రూ.3.60 కోట్ల‌తో కొడుక్కి కారు కొనిచ్చిన టీడీపీ ఎమ్మెల్యే..!

పిల్ల‌లు అడ‌గాలే గానీ వారు కోరింది తెచ్చివ్వ‌ని త‌ల్లిదండ్రులు ఉంటారా..? ఎవ‌రి తాహ‌తుకు త‌గిన‌ట్టుగా వారు తమ త‌మ పిల్ల‌లు కోరిన‌ట్టు చేస్తారు. ఇక బ‌డాబాబులు అయితే వారి పిల్ల‌లు కోర‌డ‌మే ఆల‌స్యం, కొండ మీది కోతినైనా తెచ్చిస్తారు. అందుకు వెనుకా ముందు చూడ‌రు. ఖ‌ర్చుకు వెన‌కాడ‌రు. ఈ క్ర‌మంలోనే తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి త‌న కుమారుడు అలా కోరాడో లేదో ఏకంగా రూ.3.60 కోట్ల విలువైన కారు న‌డుచుకుంటూ ఇంటి ముందుకు వ‌చ్చేసింది..!

asmith-car

తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి త‌న కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డికి రూ.3.60 కోట్ల రూపాయ‌ల కారును గిఫ్ట్ ఇచ్చారు. ఆ కారు ల్యాంబోర్గినీ కంపెనీది. దాని వేగం గంట‌కు 320 కిలోమీట‌ర్లు. లీట‌ర్ పెట్రోల్ పోస్తే 3 కిలోమీట‌ర్ల మైలేజ్ ఇస్తుంది. ఇట‌లీలో త‌యారైన ఈ కార్ ముంబై వ‌ర‌కు నౌక‌లో వ‌చ్చింది. అటు నుంచి తాడిప‌త్రికి కంటెయినర్ ద్వారా తెచ్చారు. దీన్ని ఈ మ‌ధ్యే అస్మిత్‌కు ప్ర‌జెంట్ చేశారు కూడా.

ఈ క్ర‌మంలో ఇప్పుడీ కారు విష‌యం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి టీడీపీకి చెందిన వాడు కావ‌డం, ఎవరూ ఊహించ‌ని రీతిలో అంత పెద్ద మొత్తంలో డ‌బ్బు వెచ్చించి కారును కొనుగోలు చేయ‌డంతో ఈ విష‌యం తెలిసిన జ‌నాలు షాక్‌కు గుర‌వుతున్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీలైతే ఈ విష‌యం ప‌ట్ల ఘాటు విమ‌ర్శ‌లే చేస్తున్నాయి. అయినా వాటిని అధికార ప‌క్షం ప‌ట్టించుకుంటుందా..? అన్న‌ట్టు ఇంకో విషయం… అస్మిత్ తెప్పించుకున్న ఆ కారు ఏపీలో ఎవ‌రికీ లేద‌ట‌. అదే మొద‌టిద‌ట‌. ఇంకో విష‌యం ఏమిటంటే… జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డికి ఆ కారు న‌డ‌ప‌డ‌మంటే ఇష్ట‌మ‌ట‌. అందుకే తెప్పించాన‌ని మ‌రో మాట చెప్పాడు. ఇంత‌కీ ఆ కారు కొడుక్కా..? ఆయ‌న‌కా..?

ఈ కంపెనీ కార్లు క‌లిగి ఉన్న కొంత మంది ప్ర‌ముఖులు:

  • జాన్ అబ్ర‌హం-బాలీవుడ్ న‌టుడు.
  • గౌత‌మ్ సింఘానియా- రేమాండ్స్ చైర్మ‌న్.
  • యువ‌రాజ్ సింగ్- క్రికెట‌ర్
  • శిల్పాశెట్టి- బాలీవుడ్ న‌టి
  • అనిల్ అంబానీ- వ్యాపార వేత్త‌.
  • మ‌ల్లికా శెరావ‌త్- బాలీవుడ్ న‌టి

Car Interior Desing:

Comments

comments

Share this post

scroll to top