కాళ్లకు షూస్ లేకుండా కనిపించిన ఈ కానిస్టేబుల్ సోషల్ మీడియాలో హీరో అయ్యాడు.!

ఏ ప‌ని చేసే వారైనా తాము చేసే ప‌ని గురించి ఎల్ల‌ప్పుడూ క‌ష్టంగానే ఫీల‌వుతుంటారు. అవ‌త‌లి వారు చేసే పని ఎంతో సుల‌భంగా ఉంటుంద‌ని, అందులో ఎంత‌గానో హాయి ఉంటుంద‌ని భావిస్తారు. కానీ అవ‌త‌లి వారి ప‌నిలోకి దిగితే కానీ వారిది ఎంత‌టి క‌ష్ట‌మో తెలియ‌దు. అయితే ఏ ప‌ని సంగ‌తి ఎలా ఉన్నా చాలా మంది మాత్రం పోలీసుల ప‌నేంటే చాలా అల‌క‌న అని భావిస్తారు. కానీ నిజానికి దానంత‌టి క‌ష్ట‌త‌ర‌మైన ప‌ని ఇంకొక‌టి లేదు.

నిత్యం అనేక ఒత్తిళ్ల మ‌ధ్య పోలీసులు త‌మ విధులు నిర్వ‌హిస్తుంటారు. స‌మాజంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌డం, నేర‌స్తుల‌ను ప‌ట్టుకోవ‌డం, వీఐపీల‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డం, వాహ‌న తనిఖీల వంటి ఎన్నో ప‌నుల్లో వారు ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. కొన్ని సంద‌ర్భాల్లో డ్యూటీ కార‌ణంగా ఇంటికి కూడా వెళ్ల‌రు. అంత‌టి క‌ష్ట‌త‌ర‌మైన ప‌నిని పోలీసులు నిత్యం చేస్తుంటారు.

అయితే పోలీసుల్లో కొంద‌రు అవినీతి ప‌రులు కూడా ఉంటారు లెండి. వారు నిత్యం వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతూ వారి కాళ్లు, వీరి కాళ్లు ప‌ట్టుకుని ప్ర‌మోష‌న్లు పొందుతుంటారు. కానీ ప‌ని మాత్రం చేయ‌రు. అలాంటి వారి గురించి మాట్లాడుకోవ‌డం కూడా వేస్ట్‌. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ, ఎల్ల‌ప్పుడూ డ్యూటీకే అంకిత‌మైపోయే వారి గురించైతే మ‌నం క‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే వారు అలా ప‌ని చేస్తేనే క‌దా, మ‌నం ప్ర‌శాంతంగా ఇంట్లో నిద్ర‌పోయేది.

rakesh-kumar

చిత్రంలో ఉన్న పోలీసును చూశారా..? అత‌ని పేరు రాకేష్ కుమార్. హర్యానాలో సోనిప‌ట్‌లో పోలీసు కానిస్టేబుల్‌గా విధులు నిర్వ‌హిస్తున్నాడు. ఇంత‌కీ అత‌ను అంత‌గా త‌డిసిపోయాడేమిటి? అని అడ‌గ‌బోతున్నారా..? అవును, మీరు అడిగేది క‌రెక్టే. అయితే అత‌ను ఎందుకు అంత‌గా త‌డిసిపోయాడంటే మొన్నా న‌డుమ కురిసిన వ‌ర్షాల‌కు సోనిప‌ట్‌లో ఎక్క‌డ చూసినా రోడ్ల‌పై నీరు పెద్ద ఎత్తున నిలిచిపోయింది. దీనికి తోడు వ‌ర్షం కూడా ఎంత‌కూ ఆగ‌డం లేదు. ఈ క్ర‌మంలో ర‌హ‌దారుల‌పై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం కూడా నెల‌కొంది. అయితే రాకేష్ కుమార్ అంత‌టి వ‌ర్షంలోనూ ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేసే ప‌ని ఆప‌లేదు. దీనికి తోడు అత‌ని కాళ్ల‌కు షూస్ లేవు. ఎందుకంటే అంత‌కు ముందు రోజు కురిసిన భారీ వ‌ర్షంలోనూ అత‌ను అలాగే త‌డిశాడు. దీంతో షూస్ బాగా నానిపోయాయి. ఈ క్ర‌మంలో అత‌ను త‌న షూస్‌ను ఇంటి ద‌గ్గ‌రే వ‌దిలేసి వ‌చ్చి, అలా వ‌ర్షం ప‌డుతున్నా అందులోనూ తన విధులు పూర్తి చేశాడు. ఎందుకలా షూస్ వేసుకోలేద‌ని అడిగితే, త‌న వ‌ద్ద ఒక్క‌టే జ‌త షూస్ ఉన్నాయ‌ని, అవి వ‌ర్షానికి బాగా నానిపోయాయ‌ని, వాటిని అలాగే వేసుకుని వ‌స్తే పాడైపోతాయ‌ని, అందుకే ఒక రోజు వాటిని ఇంటి ద‌గ్గ‌ర పెట్టి వ‌చ్చి అలా డ్యూటీ చేస్తున్నాన‌ని రాకేష్ కుమార్ చెప్పాడు.

చూశారుగా, పోలీస్ కానిస్టేబుల్ రాకేష్ కుమార్‌లో వృత్తి ప‌ట్ల ఎంత అంకిత‌భావం దాగి ఉందో. నిజంగా పోలీస్ డిపార్ట్‌మెంట్ మొత్తం ఇలాంటి వారే ఉంటే అప్పుడు ప్ర‌జ‌లు ఎంతో నిర్భ‌యంగా ఉండ‌వ‌చ్చు క‌దా, వారికి ఏ అన్యాయం కూడా జ‌ర‌గ‌దు. కానీ అలా పోలీసులంద‌రూ మారుతారా.. ? అంటే… ఏమో డౌటే..!

13957580_1071992319505219_698052318_n

Comments

comments

Share this post

scroll to top