఈ క్ర‌మంలో ఆమె మొన్నా మ‌ధ్యే జైలు నుంచి బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదే అనువైన స‌మ‌యం అనుకున్నాడో ఏమో గానీ ఇనాముల్ ఆమె వ‌ద్ద‌కు వెళ్లి గులాబీ ఇచ్చి త‌న ల‌వ్ ప్ర‌పోజ్ చేశాడు. దీంతో అందుకు స‌రిఫుల్ కూడా ఒప్పుకుంది. ఈ క్ర‌మంలో వారు ఫిబ్ర‌వ‌రి 13వ తేదీన అంటే స‌రిగ్గా ప్రేమికుల దినోత్స‌వం (వాలెంటైన్స్ డే)కు ముందు రోజు వివాహం చేసుకున్నారు. అయితే ఇనాముల్‌కు మొద‌టి భార్య అలాగే ఉంది. అయినా ఆమె కూడా అందుకు ఒప్పుకోవ‌డంతో అత‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. మొద‌టి భార్య‌, పిల్లల సమ‌క్షంలో అత‌ను స‌రిఫుల్‌ను వివాహ‌మాడాడు. దీన్ని బ‌ట్టి తెలుస్తుందిగా, ప్రేమ‌కు అస‌లు హ‌ద్దులే లేవ‌ని..!

Comments

comments

Share this post

scroll to top