వంట గ్యాస్ స‌బ్సిడీ ఏ బ్యాంక్‌లో ప‌డుతుందో తెలియం లేదా? స‌బ్సిడీ అకౌంట్ మార్చాల‌నుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..!

గ్యాస్ బుక్ చేయ‌డం, తీసుకోవ‌డం, దానికి సంబంధించిన స‌బ్సిడీ రుసుమును బ్యాంక్ ద్వారా తెచ్చుకోవ‌డం ఇప్పుడు మ‌న‌కు అంతా మామూలే. అయితే కొన్ని సంద‌ర్భాల్లో… అంటే, మ‌నం కొత్త‌గా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన సంద‌ర్భంలోనో, ఏదైనా లోన్ తీసుకున్న‌ప్పుడో ఆధార్ నంబ‌ర్ గ‌న‌క ఇచ్చామ‌నుకోండి దాంతో ఆ నంబర్ స‌ద‌రు బ్యాంక్ అకౌంట్‌కు సీడ్ అవుతుంది. దీంతో ఈ స‌మాచార‌మంతా నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కు చేరుతుంది. ఈ క్ర‌మంలో అప్ప‌టి నుంచి అదే బ్యాంక్ ఖాతాలో మ‌న గ్యాస్ స‌బ్సిడీ ప‌డుతుంది. ఇది తెలియ‌క మ‌నకు అస‌లు స‌బ్సిడీ ప‌డుతుందో లేదోన‌ని అప్పుడ‌ప్పుడు దిగులు చెందుతాం. అంత చిన్న మొత్తం బ్యాంక్‌లో ప‌డినా ఒక్కోసారి మ‌న‌కు మెసేజ్ కూడా రాదు. దీంతో అస‌లు స‌బ్సిడీ వ‌స్తుందో, రాదో కూడా తెలియ‌దు. అయితే మ‌న‌కు గ్యాస్‌ స‌బ్సిడీ ఏ బ్యాంక్ ఖాతాలో ప‌డుతుందో ఇలా సింపుల్‌గా తెలుసుకోవ‌చ్చు. అదెలాగంటే..!

gas-subsidy

మొబైల్ ఫోన్ తీసుకుని అందులో *99*99# నంబ‌ర్ డ‌య‌ల్ చేయాలి. వెంట‌నే మీ ఆధార్ నంబ‌ర్ ఎంట‌ర్ చేయ‌మ‌ని మెసేజ్ వ‌స్తుంది. ఆధార్ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేసి దాన్ని క‌న్‌ఫాం చేయ‌డానికి 1 నొక్కాలి. దీంతో మీ ఆధార్ నంబ‌ర్‌తోపాటు అది ఏ బ్యాంకుకు అనుసంధాన‌మైందీ, చివ‌రి రాయితీ ఎప్పుడు వ‌చ్చింది, ఏ అకౌంట్‌లో ప‌డిందీ సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు.

అయితే స‌బ్సిడీ విష‌య‌మే కాదు వంట గ్యాస్‌కు సంబంధించిన ఎలాంటి స‌మస్య ఉన్నా 1800 2333 555 టోల్ ఫ్రీ నంబ‌ర్‌కు ఫోన్ చేసి తెలియ‌జేయ‌వ‌చ్చు. గ్యాస్ బ‌రువు తేడాగా ఉన్నా, సీల్ లేకుండా డెలివ‌రీ చేసినా, బుక్ చేసిన త‌రువాత స‌రైన స‌మ‌యంలో డెలివ‌రీ రాక‌పోయినా, గ్యాస్ డీల‌ర్ మోసం చేసినా, ఇత‌ర ఎలాంటి గ్యాస్ స‌మ‌స్య అయినా క‌స్ట‌మ‌ర్ కేర్ ప్ర‌తినిధుల‌కు చెప్ప‌వ‌చ్చు.

ఒక వేళ మీరు కొత్త‌గా అనుసంధాన‌మైన బ్యాంక్ అకౌంట్‌కు కాక పాత అకౌంట్‌లోనే గ్యాస్ స‌బ్సిడీ పొందాల‌నుకుంటే ఆ బ్యాంకుకు వెళ్లి మీ ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను ఇచ్చి దాన్ని అకౌంట్‌కు అనుసంధానం చేయ‌మ‌ని చెప్పాలి. ఒక వేళ అప్ప‌టికే ఆధార్ నంబ‌ర్ గనుక అనుసంధానం అయి ఉంటే స‌బ్సిడీ విష‌యం చెప్పి, ఎన్‌పీసీఐ అకౌంట్‌కు లింక్ చేయ‌మ‌ని బ్యాంక్ అధికారుల‌కు తెలియ‌జేయాలి. దీంతో పాత బ్యాంక్ అకౌంట్‌లోనే ఎప్ప‌టిలా మీ గ్యాస్ స‌బ్సిడీ ప‌డుతుంది. ఈ స‌మాచారం నచ్చితే అంద‌రికీ షేర్ చేయండి..! ఎంతో మేలు జ‌రుగుతుంది..!

Comments

comments

Share this post

scroll to top