పుట్టు మ‌చ్చ‌ల‌తో అస‌హ్యంగా ఉన్నావ‌ని ఏడిపించినా మోడ‌ల్ అయి ఆమె ఆశ్చ‌ర్య‌ప‌రిచింది..!

సాధార‌ణంగా ఎవ‌రికైనా పుట్టు మ‌చ్చ‌లు ఉంటాయి. కొంద‌రికి అవి పుట్టుక‌తోనే వ‌స్తే, కొంద‌రిలో మాత్రం వ‌యస్సు పెరిగే కొద్దీ అవి ఏర్ప‌డుతూ ఉంటాయి. అయితే పుట్టు మ‌చ్చ‌లు ఎలా ఏర్ప‌డినా వాటి ప‌రిమాణం మాత్రం చిన్న‌దిగానే ఉంటుంది. చాలా అరుదైన సంద‌ర్భాల్లో మాత్ర‌మే పెద్ద పుట్టు మ‌చ్చ‌లు ఏర్ప‌డతాయి. కానీ… ఆ యువ‌తికి మాత్రం అలా కాదు. శ‌రీరం అంతా పుట్టు మ‌చ్చ‌లే. కొన్ని పెద్ద‌వి, మ‌రికొన్ని చిన్న‌వి. అక్క‌డా ఇక్క‌డా అని కాదు, ముఖం, కాళ్లు చేతులు, వీపు… ఇలా శ‌రీరం మొత్తం ఆమెకు దాదాపుగా 500కు పైగా పుట్టు మ‌చ్చ‌లు ఏర్ప‌డ్డాయి. దీంతో ఆమెను చిన్న‌ప్ప‌టి నుంచి అంద‌రూ హేళ‌న చేశారు. అయితే ఇప్పుడామె గొప్ప మోడ‌ల్ అయింది. ఒక‌ప్పుడు త‌న‌ను గేలి చేసిన వారే ముక్కున వేలేసుకునేలా చేసింది.


ఆమె పేరు ఆల్బా ప‌రెజో.  స్పెయిన్‌లోని బార్సిలోనాలో నివాసం ఉంటోంది. ఆమె వ‌య‌స్సు 16 సంవ‌త్స‌రాలు. అయితే చిన్న‌ప్ప‌టి నుంచి ఆమె శ‌రీరంపై విపరీత‌మైన పుట్టు మ‌చ్చ‌లు ఏర్ప‌డుతూ వ‌చ్చాయి. కాంజెనిట‌ల్ మెలానోసైటిక్ నెవస్ అనే వ్యాధి కార‌ణంగా ఆమె శ‌రీరంపై అంత‌టా పుట్టు మ‌చ్చ‌లు ఏర్ప‌డ్డాయి. దీంతో ఆమెను స్కూల్ లోనే కాదు, కాలేజీలో, బ‌య‌ట కూడా అంద‌రూ ఏడిపించే వారు. పుట్టు మ‌చ్చ‌లు ఎక్కువ‌గా ఉన్న కార‌ణంగానే ఆమెను డాల్మేష‌న్ డాగ్ అని, ఏలియ‌న్ (గ్ర‌హాంత‌ర వాసి) అని పిలిచే వారు. దీంతో ఆల్బా కొంత వేద‌న‌కు లోనైంది.


అయితే సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఆమెకు అంతా మంచే జ‌రిగింది. ఎందుకంటే ఆమె రోజు అనూహ్యంగా ఓ నిర్ణ‌యం తీసుకుంది. త‌న చిన్న‌ప్ప‌టి ఫోటోల‌తోపాటు కొన్ని ఇత‌ర ఫొటోలు, వీడియోల‌ను ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌ల‌లో షేర్ చేసింది. దీంతో ఆమె రాత్రికి రాత్రే పాపుల‌ర్ అయింది. విప‌రీత‌మైన సంఖ్య‌లో ఆమె పోస్టుల‌కు ట్వీట్లు, రిప్లైలు, షేర్‌లు, లైక్‌లు వ‌చ్చాయి. దీంతో ఆమె రాత్రికి రాత్రే ఓ గొప్ప మోడ‌ల్ అయింది. ఓ మోడ‌లింగ్ ఏజెన్సీ ఆమెతో కాంట్రాక్టు కుదుర్చుకుంది. అలా ఆల్బా ప‌రెజో త‌న‌ను గేలి చేసిన వారే ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది. అదీ… ఆమె తెలివితేట‌ల‌కు నిద‌ర్శ‌నం. ఏది ఏమైనా ఆల్బా చేసిన ప‌ని భ‌లే బాగుంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top