తల్లిపాలకు సమానంగా పోషకాలు కలిగిన మొక్క..అదెక్కడ దొరుకుతుంది..దాని ఉపయోగాలు ఏంటి తెలుసుకోండి..

ఇప్పటివరకు పిల్లలకు శ్రేష్టమైన ఆహారాల్లో తల్లిపాలు ముందుంటాయి..ఎటువంటి కల్తీలేనివి కూడా తల్లిపాలే..ప్రతిదీ కల్తీ జరుగుతుందని భయపడ్తూ ఏం తినాలన్నా డౌటు పడ్తున్న మనం తల్లిపాల విషయంలో హ్యాపిగా ఉన్నాం..తల్లిపాలలో లభించే పోషకాలు మరే ఇతర ఆహారపదార్ధాలలోనూ సంపూర్ణం గా దొరకవు..కానీ ‘స్పిరులినా (Spirulina)’ ఆకుల్లో త‌ల్లిపాల‌కు స‌మానంగా పోష‌కాలు ఉన్నాయని సైంటిస్టులు తేల్చి చెప్పారు..  ఇది స‌ముద్ర గ‌ర్భంలో పెరుగుతుంది.ఈ క్ర‌మంలో స్పిరులినా పొడి వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

  • స్పిరులినా మొక్క ఆకుల పొడిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఎంతంటే సాధారణ పాల‌క‌న్నా 26 రెట్లు అధికంగా. అవును. దీంతో ఎముక‌ల‌కు ఎంతో బ‌లం క‌లుగుతుంది.
  •  దేహ నిర్మాణానికి, క‌ణ‌జాలాల మ‌ర‌మ్మ‌త్తుల‌కు, కొత్త క‌ణ‌జాలం పెరిగేందుకు ప్రోటీన్లు ఎక్కువ‌గా అవ‌స‌రం అవుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే స్పిరులినా పొడిలో దాదాపు 60 శాతం వ‌ర‌కు ప్రోటీన్లు ఉంటాయి. మ‌న‌కు ల‌భిస్తున్న అన్ని ఆహార ప‌దార్థాల్లోకెల్లా అత్యంత గ‌రిష్టంగా ప్రోటీన్లు క‌లిగిన ఆహారం ఇదే. నాన్ వెజ్ తిన‌ని వారు దీని పొడిని తీసుకుంటే చాలు. ఎన్నో ప్రోటీన్లు ల‌భిస్తాయి.
  • శ‌రీర పెరుగుద‌ల‌కు అవ‌స‌ర‌మైన అమైనో యాసిడ్లు, ఐర‌న్‌, యాంటీ ఆక్సిడెంట్లు, క్లోరోఫిల్ స‌మృద్ధిగా ఉంటాయి. ర‌క్తాన్ని శుభ్ర‌ప‌ర‌చ‌డంలో, వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంపొందించ‌డంలో క్లోరోఫిల్ బాగా ప‌నిచేస్తుంది.
  • ప‌లు ర‌కాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవ‌చ్చు. న‌రాల బ‌ల‌హీన‌త పోతుంది.
  • లివ‌ర్‌ను శుభ్ర ప‌రుస్తుంది. మ‌ధుమేహం ఉన్న‌వారికి మేలు చేస్తుంది. వారి ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి.
  • గుండె సంబంధ వ్యాధులు రావు. వాపులు, నొప్పులు త‌గ్గిపోతాయి.
  • జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. శ‌రీరంలోని హార్మోన్ల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది.
  • ర‌క్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. అధికంగా ఉన్న కొవ్వు క‌రిగిపోతుంది. ఇది బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి చ‌క్క‌ని మందుగా ప‌నిచేస్తుంది.
  • శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థాల‌న్నీ బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.
  • విట‌మిన్లు ఎ, కె1, కె2, బి12, ఐర‌న్‌, మెగ్నిషియం, క్రోమియం, ఫైటో న్యూట్రియెంట్లు, కెరోటినాయిడ్స్‌, జీఎల్ఏ, ఎస్‌వోడీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ర‌కాల పోషకాలు స్పిరులినాలో ఉన్నాయి.
  • క్యారెట్ల క‌న్నా 2800 శాతం బీటా కెరోటీన్‌, పాల‌కూర‌లో క‌న్నా 3900 శాతం ఎక్కువ ఐర‌న్‌, బ్లూబెర్రీల‌లో క‌న్నా 280 శాతం ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు స్పిరులినాలో ఉన్నాయి.

దీన్ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా త‌ల్లిపాల‌తో స‌మానంగా పోష‌కాలు క‌లిగిన ఆహార ప‌దార్థాల జాబితాలో చేర్చింది. అయితే మ‌న‌కు మార్కెట్‌లో స్పిరులినా మొక్క ఆకుల‌ పొడి దొరుకుతుంది. ఈ పొడి టాబ్లెట్ల రూపంలోనూ ల‌భిస్తుంది.

Comments

comments

Share this post

scroll to top