కేర‌ళ‌కు చెందిన ఓ ప్ర‌ముఖ వార్తా ప‌త్రిక ఈ నెల 3వ తేదీన త‌న మొద‌టి పేజీలో వార్త‌ల‌ను ప్ర‌చురించ‌లేదు. న‌ల్ల రంగు పులిమి పేజీని ప్రింట్ చేసింది. ఎందుకో తెలుసా..?

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో అక్క‌డి భాష‌ల‌కు అనుగుణంగా అనేక వార్తా ప‌త్రిక‌లు న‌డుస్తున్నాయి. కొన్ని దిన ప‌త్రిక‌లు అయితే కొన్ని వార, మాస ప‌త్రిక‌లు ఉన్నాయి. అయితే ఏ ప‌త్రిక అయినా వార్త‌లు, క‌థ‌నాలను ప్ర‌చురిస్తుంది. అవి ఏ న్యూస్ పేప‌ర్‌లో అయినా మ‌న‌కు క‌నిపిస్తాయి. కానీ కేర‌ళ‌లోకు చెందిన ఓ మ‌ళ‌యాళీ దిన‌ప‌త్రిక మొన్నా మ‌ధ్యే ఓ రోజు త‌న ఫ్రంట్ పేజీలో ఎలాంటి వార్త‌ల‌ను, క‌థ‌నాల‌ను, ఆఖ‌రుకి యాడ్స్‌ను కూడా ప్ర‌చురించ లేదు. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. మొత్తం ఉన్న వార్త‌ల‌ను కొట్టేస్టూ వాటిపైన న‌ల్ల రంగు వ‌చ్చేలా పేజీని కంపోజ్ చేసి ప్ర‌చురించింది. దీన్ని చూసిన అక్క‌డి చాలా మంది పాఠ‌కులు మొద‌ట ఆ ప‌త్రికలో తప్పు జ‌రిగి ఉంటుందని, అందుకే పేజీ అలా ప్రింట్ అయి ఉంటుంద‌ని భావించారు. కానీ విష‌యం తెలుసుకుని ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. ఇంత‌కీ ఆ ప‌త్రిక అలా ఎందుకు త‌న ఫ్రంట్ పేజీని ప్రింట్ చేసిందో తెలుసా..?

కేర‌ళ‌లోని మాతృభూమి అనే దిన‌ప‌త్రిక అది. ఒక‌ప్పుడు… అంటే.. స్వాతంత్ర్యం రాక ముందు నుంచి ఈ పేప‌ర్ అక్క‌డ న‌డుస్తుంద‌ట‌. గాంధీజీ ఓసారి ఆ ప‌త్రిక కార్యాల‌యానికి కూడా వెళ్లి దాన్ని సంద‌ర్శించార‌ట‌. అంత‌టి ప్ర‌ముఖ‌మైన వార్తా ప‌త్రిక ఈ నెల 3వ తేదీన త‌న పేప‌ర్ మొద‌టి పేజీని ప్రచురించ‌లేదు. అలా అని చెప్పి పేజీ ఖాళీగా కూడా లేదు. అందులో వార్త‌ల‌ను ప్ర‌చురించింది కానీ, వాటిని కొట్టేసినట్టుగా వాటిపై న‌ల్ల రంగును పులిమి పేజీని కంపోజ్ చేసి ప్రింట్ చేసింది. దీంతో ఆ రోజున ఆ పేప‌ర్‌ను చ‌దివిన వారు మొద‌ట ఏమ‌నుకున్నారంటే.. ఆ పేప‌ర్ వారే ఏదో మిస్టేక్ చేసి ఉంటార‌ని అనుకున్నారు. అయితే అలా కాదు, కావాల‌నే వారు ఆ పేప‌ర్‌ను అలా ప్ర‌చురించిన‌ట్టు తెలిసింది. వారు అలా ఎందుకు ప్ర‌చురించారంటే… జర్న‌లిజం, జ‌ర్న‌లిస్టు అనే ప‌దాలు వాడుక‌లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అంటే వార్తా ప‌త్రిక‌లు ప్రింటింగ్ అయిన నాటి నుంచి ఎంతో మంది నిజాయితీ గ‌ల జ‌ర్న‌లిస్టులు అవినీతి ప‌రుల అక్ర‌మాల‌ను, నేరాల‌ను వెలుగులోకి తెచ్చారు. ఈ క్ర‌మంలో కొంద‌రు బెదిరింపులకు లోన‌య్యారు. కొంద‌రు దుండ‌గుల చేతిలో గాయ‌ప‌డ్డారు. ఇంకా కొంద‌రైతే త‌మ కుటుంబ స‌భ్యుల‌తో స‌హా ప్రాణాల‌నే కోల్పోయారు.

ఇలా ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ప‌నిచేస్తున్న జ‌ర్న‌లిస్టులు ఏదో ఒక సంద‌ర్భంలో ప్రాణాపాయ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నారు. దీంతో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వెలుగులోకి రావ‌డం లేదు. మ‌రో వైపు ప్ర‌జా ప్ర‌తినిధులు, బ‌డాబాబులు న్యూస్ పేప‌ర్లు, జ‌ర్న‌లిస్టుల గొంతు నొక్కుతున్నారు. ఈ క్ర‌మంలో వారు త‌మ వాణిని వినిపించ‌లేక‌పోతున్నారు. అలాంటి వారందరికీ స‌పోర్ట్‌గా నిలుస్తూ మాతృభూమి ప‌త్రిక త‌న ప‌త్రిక మొద‌టి పేజీని అలా న‌ల్ల‌రంగుతో ప్రింట్ చేసింది. నిజాయితీ క‌లిగిన జ‌ర్న‌లిస్టుల‌కు మ‌ద్దతునందించాల‌ని ఆ పేప‌ర్ విజ్ఞప్తి చేసింది. మే3వ తేదీ వ‌ర‌ల్డ్ ప్రెస్ ఫ్రీడం డే అని, అందుకే త‌మ మొద‌టి పేజీని అలా ప్ర‌చురించామ‌ని మాతృభూమి ప‌త్రిక తెలిపింది. అవును మ‌రి, అంతే క‌దా. నిజాయితీ క‌లిగిన జ‌ర్న‌లిస్టుల‌కు అంద‌రూ మ‌ద్ద‌తు తెలపాలి. అవును, అవినీతి ప‌రులైన జ‌ర్న‌లిస్టులు కూడా ఉన్నారు కానీ… నీతిమంతుల‌కు మ‌నం ఎప్పుడూ మ‌ద్ద‌తు ప‌ల‌కాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top