15 నిముషాలు మాత్రమే నిలిచిన పెళ్లి…తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకోడానికి 2.50 ల‌క్ష‌లు! అసలేమైంది?

నేటి త‌రుణంలో మోసం చేసే వాళ్లు చాలా తెలివి మీరిపోయారు. జ‌నాలు ఎంత అప్ర‌మ‌త్తంగా ఉన్నా మోస‌గాళ్లు మాత్రం త‌మ ప‌ని తాము చేసుకుపోతూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో వారు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త మార్గాల‌ను వెతుకుతూ జ‌నాల‌ను మోసం చేస్తున్నారు. రాజ‌స్థాన్‌లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతుంది. ఓ గ్యాంగ్ కు చెందిన స‌భ్యులు ఓ వ్య‌క్తికి పెళ్లి చేస్తాం అని చెప్పి ల‌క్ష‌లు నొక్కేశారు. తీరా చూస్తే అది మోస‌మ‌ని తెలిసింది. దీంతో స‌ద‌రు బాధితుడు ఇప్పుడు నెత్తీ నోరు బాదుకుంటున్నాడు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

రాజస్థాన్‌లోని ఝుంఝు జిల్లాలో నివాసం ఉండే సజ్జ‌న్‌సింగ్‌కు పెళ్లి కాలేదు. ఓ వైపు వ‌య‌స్సు మీద ప‌డుతోంది. దీంతో అత‌నికి ఏం చేయాలో తెలియ‌లేదు. అయితే అనుకోకుండా ఇత‌ను ఓ ముఠా బారిన ప‌డ్డాడు. ఆ ముఠాకు చెందిన అనిత‌, ముఖేష్ అనే ఇద్ద‌రు స‌భ్యులు స‌జ్జ‌న్‌సింగ్‌ను క‌లిశారు. అత‌నికి పెళ్లి చేస్తాం అని చెప్పారు. అందుకు రూ.2.50 ల‌క్ష‌లు అవుతుంద‌ని అన్నారు. అందుకు సజ్జ‌న్ స‌రే అన్నాడు.

కాగా పెళ్లి రోజు రానే వ‌చ్చింది. డిసెంబ‌ర్ 30వ తేదీన ఓ ఆల‌యంలోకి స‌జ్జ‌న్ సింగ్ త‌న సోద‌రుడు అత‌ని భార్య‌తో వ‌చ్చాడు. అక్క‌డికి అనిత‌, ముఖేష్ తో పాటు మ‌రో మ‌హిళ వ‌చ్చింది. ఆమె పేరు కాజ‌ల్ అని, ఆమెనే స‌జ్జ‌న్‌సింగ్ పెళ్లి చేసుకుంటున్నాడు అని అనిత‌, ముఖేష్‌లు చెప్పారు. ఇందుకు స‌జ్జ‌న్ ఒప్పుకున్నాడు. అనంత‌రం స‌జ్జన్ సింగ్‌, కాజల్‌కు పెళ్లి చేశారు. త‌రువాత స‌జ్జన్ సింగ్ అనిత‌కు ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్ర‌కారం ఆమెకు రూ.50వేలు, ముఖేష్‌కు రూ.2 ల‌క్ష‌లు మొత్తం క‌లిపి ఇద్ద‌రికీ రూ.2.50 ల‌క్ష‌లు ఇచ్చాడు. అనంత‌రం అనిత‌, ముఖేష్‌లు ఇద్దరూ అక్క‌డి నుంచి వెళ్లిపోయారు.

క‌ట్ చేస్తే.. స‌జ్జ‌న్‌సింగ్ త‌న భార్య కాజ‌ల్‌ను ఇంటికి తీసుకువెళ్తుండ‌గా ఆమె గగ్గోలు పెట్టింది. త‌నను ఎందుకు కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నార‌ని ప్ర‌శ్నించింది. దీంతో స‌జ్జన్ జ‌రిగింది చెప్పాడు. అది విన్న కాజ‌ల్ షాక్ తింది. అస‌లు ఆమె ఆ పెళ్లి నిజం అనుకోలేద‌ట‌. సినిమా షూటింగ్ అని చెబితే వ‌చ్చింద‌ట‌. అందుకు అనిత‌, ముఖేష్‌లు ఇద్ద‌రూ త‌న‌కు రూ.10వేలు ఇచ్చార‌ని చెప్పేస‌రికి స‌జ్జన్ సింగ్ షాక‌య్యాడు. అయితే ఈ తంతును కొంద‌రు చూడ‌డంతో పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఇది వెరైటీ నేరం క‌దా. క‌నుక ఎవ‌రైనా ఇలాంటి ఘ‌ట‌న‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే. లేదంటే మోస‌పోవాల్సి వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

Comments

comments

Share this post

scroll to top