జపాన్ పోస్టల్ స్టాంప్ పై….ఇండియన్ రైటర్ ఫోటో.!

మ‌న దేశంలో రియ‌ల్ హీరోలు, స్టార్లు అని పిల‌వ‌బ‌డేందుకు అర్హ‌త ఉన్న ప‌లువురు ప్ర‌ముఖ వ్య‌క్తుల గురించి ఇప్ప‌టి వ‌ర‌కు తెలుసుకున్నాం. అలాంటి వ్య‌క్తుల్లో త‌మిళ‌నాడుకు చెందిన ఈయ‌న కూడా ఒక‌రు. చూసేందుకు సాధార‌ణ వ్య‌క్తిలా ఉన్నా ఆయ‌న‌లో ఉన్న సాహిత్య సంప‌ద అమోఘం. అందుకు జ‌పాన్ ప్ర‌భుత్వ‌మే ఆయ‌న్ను గౌర‌వించి స‌త్కారం చేసింది. ఆయ‌నే ముత్తు.

muthu

త‌మిళ‌నాడుకు చెందిన ముత్తు సాహిత్యంలో దిట్ట‌. ఇంగ్లిష్‌, జ‌ప‌నీస్‌, త‌మిళ భాష‌ల్లో ర‌చ‌న‌లు చేశారు. ఈ క్రమంలో 1981లో తంజావూరులో జరిగిన 5వ ప్ర‌పంచ త‌మిళ స‌ద‌స్సుకు ముత్తు కూడా హాజర‌య్యారు. అదే స‌ద‌స్సుకు జ‌పాన్‌కు చెందిన ప్ర‌ముఖ సాహితీవేత్త షుజో మ‌త్సునోగా కూడా వ‌చ్చాడు. వీరిద్ద‌రికి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో షుజో ప‌లు త‌మిళ ర‌చ‌న‌లను త‌మ జ‌ప‌నీస్ భాష‌లోకి అనువ‌దించేందుకు ముత్తు స‌హ‌కారం కోరాడు. దీనికి ముత్తు అంగీక‌రించాడు.

అలా 1981 నుంచి ముత్తు ప‌లు త‌మిళ సాహిత్య ర‌చ‌న‌లు జ‌ప‌నీస్‌లోకి అనువాదం అయ్యేందుకు షుజోకు స‌హాయం చేశాడు. అయితే ఇప్ప‌ట్లా అప్పుడు ఈ-మెయిల్ అవీ లేవు క‌దా. వారి క‌మ్యూనికేష‌న్ మొత్తం ఉత్త‌రాల ద్వారానే సాగేది. అలా దాదాపు 200 ఉత్త‌రాల ద్వారా ముత్తు షుజోకు స‌హ‌కారం అందించాడు. అయితే అందుకు ముత్తు ఎలాంటి పారితోషకం కూడా తీసుకోలేదు. అంత‌టి విశిష్ట‌మైన వ్య‌క్తి ఆయ‌న‌. ఈ క్ర‌మంలో ముత్తు అందించిన స‌హాయానికి గాను జ‌పాన్ ప్ర‌భుత్వం 2007లో ఆయ‌న పేరిట పోస్ట‌ల్ స్టాంపును కూడా విడుద‌ల చేసింది. దాని వెల 80 జ‌ప‌నీస్ యెన్‌లు (రూ.27). ఇప్పుడు చెప్పండి, ఇంత‌టి సాహితీవేత్త‌ను, ఆద‌ర్శ భావాలున్న వ్య‌క్తిని స్టార్ అందామా..? వ‌ద్దా..!

Comments

comments

Share this post

scroll to top