15 సంవత్సరాల క్రితపు వీడియో… థియేటర్ లో నాపేరు ముఖేష్ బదులు ఇది వేస్తే వస్తుందేమో మార్పు..!

”ఆనందాన్ని ఎవ‌రు కోరుకోరు..?  కానీ ఎంత మూల్యానికి..?  ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది..! ధూమ‌పానం మీకు హానిక‌రం. ఈ న‌గ‌రానికి ఏమైంది..! ఓ వైపు నుసి… మ‌రో వైపు పొగ‌..! ఎవ‌రూ నోరు మెద‌ప‌రేంటి..?  దీన్ని మౌనంగా ఎందుకు భ‌రించాలి..! నా పేరు ముఖేష్‌..! ” ఇదీ… ఇప్పుడు సినిమా థియేట‌ర్ల‌లో ధూమ‌పాన ప్రియుల‌ను ఉద్దేశించి వేసే యాడ్‌. ఈ యాడ్ చూసి ధూమపానం, పొగాకు ఉత్ప‌త్తుల‌ను వాడ‌డం ఎంత మంది మానేశారో చెప్ప‌లేం కానీ… గ‌తంలో ఓ సంస్థ చేసిన సర్వేలో తేలిందేమిటంటే… ఈ యాడ్‌ను చూసి ప‌క ప‌కా న‌వ్వుకునే వారు ఎక్కువ‌య్యారు త‌ప్ప‌, అది ఏ మాత్రం ప్ర‌భావం చూపించ‌లేక‌పోతుంద‌ట‌..!

no-smoking-ad
మరి ధూమ‌పానం చేసే వారి కోసం ఏదో ఒక యాడ్ వేయాలి క‌దా. క‌నుకే ఆ యాడ్‌ను ఇప్ప‌టికీ ర‌న్ చేస్తున్నారు. కానీ మీకు తెలుసా..? ఆగిల్‌వీ అండ్ మాథ‌ర్ అనే ఓ ప్ర‌ముఖ అడ్వ‌ర్ట‌యిజింగ్ ఏజెన్సీ 2001వ సంవ‌త్స‌రంలోనే ఇలాంటి ఓ నో స్మోకింగ్ యాడ్‌ను తీసింది. కానీ అది ఇప్ప‌టి నో స్మోకింగ్ యాడ్‌లా ఫ‌న్నీగా ఉండ‌దు. దాన్ని బాగా ప‌రిశీలించి అర్థం చేసుకుంటే ఆ యాడ్ ఎందుకు తీశారో తెలుస్తుంది.

ధూమ‌పానం చేసే వారిని దాన్ని మానేమంటే విన‌రు క‌దా..! అలాంటి డైరెక్ట్ ప్ర‌క‌ట‌న‌లు, యాడ్స్ ఏవి ఇచ్చినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఎందుకంటే అది చాలా మందికి వ్య‌స‌నంగా మారింది. కానీ స‌ద‌రు ఆగిల్‌వీ సంస్థ తీసిన యాడ్ చూస్తే ధూమ‌పానం చేసే వారు కూడా మానేసేందుకు ఎంతో కొంత అవ‌కాశం ఉంటుంద‌ని నెటిజ‌న్లు భావిస్తున్నారు. ఇప్పుడు థియేట‌ర్ల‌లో వ‌స్తున్న నో స్మోకింగ్ యాడ్ బ‌దులు అలాంటి యాడ్‌ను తీసి ప్లే చేస్తే కొంత‌లో కొంత ఫ‌లితం ఉంటుంద‌ని అనుకుంటున్నారు. ఆ యాడ్‌ను మీరే చూడండి..!

చూశారుగా..! ఎంత తెలివిగా యాడ్ తీశారో..! బ‌స్సులో ఓ సీటులో కూర్చున్న ఇద్ద‌రు ప్ర‌యాణికుల వెనుక ఓ వ్య‌క్తి సిగ‌రెట్ తాగ‌డం మొద‌లు పెడతాడు. అది గ‌మ‌నించిన ఆ ఇద్ద‌రు ప్ర‌యాణికుల్లో ఒక‌రు త‌న సీట్ ఆ వ్య‌క్తికి ఇచ్చి కూర్చోమంటాడు. నిజానికి ఆ ప్ర‌యాణికులు సిగ‌రెట్ తాగ‌డం మాన‌మ‌ని ఆ వ్య‌క్తికి చెప్ప‌వ‌చ్చు. అయినా వారు అలా చేయ‌లేదు. అందుకు బ‌దులుగా ఓ ప్ర‌యాణికుడు త‌న సీట్‌ను ఆ వ్య‌క్తికి ఇస్తాడు. కానీ ఆ వ్య‌క్తికి ఏమీ అర్థం కాదు. సీట్‌లో కూర్చుంటాడు. నిజానికి ఆ యాడ్ అర్థ‌మేమిటంటే… ధూమ‌పానం చేయ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు వ‌చ్చి చాలా మంది ఆయువు తీర‌కుండానే చ‌నిపోతున్నార‌ని, క‌నుక ధూమ‌పానం చేసే వారి ఆయుష్షు త‌క్కువ‌గా ఉంటుంది కాబట్టి వారిని ఇప్ప‌టి నుంచే క‌ష్ట‌పెట్ట‌కుండా చూసుకోవాలని, బ‌తికే కొద్ది రోజులు వారు తృప్తిగా ఉంటార‌ని దాని సారాంశం… ఈ యాడ్‌ను గ‌న‌క ఇప్పుడు ప్లే చేస్తే బాగుంటుంద‌ని చాలా మంది అభిప్రాయం..! మ‌రి మీరేమంటారు..?

Comments

comments

Share this post

scroll to top