కొత్త ఇల్లు కట్టేటప్పుడు ఇవి మాత్రం ఖచ్చితంగా పాటించాలి..!!

మీరు కొత్తగా ఇల్లు కడుతున్నారా? లేదా ఇల్లు కొనాలనుకుంటున్నారా? వాస్తు గురించి దిగులుగా ఉన్నారా? అయితే ఇది మీ కోసమే మీరే చదవండి.

 

ఇప్పటి కాలంలో చాలా వరకు అందరూ ఇంట్లోనే టాయిలెట్స్ పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు. కొందరు తెలియక టాయిలెట్స్ పక్కనే గృహనిర్మాణాలు చేపడుతుంటారు. మళ్ళీ ఇలా చేయడం కరెక్టో కాదో తెలియక టెన్షన్ పడుతుంటారు. అయితే ఇలాంటి వారి కోసమే పండితులు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

చాలా మంది తమ తమ ఇండ్లకి ఉత్తరం, తూర్పులో మరుగుదొడ్లు కడుతున్నారు. తూర్పు, ఉత్తరాలు సూర్యుని నుంచి వచ్చే ఉషోదయ కిరణాలు. ఈ కిరణాలు నేరుగా మన ఇంట్లోకి పడతాయి. అయితే ఇప్పుడందరు ఈ దశలలో డ్రైనేజీ, టాయిలెట్స్ నిర్మిస్తున్నారు. దీని వల్ల సూర్యకిరణాలు కలుషిత గాలి, మలినాలతో, సూక్ష్మక్రిములతో ఉండి ఇంటిని అక్రమిస్తుంది.

దీని వలన అందమైన గృహాలు ఆరోగ్య హీనంగా మారిపోతున్నాయి. ఇల్లు కట్టేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే మనం ఇంటి వాతావరణానికి ఇవ్వకుంటే ఏం ఉపయోగమని పండితులు ప్రశ్నిస్తున్నారు.
కాబట్టి మీ ఇల్లుని ఆరోగ్యాంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వెంటనే టాయిలెట్ ని మార్చండి.

Comments

comments

Share this post

scroll to top