బాబోయ్‌… ఆ సినిమా మొత్తం అవే సీన్ల‌ట‌..!

సినిమాల్లో న‌టీ న‌టుల మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాలు ఉండ‌డం స‌హ‌జ‌మే. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు అన్నాక ఆ మాత్రం శృంగార ర‌సంతో కూడిన సీన్లు సినిమాల్లో ఉంటాయి. అభిమానుల అభిరుచి మేర‌కు చిత్ర ద‌ర్శ‌కులు అలాంటి సీన్ల‌ను క‌చ్చితంగా పెడ‌తారు. అయితే… సినిమాలో ఎక్క‌డో ఒక చోట ఒక‌టి రెండు రొమాంటిక్ సీన్లు, బోల్డ్ స‌న్నివేశాలు ఉంటే అది ఓకే. కానీ… అలా కాకుండా సినిమా మొత్తం ఆ సీన్లే ఉంటే..? ఉంటే ఇంకేమ‌వుతుంది… అది బి-గ్రేడ్ సినిమా అవుతుంది. అవును, అది క‌రెక్టే..! ఈ మ‌ధ్య విడుద‌ల‌య్యేందుకు సిద్ద‌మైన ఓ సినిమా కూడా స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతుంది. ఇంత‌కీ ఆ సినిమా ఏంటి..?

ramudu-seetha-1
ఇప్పటిలో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు..! ఇదే ఆ సినిమా. పేరు వింటానికే చాలా చిత్రంగా ఉంది క‌దా..! అలా అని చెప్పి అదేదో వెరైటీ సినిమా అనుకుని వెళ్లేరు..? అడ్డంగా బుక్కై పోతారు. ఎందుకంటే ఆ సినిమా యూత్‌ను టార్గెట్ చేసి తీసింది. సినిమా మొద‌ట్నుంచీ చివ‌రి వ‌ర‌కు బోల్డ్ సీన్లు పుష్క‌లంగా ఉన్నాయ‌ట‌. అందుక‌ని… మీరు గ‌న‌క ఆ సినిమాకు వెళితే ఒంటరిగా వెళ్ల‌డం, లేదంటే స్నేహితుల‌తో వెళ్ల‌డం మంచిది. ఫ్యామిలీతో మాత్రం అస్స‌లు వెళ్ల‌కూడ‌దు.

ramudu-seetha-2
అస‌లు ఈ సినిమా గురించి ఇలా ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం ఎందుకొచ్చిందంటారా..? ఏమీ లేదండీ… ఇప్పుడు కాదు గానీ… ఒక‌ప్పుడు మ‌న ద‌గ్గ‌ర కొన్ని థియేట‌ర్ల‌లో బి-గ్రేడ్ సినిమాలు ఎలా ఆడేవో తెలుసు క‌దా..! ఇప్పుడంటే అలాంటి సినిమాలు రావ‌డం లేదు. అయితే… చాలా సంవ‌త్స‌రాల త‌రువాత మ‌ళ్లీ అలాంటి సినిమాయే ఇప్పుడు పైన చెప్పిన రాముడిలా సీతలా సినిమా రూపంలో వ‌స్తుంద‌ట‌. ఈ సినిమా ఒక‌ప్ప‌టి బి-గ్రేడ్ సినిమాల‌ను త‌ల‌ద‌న్నే రీతిలో ఉంటుంద‌ట‌. అలా రెచ్చిపోయే సీన్ల‌ను తీశార‌ట ఈ సినిమాలో. అలా అని మేం చెప్ప‌డం లేదు. ఆ చిత్ర నిర్మాతలే అంటున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన పలు స్టిల్స్ విడుద‌ల‌య్యాయి. వాటిని చూస్తేనే ఒక రేంజ్‌లో హాట్ హాట్‌గా ఉన్నాయ‌ని సినీ ప్రేక్ష‌కులు అంటున్నారు. మ‌రి అంత‌టి బోల్డ్ సీన్లు ఉన్న సినిమా విడుద‌ల‌వుతుందా..? అయినా దానికి ఎన్ని సెన్సార్ క‌ట్స్ ప‌డ‌తాయి..? ప‌డ్డా… ఆ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాక… ఏవైనా ఆందోళ‌నలు జ‌రుగుతాయా..? అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది..!

Comments

comments

Share this post

scroll to top