ఆ రాష్ట్రానికి చెందిన మంత్రి 700 మంది పెళ్లి కూతుళ్ల‌కు బ్యాట్ల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చాడు. ఎందుకో తెలుసా..?

పెళ్ల‌య్యాక నూత‌న వ‌ధూవ‌రుల‌కు ఎవ‌రైనా బ‌హుమ‌తుల‌ను అందజేస్తారు. చుట్టాలు, కుటుంబ స‌భ్యులు, స్నేహితులు… ఇలా ఎవ‌రైనా త‌మకు తోచిన రీతిలో, తాహ‌తుకు త‌గిన‌ట్టుగా బ‌హుమానాల‌ను వ‌ధూవ‌రుల‌కు అందిస్తారు. కొంద‌రు డ‌బ్బులు చ‌దివిస్తారు. అయితే… మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఆ మంత్రి నూత‌నంగా పెళ్ల‌యిన వారికి ఏమేం బ‌హుమతులు ఇచ్చాడో తెలుసా..? క్రికెట్ బ్యాట్లు..! అవును, అవే..! అదేంటీ… క్రికెట్ బ్యాట్ల‌ను బ‌హుమ‌తిగా ఇవ్వ‌డం ఏంటీ..! ఓహో… వారికి పిల్లలు పుడితే ఆడుకోవ‌డం కోసం ముందుగానే ఇచ్చాడేమో..! అనుకుంటున్నారా..? అయితే మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్టే. ఎందుకంటే ఆ మంత్రి క్రికెట్ బ్యాట్లు ఇచ్చింది అందుకోసం మాత్రం కాదు. మ‌రెందుకూ… అంటే..!

మధ్యప్రదేశ్‌లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యర్యంతో జరిగిన సామూహిక వివాహ మహోత్సవంలో 700 మంది పెళ్లి కూతుళ్లకు ఆ రాష్ట్ర సామాజిక న్యాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపాల్‌ భార్గవ ఓ వినూత్న బహుమతిని అందజేశారు. తాగి వచ్చే భర్తలను, ముఖ్యంగా తాగొచ్చి హింసించే భర్తలను బాదేందుకు క్రికెట్‌ బ్యాట్లను ఆయన బహూకరించారు. క్రికెట్ బ్యాట్లు అంటే… అవి పెద్ద సైజ్‌వి కాదు లెండి. చాలా చిన్న‌వి. కానీ కొడితే దెబ్బ వాచి పోతుంది. అలా ఆయ‌న మొత్తం పదివేల బ్యాట్లను తయారు చేయించారు. వాటిలో కొన్నింటిని తీసి ఆ 700 మంది పెళ్లి కూతుర్ల‌కు ఇచ్చాడు.

మధ్యప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో భర్తలు తాగొచ్చి భార్యలను హింసించడం సర్వసాధారణమై పోయిందని, అలాంటి వారికి బుద్ధి చెప్పాలంటే ఇలాంటి బ్యాట్ల అవసరం ఎంతైనా ఉందని మంత్రి గోపాల్ పెళ్లి సంద‌ర్భంగా అన్నారు. రాష్ట్రంలో గులాబీ గ్యాంగ్‌ ఆందోళన చూశాక తనకు ఈ ఆలోచన వచ్చిందని ఆయన చెప్పారు. ఇటీవల వైన్‌ షాపులను మూసేయాలని డిమాండ్‌ చేస్తూ కొంత మంది మహిళలు గులాబీ రంగు చీరలు కట్టుకొని, బ్యాట్లు పట్టుకొని వీధుల్లోకి వచ్చారు. ఇక ముందు కూడా పెళ్లి కూతుళ్లకు ఈ బ్యాట్లను బహూకరించడం కొనసాగిస్తానని మంత్రి తెలిపారు. అయితే ఆ బ్యాట్ల‌పై సందేశాలు కూడా రాయించారండోయ్‌..! ‘‌ భర్తలు గృహహింసకు పాల్పడితే ఈ బ్యాట్లతో కొట్టండి. పోలీసులు ఇందులో జోక్యం చేసుకోవద్దు ‘ అని ఆ బ్యాట్ల‌పై రాసి ఉంది. చిత్ర‌హింస‌లు పెట్టే భ‌ర్త‌ల‌ను బాదేందుకు ఆ పెళ్లి కూతుళ్ల‌కు ఇలా మంత్రి బ్యాట్ల‌ను బ‌హుమ‌తిగా ఇవ్వ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌మే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top