ఒక కోటి 97 ల‌క్ష‌ల‌కు కుచ్చుటోపి.! ఫేస్ బుక్ లో ప‌రిచ‌య‌మైన వ్య‌క్తిని న‌మ్మి ఉన్న‌దంతా కోల్పోయిన ఓ వ్య‌క్తి రియల్ స్టోరి!!

నేడు న‌డుస్తున్నదంతా మోస‌గాళ్ల కాలం. ఆద‌మరిచి నిర్ల‌క్ష్యంగా ఉంటే దోచుకునే వారు అడుగ‌డుగునా మ‌న‌కు తార‌స‌ప‌డుతున్నారు. అలాంటిది మ‌నం తెలిసి తెలిసీ మోస‌గాళ్ల బారిన ప‌డ‌డ‌మంటే అది మ‌న త‌ప్పిద‌మే అవుతుంది. ఓ ముంబై వాసికి స‌రిగ్గా ఇలాగే జ‌రిగింది. ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ పేరిట ఆన్ లైన్‌లో ప‌రిచ‌యం అయిన కొంద‌రి వ‌ల‌లో ప‌డ్డాడు. ఫ‌లితంగా రూ.1.97 కోట్ల‌ను పోగొట్టుకున్నాడు. దీంతో పోలీసులు ప్ర‌స్తుతం కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. అస‌లింత‌కీ ఈ ఘ‌ట‌న ఎలా జ‌రిగిందంటే…

ముంబైకి చెందిన ఓ వృద్ధుడికి ఫేస్‌బుక్‌లో ఓ వ్య‌క్తి ప‌రిచ‌యం అయ్యాడు. అత‌ను తన‌ను తాను అమెరికా ఆర్మీలో ప‌నిచేస్తున్న సైనికున్న‌ని చెప్పి ప‌రిచ‌యం చేసుకున్నాడు. ఓ మిల‌ట‌రీ ఆప‌రేష‌న్ నిమిత్తం ఆప్ఘ‌నిస్తాన్‌లో ఉన్న‌ట్టు చెప్పాడు. అక్క‌డే ఓ ఇన్వెస్ట్‌మెంట్ స్కీం ఉంద‌ని, అందులో డ‌బ్బులు పెడితే బాగా ఆదాయం వ‌స్తుంద‌ని నమ్మ‌బ‌లికాడు. త‌న బ్రాంచ్ ఢిల్లీలో కూడా ఉంద‌ని, ప‌లు బ్యాంకుల్లో త‌మ కంపెనీ ఖాతాలు ఉన్నాయ‌ని చెప్పాడు. దీంతో ఆ మాట‌ల‌ను ఆ వృద్ధుడు న‌మ్మి రూ.1.97 కోట్ల వ‌ర‌కు విడ‌త‌ల వారీగా ఆ వ్య‌క్తి సూచించిన ప‌లు ఖాతాలలో జ‌మ చేశాడు. అయితే ఆ ఖాతాలు నిజానికి ఆ వ్య‌క్తి చెప్పిన‌ట్టు కంపెనీ పేర్ల మీద లేవు. అవి న‌కిలీ ఖాతాలు. ఇలాంటి మోసం చేసేందుకు స‌ద‌రు వ్య‌క్తితో క‌లిసి ఢిల్లీకి చెందిన అమిత్ అగ‌ర్వాల్‌, స‌మీర్‌, క‌ర‌ణ్ శ‌ర్మ‌, మంగ‌ళ్ బిష్ణోయ్‌, జితేంద్ర రాథోడ్‌, ప‌రేష్ నిష్బంద్ అనే వ్య‌క్తుల‌కు చెందిన‌వి. వీరు ఢిల్లీలో ఉన్న ప‌లు బ్యాంకుల‌కు చెందిన 108 శాఖ‌ల్లో న‌కిలీ పాన్ కార్డుల‌తో ఖాతాలు ఓపెన్ చేశారు. వాటిల్లోనే ఆ వృద్ధుడు డ‌బ్బులు డిపాజిట్ చేశాడు.

అయితే ఆ వృద్ధున్ని న‌మ్మించ‌డం కోసం పైన చెప్పిన వ్య‌క్తులు న‌గ‌దు క‌ట్టిన‌ట్టుగా ఓ న‌కిలీ సర్టిఫికెట్‌ను కూడా ఓ మహిళ‌చే ఆ వృద్ధునికి ఇప్పించారు. ఆ వృద్ధుని ఈ-మెయిల్ కు కూడా ఆ సర్టిఫికెట్‌ను పంపారు. దీంతో ఈ తంతు అంతా నిజ‌మే అని ఆ వృద్ధుడు న‌మ్మాడు. ఈ క్రమంలోనే ఇన్వెస్ట్‌మెంట్ తాలూకు డ‌బ్బుల‌ను తీసుకోండి అంటూ వారు ఆ వృద్ధుడికి ఓ బ్యాంక్ డెబిట్ కార్డును పంపారు. దాన్ని ఆ వృద్ధుడు ఏటీఎంలో పెట్టి డ‌బ్బులు డ్రా చేసేందుకు య‌త్నించ‌గా అది న‌కిలీద‌ని తెలిసింది. దీంతో అతను బోరున విలపిస్తూ పోలీసులను ఆశ్ర‌యించాడు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని పైన చెప్పిన వ్య‌క్తుల‌ను అరెస్టు చేశారు. అయితే అప్ప‌టికే వారి అకౌంట్ల‌లో ఆ వృద్ధుడు డిపాజిట్ చేసిన న‌గదును ఆ వ్య‌క్తులు విత్ డ్రా చేసుకున్నారు. కాగా ఈ అంద‌రి వెనుక ఓ నైజీరియ‌న్ గ్యాంగ్ ఉన్న‌ట్టు పోలీసులు భావిస్తున్నారు. చూశారుగా… ఫేస్‌బుక్ లో అయిన ప‌రిచ‌యం ఎంత‌కు దారి తీసిందో. క‌నుక మీకు కూడా ఇలాంటి వ్య‌క్తులు స్కీంల పేరిట ఆశ చూపితే అస్స‌లు న‌మ్మ‌కండి..!

Comments

comments

Share this post

scroll to top