ఇత‌ను 9th క్లాస్ డ్రాపౌట్… 130 రోజుల్లో పండే వ‌రివంగ‌డాన్ని క‌నిపెట్టి సైంటిస్టుల‌నే ఆశ్చ‌ర్యానికి గురిచేశాడు.!!

త‌క్కువ రోజుల్లోనే నీటిని బాగా త‌క్కువ‌గా వాడుకుంటూ అధిక దిగుబ‌డినిచ్చే ధాన్య‌పు వంగ‌డాల‌ను సృష్టించాలంటే నిజంగా అది స‌వాల్‌తో కూడుకున్న ప‌నే. ఏంతో మేథ‌స్సు ఉన్న సైంటిస్టుల‌కే అలా చేసేందుకు స‌మ‌యం ప‌డుతుంది. కానీ ఆయ‌న మాత్రం అలా కాదు. పెద్ద‌గా చ‌దువుకోలేదు. అయిన‌ప్ప‌టికీ అలాంటి వంగ‌డాల‌ను సృష్టించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. అలా ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు 460 ర‌కాల వ‌రి వంగ‌డాల‌ను, 120 ర‌కాల గోధుమ వంగ‌డాల‌ను, 30 ర‌కాల ప‌ప్పు ధాన్య వంగ‌డాల‌ను సృష్టించాడు. తోటి రైతుల‌కు వ్య‌వ‌సాయంలో మెళ‌కువ‌ల‌ను చెబుతూ తాను సృష్టించిన కొత్త వంగ‌డాల‌తో అధిక దిగుబ‌డి వ‌చ్చేలా చేస్తున్నాడు.

అత‌ని పేరు జై ప్ర‌కాష్ సింగ్‌. ఉంటున్న‌ది వార‌ణాసిలోని తాండియా అనే గ్రామంలో. జై ప్ర‌కాష్ 9వ త‌ర‌గ‌తి వ‌ర‌కే చ‌దువుకున్నాడు. ఈ క్ర‌మంలో అత‌ను తండ్రి చేసే వ్య‌వ‌సాయ వృత్తినే ఎంచుకున్నాడు. అయితే ఏయేటికాయేడు న‌ష్టాలే వ‌స్తున్నాయి కానీ లాభాల బాట ప‌ట్ట‌డం లేదు. దీంతో ఏదైనా చేయాల‌ని అత‌ను అనుకున్నాడు. అలా అత‌ను ఒక రోజు తాను వేసి గోధుమ పంట‌లో తిరుగుతుండ‌గా ఒక గోధుమ మొక్క అత‌ని దృష్టిని ఆక‌ర్షించింది. చుట్టూ ఉన్న ఇత‌ర గోధుమ మొక్క‌ల క‌న్నా ఆ మొక్క ఎంతో ఏపుగా పెరిగి ఎక్కువ ధాన్యాన్ని క‌లిగి ఉంది. దీనికి తోడు చుట్టూ ఉన్న మొక్క‌ల క‌న్నా ఎంతో ఆరోగ్యంగా ఆ మొక్క ఉంది. అది అలా ఎందుకు ఉందో మొద‌ట జై ప్ర‌కాష్‌కు అర్థం కాలేదు. అయితే అదే మొక్క అత‌ని ప్ర‌యోగాల‌కు కార‌ణ‌మైంది. ఆ మొక్క‌ను జాగ్ర‌త్త‌గా సేక‌రించిన జై ప్ర‌కాష్ సింగ్ దాని ధాన్యాన్ని సేక‌రించాడు. వాటిపై ప్ర‌యోగాలు చేశాడు. అందుకు గాను విత్త‌నాల‌ను బ్రీడ్ చేయ‌డం, కొత్త విత్త‌నాల‌ను సృష్టించ‌డం అనే ప‌ద్ధ‌తుల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకున్నాడు.

దీంతో జై ప్ర‌కాష్ సింగ్ అలా నేర్చుకుంటూనే మ‌రో వైపు కొత్త‌గా వ‌రి, గోధ‌మ‌, ప‌ప్పు ధాన్యాల వంగ‌డాల‌ను సృష్టించ‌డం ప్రారంభించాడు. అలా అత‌ను ఇప్ప‌టి వ‌ర‌కు 460 ర‌కాల వ‌రి వంగ‌డాల‌ను, 120 ర‌కాల గోధుమ వంగ‌డాల‌ను, 30 ర‌కాల ప‌ప్పు ధాన్య వంగ‌డాల‌ను సృష్టించాడు. అలా తాను సృష్టించిన వంగ‌డాల‌తోనే వ్య‌వ‌సాయం చేస్తూ అధిక దిగుబ‌డిని సాధించ‌డం మొద‌లు పెట్టాడు. దీంతో అంద‌రి దృష్టి అత‌నిపై ప‌డింది. అత‌ను సృష్టించిన విత్త‌నాల‌ను కూడా ప‌లువురు సైంటిస్టులు తీసుకెళ్ల‌డం మొద‌లు పెట్టారు. అయితే అత‌ని ఉద్దేశం వేరే. అదేమిటంటే… రైతులంద‌రూ ఇలా సొంతంగా విత్త‌నాల‌ను త‌యారు చేసుకుని వాటితో అధిక దిగుబ‌డిని సాధించేలా చేయాల‌నేది అత‌ని ఆశ‌యం. అందులో భాగంగానే అత‌ను రైతుల‌కు వ్య‌వ‌సాయంలో మెళ‌కువ‌ల‌ను చెబుతున్నాడు. కొత్త విత్త‌నాల‌ను ఎలా సృష్టించాలో కూడా నేర్పిస్తున్నాడు. దేశంలో ఉన్న రైతులంద‌రూ ఇదే త‌ర‌హాలో వ్య‌వ‌సాయం చేస్తే అప్పుడు ఏ రైతూ క‌ష్టాలు ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌దు అనేది అత‌ని భావ‌న‌.

అయితే ఇంకో విష‌యం… జై ప్ర‌కాష్ సింగ్ సృష్టించిన కొత్త వంగ‌డాల్లో HJPW157 అనే వ‌రి వంగ‌డం కేవ‌లం 130 రోజుల్లోనే పంట సిద్ధ‌మ‌వుతుంది. అంతేకాదు, దీనికి చాలా త‌క్కువ నీరు ఉన్నా చాలు పెరుగుతుంది. ఇక పంట పండితే హెక్టార్‌కు ఏకంగా 79 క్వింటాళ్ల ధాన్యం పండుతుంది. అవును, ఇంకో రకానికి చెందిన గోధుమ వంగ‌డం కూడా స‌రిగ్గా ఇలాగే అధిక దిగుబ‌డిని ఇస్తుంది. ఇలాంటి ఎన్నో కొత్త వంగ‌డాలు జై ప్ర‌కాష్ ద‌గ్గ‌ర ఉన్నాయి. ఏది ఏమైనా ఈ రైతు క‌మ్ సైంటిస్ట్ మేథ‌స్సుకు, తోటి రైతుల‌కు అత‌ను చేస్తున్న స‌హాయానికి అత‌న్ని నిజంగా మ‌నం అభినందించాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top