ఈ జంటకు చెందిన ఫొటో సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. ఎందుకంటే..?

న‌లుపు రంగులో ఉన్న ప్రియుడు.. తెలుపు రంగులో ఉండే ప్రియురాలు.. ఇద్ద‌రూ క‌ల‌సి ఉన్న ఫొటోలు.. క‌నిపిస్తే చాలు సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు రేసిజం విమ‌ర్శ‌ల‌కు దిగుతారు. ర‌క ర‌కాల కామెంట్లు చేస్తారు. అస‌లు మీ ఇద్ద‌రూ జోడీ ఎలా అయ్యారు..? ఒక సారి అద్దంలో ముఖం చూసుకున్నారా..? న‌లుపు రంగు ప్రియుడికి తెలుపు రంగు ప్రియురాలు కావాలా..? అంటూ విమ‌ర్శ‌లు చేస్తారు. అయితే స‌రిగ్గా ఇలాంటి విమ‌ర్శ‌ల‌నే ఇప్పుడు ఆ కోలీవుడ్ జంట కూడా ఎదుర్కొంటోంది. ఇంత‌కీ వారు ఎవ‌రంటే..?

ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ తెలుసు క‌దా. మొన్నా మ‌ధ్యే విజ‌య్ న‌టించిన అదిరింది (త‌మిళంలో మెర్స‌ల్‌) సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అంతేకాదు, అట్లీ స్క్రిప్ట్ రైట‌ర్‌, ర‌చ‌యిత కూడా. అయితే ఇత‌ని అసలు పేరు అరుణ్ కుమార్‌. అట్లీ 2013లో రాజా రాణి అనే సినిమాతో కోలివుడ్‌కు డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అయ్యాడు. కాగా మొద‌టి సినిమాతోనే అట్లీ స‌క్సెస్‌ను అందుకుని కోలివుడ్‌లో అప్ర‌తిహ‌తంగా దూసుకుపోతున్నాడు. అనేక హిట్ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇక అట్లీ ల‌వ‌రే కృష్ణ ప్రియ‌. ఈమె ఒక ఫేమ‌స్ టీవీ స్టార్‌. ప‌లు సీరియ‌ల్స్‌, షోల‌లో ఈమె న‌టించింది.

కాగా అట్లీ, కృష్ణ ప్రియ‌లు గ‌త 8 సంవత్స‌రాల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరిద్ద‌రూ 2014నే వివాహం చేసుకున్నారు. అయితే వీరి ఫొటోలు ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి. స‌హ‌జంగానే క‌ల‌ర్ త‌క్కువ ఉండే అట్లీ అందంగా ఉన్న కృష్ణ ప్రియ‌కు ఎలా సెట్ అయింది ? వారిద్ద‌రూ అస‌లు జోడీ అవుతారా ? లాంటి వ‌ర్ణ వివ‌క్ష కామెంట్ల‌ను ఇప్పుడు ఈ జంట సోష‌ల్ మీడియాలో ఎదుర్కొంటోంది. అయినా వీరు వాటికి స్పందించడం లేదు. అవున్లే.. ఎవ‌రిష్టం వారిది. అయినా లవ్ అనేది గుడ్డిది క‌దా. దానికి రంగు, కులం, డ‌బ్బు వంటి తార‌త‌మ్యాలు ఉండవు. ఇది తెలియకుండా ఆ జంట‌పై అలా రేసిజం కామెంట్లు చేయ‌డం క‌రెక్ట్ కాదు క‌దా..!

 

Comments

comments

Share this post

scroll to top