ఊరికి చేరుకోవాల‌ని బ‌స్సులు దొరక్క క్యాబ్‌లో వెళ్దామ‌నుకున్న ఓ వ్య‌క్తికి ఎదురైన కష్టాలివి. రియ‌ల్ స్టోరీ..!

ఆ రోజు ఏప్రిల్ 29, 2017. మా ఊరికి వెళ్లాల‌నుకుని ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నా. అర్థ‌రాత్రి (ఏప్రిల్ 30, 2017) 12 గంట‌లకు కేఆర్ పురం బ‌స్ స్టాండ్ చేరుకున్నా. అక్క‌డి నుంచి బస్ ద్వారా వెళ్లాల‌ని బ‌స్ కోసం వెయిట్ చేస్తున్నా. అలా 3 గంట‌ల పాటు తెల్ల‌వారుజామున 3 అయ్యే వ‌ర‌కు వెయిట్ చేశా. తిరుప‌తి / చిత్తూరు / మ‌ద‌న‌ప‌ల్లి బ‌స్సుల కోసం ఎంత చూసినా అవి వ‌స్తున్నాయి కానీ ఫుల్ ర‌ష్‌గా ఉంది. స‌మ్మ‌ర్ సీజ‌న్ క‌దా, సెల‌వుల కార‌ణంగా నాకు బ‌స్సులు దొర‌క‌డం లేదు. ఇంత‌లో బ‌స్టాండ్ ర‌ష్ ఎక్కువ‌గా ఉంద‌ని కొద్దిగా ఇవ‌త‌ల‌కు వ‌చ్చా. అప్పుడే నా ముందు ఓ తెలుపు రంగు ఇండికా కారు వ‌చ్చి ఆగింది. అందులో ఉన్న వ్య‌క్తి నన్ను అడిగాడు ఎక్క‌డికెళ్లాల‌ని..? మ‌ద‌న‌ప‌ల్లి వెళ్ళాల‌ని చెప్పా. కారులో కూర్చోమ‌న్నాడు. అప్ప‌టికే అందులో డ్రైవ‌ర్ వెనుక ఓ వ్య‌క్తి కూర్చుని ఉన్నాడు. అత‌ను ప్ర‌యాణికుడు కావ‌చ్చ‌నుకున్నా.

వెంట‌నే కారులో ఎక్కా. నాతో పాటు మ‌రో ఇద్ద‌రు ఆ కారులో ఎక్కారు. ఓ వ్య‌క్తి ముందు సీట్లో డ్రైవ‌ర్ ప‌క్క‌న కూర్చున్నాడు. డ్రైవ‌ర్ వెనుక సీట్లో ఉన్న వ్య‌క్తి అలాగే ఉన్నాడు. అత‌ని ప‌క్క‌నే మ‌రో వ్య‌క్తి మ‌ధ్య‌లో కూర్చున్నాడు. నేను అత‌ని ప‌క్క కూర్చున్నా. ఇంత‌లో కారు స్టార్ట్ అయింది. అది నెమ్మ‌దిగా వెళ్తోంది. కేఆర్ పురం దాటుతుండ‌గా హోస్కోట్‌కు వెళ్లేందుకు ఫ్లై ఓవ‌ర్ వ‌స్తుంది. బ‌స్సులు, క్యాబ్‌లు, అన్ని వాహ‌నాలు ఆ ఫ్లై ఓవ‌ర్ మీది నుంచే వెళ్లాలి. నేను ప్ర‌యాణిస్తున్న కారు కూడా అదే ఫ్లై ఓవ‌ర్ మీది నుంచి వెళ్తుంద‌ని అనుకున్నా. కానీ అలా జ‌ర‌గ‌లేదు. అది వేరే దారిలో వెళ్ల‌డం మొద‌లు పెట్టింది. ఫ్లై ఓవ‌ర్ రాక‌ముందే దాన్ని న‌డుపుతున్న డ్రైవ‌ర్ కారును ప‌క్క‌కు మ‌ళ్లించాడు. వేరే దారిలోకి తీసుకెళ్లాడు. ఆ దారి అంతా నిర్మానుష్యంగా, చీక‌టిగా ఉంది.

నాక‌ప్పుడే అనుమానం వ‌చ్చింది. అప్ప‌టికే కారు వేగం అందుకుంది. అంత‌లో నా ప‌క్క‌నే ఉన్న వ్య‌క్తి కారు డ్రైవ‌ర్‌ను అడిగాడు, ఎక్క‌డికి తీసుకెళ్తున్నావ‌ని..? అత‌ను స‌మాధానం చెప్ప‌లేదు స‌రిక‌దా, కారు వేగం పెంచాడు. ఇంత‌లోనే కారు డ్రైవ‌ర్ వెనుక సీట్లో ఉన్న వ్య‌క్తి పెద్ద క‌త్తి బ‌య‌టికి తీసి మ‌మ్మ‌ల్ని బెదిరించ‌సాగాడు. ముందు సీట్లో ఉన్న వ్య‌క్తి, నేను, నా ప‌క్క‌న ఉన్న వ్య‌క్తిని కూడా అత‌ను బెదిరిస్తూ, మీ వ‌ద్ద ఉన్న‌వి అన్నీ ఇచ్చేయాల‌ని క‌త్తి చూపాడు. మాకు చాలా భ‌యం వేసింది. మేం త‌ప్పించుకుందామ‌నుకునే లోపే కారు డ్రైవ‌ర్ డోర్ల‌ను లాక్ చేశాడు. మాకు అవ‌కాశం లేకుండా పోయింది.

మా వ‌ద్ద ఉన్న డ‌బ్బులు, బంగారు ఆభ‌ర‌ణాల‌ను వారు దోచుకున్నారు. నా ద‌గ్గ‌ర ఉన్న రూ.20వేలు, ముందు సీట్లో ఉన్న వ్య‌క్తి నుంచి రూ.5వేలు, నా ప‌క్క‌న ఉన్న వ్య‌క్తి నుంచి రూ.600ను వారు దోపిడీ చేశారు. అనంత‌రం మా ముగ్గుర్నీ కారు నుంచి తోసేశారు. వారు అక్క‌డి నుంచి పారిపోయారు. అప్పుడే మేం ప‌రిగెత్తుకు వెళ్లి స‌మీపంలో ఉన్న లారీ డ్రైవ‌ర్ల‌ను బ‌తిమాలాం, స‌హాయం చేయాల‌ని. వారు స్పందించ‌లేదు. ఆ త‌రువాత మ‌రికొంత దూరం వెళ్లి మ‌రో లారీని ఆపి అత‌న్ని లిఫ్ట్ అడిగాం. అలా ఆ లారీలో ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు హోస్కోట్ టోల్‌గేట్ చేరుకున్నాం. ఆ త‌రువాత నేను క‌డ‌ప బ‌స్ ఎక్కి ఊరికి చేరుకున్నా.

ఇది స్టోరీ కాదు, నిజంగా జ‌రిగిన ఘ‌ట‌నే. క్యాబ్‌ల‌ను గ‌నుక మీరు ఆశ్ర‌యిస్తుంటే ఒక‌సారి ఎందుకైనా మంచిది చెక్ చేసుకోండి. అనుమానం వ‌స్తే వెంట‌నే పోలీసుల‌కు కాల్ చేయండి..!

Comments

comments

Share this post

scroll to top