భార్య ప్రసవిస్తున్న దృశ్యాలను ఫేస్‌బుక్ ద్వారా లైవ్ బ్రాడ్‌కాస్ట్ చేసిన భర్త…

ఎవరైనా ఒక వ్యక్తికి ఆనందం కలిగిందంటే దాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఆ వ్యక్తి ఇంకా ఎక్కువ ప్రయత్నిస్తాడు. ఎందుకంటే అలా పంచుకోవడంలో మరింత ఆనందం వస్తుంది కాబట్టి. అమెరికాకు చెందిన ఆ వ్యక్తి కూడా సరిగ్గా ఇలాగే చేశాడు. అయితే అది బిడ్డ జన్మించడం వల్ల వచ్చిన ఆనందం. అందుకోసం అతను సోషల్ మీడియానే మాధ్యమంగా చేసుకున్నాడు. జనాలు ఎక్కువగా వాడే ఫేస్‌బుక్‌లో ఆ ఆనందాన్ని పంచుకుని అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అతను ఏం చేశాడో తెలుసుకోవాలనుందా! అయితే ఇది చదవండి.

baby-delivery-person

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ర్టానికి చెందిన ఫకమలో కిహె ఐకి అనే వ్యక్తి భార్యకు ఒక్కసారిగా పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో అతను ఆమెను దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అయితే ఐకి అంతటితో ఊరుకోలేదు. తన భార్య బిడ్డకు జన్మనిస్తున్న మధుర క్షణాలను తానొక్కడే కాదు, తన బంధువులు, స్నేహితులు, ప్రపంచమంతా చూడాలనుకున్నాడు. తన ఆనందంలో వారిని భాగస్వాములను చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా స్మార్ట్‌ఫోన్ తీసి తన భార్య ప్రసవిస్తున్న దృశ్యాలను ఫేస్‌బుక్ ద్వారా లైవ్ బ్రాడ్‌కాస్ట్ చేశాడు. అలా ఆ వీడియో మొత్తం 45 నిమిషాల పాటు లైవ్‌గా బ్రాడ్‌కాస్ట్ అయింది. ఎట్టకేలకు అతని భార్య పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కాగా కోర్టులో ఓ కేసు విషయమై ఐకి హాజరు కావల్సి ఉండగా దాన్ని వాయిదా వేసుకుని మరీ తన బిడ్డ జన్మించే దృశ్యాలను లైవ్ బ్రాడ్‌కాస్ట్ చేయడం విశేషం.

ఐకి బ్రాడ్‌కాస్ట్ చేసిన వీడియో కేవలం కొద్ది సేపట్లోనే వైరల్‌గా మారింది. దీంతో అతని బంధువులు, స్నేహితులు ఆ వీడియో పట్ల విభిన్నంగా స్పందించారు. అయితే ఫేస్‌బుక్‌లో లైవ్ బ్రాడ్‌కాస్ట్ ఫీచర్ రావడం కొత్తే కానీ, ఈ ఫీచర్‌ను ఇలా వాడుకున్న వారు దాదాపు చాలా అరుదుగా ఉన్నారనే టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఐకి తన ఆనందాన్ని అందరితో పంచుకునే క్రమంలో ప్రపంచమంతటా పాపులర్ అయిపోయాడు.

ఐకి బిడ్డ లైవ్ బర్త్ వీడియోను కింద వీక్షించవచ్చు…

Comments

comments

Share this post

scroll to top