ఇంట‌ర్నెట్ ప్ర‌పంచంలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన ఫొటో ఇది… ఇంత‌కీ అందులో ఏముందో తెలుసా..?

దెయ్యం… భూతం… పిశాచం… పేరేదైనా అన్నీ భ‌య‌పెట్టేవే. అయితే ఇది న‌మ్మ‌కం ఉన్న‌వారికే సుమా! న‌మ్మ‌కం లేని వారు దాదాపుగా ఇలాంటి పేర్లు చెప్పినా, వాటి గురించిన క‌థ‌లు వినిపించినా, సినిమాలు చూపించినా భ‌య‌ప‌డ‌రు. కానీ కొన్ని ప‌రిస్థితుల్లో న‌మ్మ‌కం లేని వారు కూడా న‌మ్మాల్సి వ‌స్తుంది. నిజంగా దెయ్యాలు ఉన్నాయా? లేవా? అనే సంశ‌యంలో ప‌డిపోవాల్సి వ‌స్తుంది. అలాంటి సంశ‌యంలో ప‌డేసే ఫొటోనే ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ghost-hand-photo

పై ఫొటో చూశారుగా..? ఇంత‌కీ అందులో దెయ్యం ఎక్క‌డుందీ, అంద‌రూ యువ‌తులేగా! అని అడ‌గ‌బోతున్నారా? అయితే ఇంకోసారి చూడండి. ఏమీ తెలియ‌డం లేదా..? అయితే కింద ఇచ్చిన ఫోటో చూడండి…

ghost-hand-photo

చూశారుగా..! ఫొటోలో మొత్తం 15 మంది యువతులు ఉండగా దాదాపుగా అంద‌రూ చేతులు క‌ట్టుకునే ఉన్నారు. అందులో కేవ‌లం ఒక యువ‌తి మాత్ర‌మే త‌న చేతుల‌ను న‌డుంపై పెట్టుకుంది. కాగా అదే వ‌రుసలో మ‌రో చివ‌రికి ఉన్న యువతి భుజంపై ఎవ‌రిదో ఓ చేయి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కానీ ప‌క్క‌న ఎవ‌రూ లేరు. అయితే ఆ చేయి దెయ్యానిది అనే ప్ర‌చారం ఇప్పుడు జోరుగా సాగుతోంది.

1900వ సంవ‌త్స‌రంలో బెల్‌ఫాస్ట్ న‌గ‌రంలోని నార్త‌ర్న్ ఐర్లాండ్ ప్రాంతంలో ఉన్న ఓ లినెన్ మిల్‌లో ప‌నిచేస్తున్న యువ‌తులంతా క‌లిసి అప్ప‌ట్లో ఫొటో దిగార‌ట‌. కాగా ఆ ఫొటోను ప్ర‌స్తుతం ఓ ఫొటోగ్రాఫ‌ర్ ఇంట‌ర్నెట్‌లో ఉంచాడు. దీంతో ఈ ఫొటో గురించి సోష‌ల్ మీడియాలో ఇప్పుడు చ‌ర్చ బాగా జ‌రుగుతోంది. అయితే ఈ ఫొటోను ఫొటోషాప్ చేశార‌ని కొంద‌రంటుంటే కొంద‌రు మాత్రం అది నిజ‌మేన‌ని న‌మ్ముతున్నారు. ఏది ఏమైనా ఇప్ప‌టికీ దెయ్యాలున్నాయ‌ని న‌మ్మేవారు చాలా మందే ఉన్నారు. ఇంత‌కీ మీరేమంటారు!

Comments

comments

Share this post

scroll to top