68వ పుట్టిన రోజును పూర్తి చేసుకొని గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన జంతువు.! విశేషాలు.

మ‌నిషి జీవిత‌కాలం ఎంతో మీకు తెలుసా..? ఇప్పుడంటే అది 60-70కి ప‌డిపోయింది కానీ ఒక‌ప్పుడు 200… ఆ త‌రువాత 150… అనంతరం 120, 100… ఇలా త‌గ్గుతూ వ‌చ్చి 60-70 ద‌గ్గ‌ర సెటిలైంది. అది కూడా మంచి ఆహార‌పు అల‌వాట్లు క‌లిగి ఉండి, నిత్యం వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించుకుంటూ ఉంటేనే అంత‌దాకా వ‌స్తుంది. లేదంటే ఇంకా త‌క్కువ ఆయుష్షుకే త‌నువు చాలించాల్సి వస్తుంది. అది సరే… ఇప్పుడీ జీవిత కాలం గోలంతా ఎందుకంటారా..? ఏమీ లేదండీ… మ‌నటీ (manatee) అనే జంతువు గురించి తెలుసా..? చాలా మందికి ఈ క్షీర‌దం పేరు తెలిసి ఉండ‌దు. ఎందుకంటే ఇది అస‌లు మ‌న ప్రాంతంలో నివ‌సించ‌దు క‌దా, అమెరికా వంటి దేశాల్లో స‌ముద్రాల్లో మాత్ర‌మే ఈ జీవి నివ‌సిస్తుంది. సీల్ చేప‌ను పోలి ఈ జీవి ఉంటుంది. దీన్ని కొంద‌రు మ‌న తెలుగులో నీటి ఆవు అని కూడా పిలుస్తారు. అయితే ఈ మ‌న‌టీ జంతువు ఒక‌టి ఈ మ‌ధ్యే త‌న 68వ పుట్టిన రోజును పూర్తి చేసుకుందంట‌. దీంతో ఈ క్షీర‌దాన్ని గిన్నిస్ బుక్‌లోకి కూడా చేర్చారు. ఇంత‌కీ ఈ జీవి అస‌లు గిన్నిస్ బుక్‌లోకి ఎందుకు ఎక్కిందంటే…

manatee

దాని పేరు స్నూటీ (Snooty). పేరు మాత్ర‌మే స్నూటీ లెండి. అది మ‌న‌టీ జీవే. అయితే అది 1948 జూలై 21న జ‌న్మించింది. ఈ మ‌ధ్యే 68వ పుట్టిన‌రోజును కూడా జ‌రుపుకుంది. ఈ క్ర‌మంలో అత్యంత ఎక్కువ రోజులు జీవించిన మ‌న‌టీగా గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లోకి కూడా ఎక్కేసింది. ఇప్పుడీ జీవి అమెరికాలోని ఫ్లోరిడా బ్రాడెన్‌ట‌న్ మ్యూజియంలో నివాసం ఉంటోంద‌ట‌. 1949లోనే అక్క‌డి వ‌చ్చింది. అప్ప‌టి నుంచి ఆ మ్యూజియం వారే దాన్ని ఎంతో జాగ్ర‌త్త‌గా సంర‌క్షిస్తున్నారు.

దాదాపుగా 2.30 ల‌క్ష‌ల నీరు ప‌ట్టే పెద్ద కొల‌నులో దీనికి నివాసం ఏర్పాటు చేశారు. దీన్ని చూసేందుకు చాలా మంది సంద‌ర్శ‌కులు కూడా వ‌స్తుంటారు. దీంతోపాటు మ‌రో రెండు మ‌న‌టీలు కూడా ఆ కొల‌నులో ఉంటాయ‌ట‌. కానీ స్నూటీ వాటిని ప‌ట్టించుకోద‌ట‌. దాన్ని చూసేందుకు వ‌చ్చే సంద‌ర్శ‌కుల‌తోనే అది ఎక్కువ కాలం గ‌డుపుతుంద‌ట‌. వారు దానికి క్యారెట్ వంటి ప‌లు కూర‌గాయ‌ల‌ను కూడా తినిపిస్తుంటారు. అంతేకాదు, ఏటా జూలై 21న స్నూటీ బ‌ర్త్‌డేను కూడా వారు గ్రాండ్‌గా జ‌రుపుతూ వ‌స్తున్నార‌ట‌. ఇక ఇటీవ‌లే ఈ జీవి గిన్నిస్‌లోకి కూడా ప్ర‌వేశించ‌డంతో దాని 68వ బ‌ర్త్‌డేను సంద‌ర్శ‌కులు చాలా గ్రాండ్‌గా జ‌రిపార‌ట‌. అన్న‌ట్టు స్నూటీ క‌న్నా ముందు కూడా మ‌రో రెండు మ‌న‌టీలు ఒక‌టి 59 ఏళ్లు, ఇంకోటి 48 ఏళ్లు జీవించాయ‌ట‌. కానీ స్నూటీ వాటిని మించి బ‌ర్త్‌డేలు జ‌రుపుకోవ‌డంతో ఎక్కువ సంవ‌త్స‌రాలు జీవించిన మ‌న‌టీగా రికార్డుల‌కెక్కింది. అన్న‌ట్టు పైన మ‌నం మ‌నుషుల స‌గ‌టు జీవిత‌కాలం గురించి చ‌ర్చించుకున్నాం క‌దా..? అవును 60 – 70 అని. అలాగే మ‌న‌టీల‌కు కూడా స‌గ‌టు జీవిత కాలం ఉంది. అది కేవ‌లం 10 ఏళ్లు మాత్ర‌మేన‌ట‌. అది కూడా స‌ముద్రాల్లో మ‌నం క‌లుపుతున్న వ్య‌ర్థాల వ‌ల్ల వాటి ఆయుర్దాయం అంత‌కు ప‌డిపోయింద‌ట‌. కానీ స్నూటీని ర‌క్షించిన‌ట్టుగా ర‌క్షిస్తే మ‌న‌టీ ఇంకా మ‌న క‌న్నా ఎక్కువ సంవ‌త్స‌రాలే బ‌తుకుతుంద‌ట‌. ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దూ. అవును మ‌రి, మ‌నం కూడా అడ్డ‌మైన గ‌డ్డి తిన‌కుండా మంచి ఆహార‌పు అల‌వాట్లు క‌లిగి ఉంటే, స‌క్ర‌మంగా వ్యాయామం చేస్తే దాంతో మ‌న ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. అంతేక‌దా, ఏమంటారు..!

స్నూటీకి చెందిన వీడియోను కింద చూడ‌వ‌చ్చు..!

Comments

comments

Share this post

scroll to top