ప్ర‌పంచంలోని పురుష సెల‌బ్రిటీల్లో ఇత‌ను చాలా అంద‌గాడట తెలుసా..?

అంద‌మంటే కేవ‌లం ఆడ‌వాళ్ల‌దేనా. అబ్బే కాదు, మ‌గ‌వాళ్లు కూడా అందంగానే ఉంటారు. నేటి ఆధునిక యుగంలో మ‌హిళ‌లే కాదు, పురుషులు కూడా త‌మ అందానికి అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు. అందుకే పురుషుల కోసం కూడా బ్యూటీ పార్ల‌ర్లు వెలుస్తున్నాయి. స‌రే.. బ్యూటీ పార్ల‌ర్‌కు వెళితే తెచ్చి పెట్టుకున్న అందం అవుతుంది. అది క‌రెక్టే. కానీ అలా బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్ల‌కుండానే అందంగా ఉంటే..? అవును, అత‌ను ఉన్నాడు. ఆ వ్య‌క్తి అందం ఎంతంటే… ప్ర‌పంచంలోనే అత్యంత అంద‌మైన క‌ళ్లు, గ‌డ్డం అత‌నికి ఉన్నాయ‌ట‌. ఇది మేం చెబుతోంది కాదు, ఆ వ్య‌క్తి కొల‌త‌లు కొలిచిన ఓ కంపెనీ ఈ విషయాన్ని వెల్ల‌డించింది.

అత‌ని పేరు హ్యారీ ఎడ్‌వార్డ్ స్టైల్స్. యూకేకు చెందిన ప్ర‌ముఖ న‌టుడు, గాయ‌కుడు, పాట‌ల ర‌చ‌యిత‌. ఈ మ‌ధ్యే విడుద‌లైన ఆంగ్ల సినిమా డంక‌ర్క్‌లో న‌టించాడు. అయితే ఇత‌ని క‌ళ్లు, గ‌డ్డం ప్ర‌పంచంలోనే అంద‌మైన‌వ‌ట‌. ఇలాంటి క‌ళ్లు, గ‌డ్డం ఎవ‌రికీ లేవ‌ట‌. దీంతో ఇత‌నిప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అంద‌గాళ్ల జాబితాలో మొద‌టి స్థానంలో నిలిచాడు. సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌ ఫేషియల్‌ కాస్మెటిక్‌ అండ్‌ ప్లాస్టిక్‌ సర్జరీ అనే కంపెనీ పురుష సెలబ్రిటీల్లో ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవ‌డం కోసం ఓ అధ్య‌య‌నం చేసింది.

ఈ అధ్య‌య‌నంలో భాగంగా ప‌లువురు పురుష సెల‌బ్రిటీల శ‌రీర భాగాల కొల‌త‌ల‌ను ఈ కంపెనీ సేక‌రించింది. ఈ క్ర‌మంలోనే హ్యారీ కూడా కొల‌త‌లు ఇచ్చాడు. అయితే అత‌ని కొల‌త‌లు ఎలా ఉన్నాయంటే… ముఖ్యంగా అతని కళ్ల పొడవు, కళ్ల మధ్య దూరం వంటి అంశాల్లో 98.15 శాతం పర్ఫెక్ట్‌ రేషియో వ‌చ్చింది. ఇక పర్ఫెక్ట్ గ‌డ్డం విషయంలోనూ 99.7 శాతం రేషియోను సాధించాడు. దీంతో ఇత‌నికి ఆ కంపెనీ అంద‌గాళ్ల జాబితాలో మొద‌టి స్థానాన్ని క‌ట్ట‌బెట్టింది. అయితే హ్యారీ ఇలా అంద‌గాడిగా నిల‌వ‌డం ఏమో గానీ, ఇప్పుడ‌త‌నిలా మారేందుకు చాలా మంది ప్లాస్టిక్ స‌ర్జరీలు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నార‌ట‌. అవును మ‌రి, అంతేలే, ఏం చేస్తాం. ఏది ఏమైనా స‌హ‌జంగా వ‌చ్చే అంద‌మే అందం గానీ, ప్లాస్టిక్ స‌ర్జ‌రీల‌తో వ‌చ్చే అందాన్ని అందం అంటారా..?

Comments

comments

Share this post

scroll to top