ర‌హ‌దారిపై హెలికాప్ట‌ర్‌ను దించి దారి అడిగిన పైల‌ట్‌..!

ర‌హ‌దారుల‌పై వాహ‌నాల్లో ప్ర‌యాణించే వారికి అదేవిధంగా స‌ముద్ర మార్గంలో ఓడ‌ల్లో వెళ్లే వారికి ఎక్క‌డికి వెళ్తున్నామో, ఏ దారిలో వెళ్తున్నామో తెలుసుకునేందుకు ప‌లు మార్గాలు ఉంటాయి. అందుకు వారు అవ‌స‌రం అయితే మ్యాపుల‌ను, ప్ర‌త్యేక ప‌రికరాల‌ను కూడా వాడుకుంటారు. మ‌రి గాల్లో ఎగిరే విమానాలు, హెలికాప్ట‌ర్లు వంటి వాటికో..? అంటే… వాటికీ దారి తెలుసుకునేందుకు ప్ర‌త్యేక‌మైన సెట‌ప్ ఉంటుంది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ బోర్డుతో సమన్వయం చేసుకుంటూ పైల‌ట్లు విమానాలను, హెలికాప్ట‌ర్ల‌ను గ‌మ్య‌స్థానాల‌కు చేరుస్తారు. కానీ… ఆ పైల‌ట్ మాత్రం అందుకు భిన్నం. దారి మ‌రిచిపోయాన‌ని చెప్పి ఏకంగా త‌న హెలికాప్ట‌ర్‌నే రోడ్డుపై ఆపి మ‌రీ అంద‌రినీ షాక్‌కు గురి చేశాడు. ఈ సంఘ‌ట‌న జ‌రిగింది క‌జ‌కిస్థాన్‌లో..!

helicopter-on-road

క‌జ‌కిస్థాన్‌లోని ఓ జాతీయ ర‌హ‌దారిపై తీవ్రంగా మంచు కురుస్తోంది. దీంతో ఆ దారిపై వెళ్లే వాహ‌నాలు నిదానంగా ఒక‌దాని వెనుక ఒక‌టి వెళ్తున్నాయి. అయితే అదే ర‌హ‌దారిపై అక్క‌డి ఆర్మీకి చెందిన పైల‌ట్ ఒక‌త‌ను ఎంఐ-80 హెలికాప్ట‌ర్‌ను స‌డెన్‌గా దించాడు. గాల్లో స‌రిగ్గా క‌నిపించ‌లేదో, మ‌రేదైనా కార‌ణ‌మో గానీ అలా హెలికాప్ట‌ర్ ఒక్క‌సారిగా జాతీయ ర‌హ‌దారిపై దిగే స‌రికి దానిపై ప్ర‌యాణిస్తున్న వాహ‌న‌దారులు ఒక్క సారిగా షాక్‌కు గుర‌య్యారు. అయితే ఆ హెలికాప్ట‌ర్ పైల‌ట్ దాన్ని రోడ్డుపై ఆప‌గానే వెంట‌నే అక్క‌డే ఉన్న ఓ ట్ర‌క్ డ్రైవ‌ర్ వ‌ద్ద‌కు వ‌చ్చి దారి వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నాడు. తాను అక్తుబిన్సిక్ న‌గ‌రానికి వెళ్లాల‌న‌కుంటున్నాన‌ని, దారి త‌ప్ప‌డం వ‌ల్ల అలా ర‌హ‌దారిపై ఆగాన‌ని ఆ డ్రైవ‌ర్‌కు చెప్పాడు. దీంతో ఆ డ్రైవ‌ర్ త‌న‌కు తెలిసిన దారిని ఆ పైల‌ట్‌కు చెప్పాడు. అలా దారి తెలుసుకోగానే వెంట‌నే ఆ పైల‌ట్ హెలికాప్ట‌ర్‌ను గాల్లోకి లేపి అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు.

అయితే దీనిపై అక్క‌డి ర‌క్ష‌ణ శాఖ అధికారులు మొద‌ట ఖంగు తిన్నారు. అయినా తేరుకుని అది త‌మ శిక్ష‌ణ‌లో భాగం అని, దారి చెప్పకుండా పైల‌ట్ల‌ను గ‌మ్య‌స్థానాల‌కు చేర్చ‌డం ఎలా దానిపైనే శిక్ష‌ణ ఇచ్చామ‌ని, అందుకే ఆ పైల‌ట్ అలా దారి అడిగి ఉంటాడ‌ని, సాధార‌ణంగా ట్రైనింగ్‌లో ఉన్న పైల‌ట్లు ఎవ‌రూ అలా చేయ‌ర‌ని ఆ అధికారులు స‌ర్ది చెప్పారు. కానీ… ఆ పైల‌ట్ వాల‌కం చూస్తుంటే మాత్రం క‌థ వేరేగా ఉంద‌ని వీక్ష‌కులు అనుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఆ పైల‌ట్ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది కూడా. దాన్ని మీరు కూడా చూడ‌వ‌చ్చు..!

Comments

comments

Share this post

scroll to top