అత్యంత ధైర్య సాహ‌సాల‌తో అత‌ను అగ్ని ప్ర‌మాదం నుంచి 20 మందిని ర‌క్షించాడు..!

ఓ వైపు అంత‌కంత‌కూ వ్యాపిస్తున్న మంట‌లు… మ‌రోవైపు అపార్ట్‌మెంట్‌లో చిక్కుకున్న జ‌నాలు… అలాంటి ప్రమాద‌క‌ర స్థితిలో ఒంటి చేత్తో అందరినీ ర‌క్షించాలంటే ఏ ఒక్క వ్య‌క్తికీ సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. ఇలాంటి దృశ్యాల‌ను మ‌నం కేవ‌లం సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ… అలాంటి దృశ్యాల‌ను త‌ల‌పించేలా… అత్యంత ధైర్య సాహ‌సాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ఓ పోలీస్ కానిస్టేబుల్ నిజంగానే ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్న 20 మందిని అగ్ని ప్ర‌మాదం నుంచి అత్యంత చాక‌చ‌క్యంగా ర‌క్షించ‌గ‌లిగాడు. దీంతో అతను అంద‌రి చేత ప్ర‌శంస‌లు కూడా అందుకున్నాడు. అత‌నే… పోలీస్ కానిస్టేబుల్ భీం రావు.

fire-accident

భీం రావు 2009లో పోలీస్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. అప్ప‌ట్లో ఛ‌త్రినాక ఏరియా పీఎస్‌లో ప‌నిచేసేవాడు. గ‌త కొంత కాలం కింద‌టే హుమాయున్ న‌గ‌ర్ పీఎస్‌కు బ‌దిలీ అయ్యాడు. అయితే ఈ నెల 16వ తేదీన అత‌ను మ‌సాబ్ ట్యాంక్ ప‌రిధిలో విధులు నిర్వ‌హిస్తుండ‌గా, అక్క‌డికి ద‌గ్గ‌ర్లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నుంచి హ‌ఠాత్తుగా మంట‌లు ఎగిసి పడుతుండ‌డాన్ని గ‌మ‌నించాడు. దీంతో అత‌ను వెంట‌నే అప్ర‌మ‌త్తం అయ్యాడు. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా క్ష‌ణాల్లో ఆ అపార్ట్‌మెంట్‌కు చేరుకుని అందులో ఉన్న‌వారిని ర‌క్షించే ప‌నిలో ప‌డ్డాడు. మొత్తం 5 అంత‌స్తులు ఉన్న ఆ భ‌వంతిలో ముందుగా మొద‌టి అంత‌స్తులో షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. దీంతో కొద్ది క్ష‌ణాల్లోనే రెండో అంత‌స్తుకు కూడా మంట‌లు వ్యాపించాయి. అయితే అప్ప‌టికే అపార్ట్‌మెంట్‌లోకి చేరుకున్న భీం రావు వెంట వెంట‌నే అందులో ఉన్న వారిని కింద‌కి సుర‌క్షితంగా త‌ర‌లించ‌డం మొద‌లు పెట్టాడు.

bheem-rao

అలా అత‌ను మొత్తం 20 మందిని కింద‌కి తెచ్చాడు. ఈ క్ర‌మంలో ఫైర్ ఇంజిన్లు వ‌చ్చి మంట‌ల‌ను ఆర్పేశాయి. అయితే అలా అంద‌రినీ కింద‌కి చేర్చే క్ర‌మంలో భీం రావు ఆయా నివాసాల్లో ఉన్న గ్యాస్ సిలిండ‌ర్ల‌ను కూడా కింద‌కి చేర‌వేశాడు. లేదంటే పెద్ద ప్ర‌మాద‌మే అయి ఉండేది. ఇంకా అనేక మంది ప్రాణాలు పోయేవి. అలా భీం రావు అంద‌రినీ ర‌క్షించి ఇప్పుడు రియ‌ల్ హీరో అయ్యాడు. అత‌ని పై ఉండే పోలీస్ ఉన్న‌తాధికారులే కాదు, సాక్షాత్తూ మంత్రి కేటీఆరే స్వ‌యంగా భీం రావును ట్విట్ట‌ర్ వేదిక‌గా అభినందించారు. అత‌ని శ్ర‌మకు త‌గిన ప్ర‌శంస అందించాల‌ని డీజీపీకి సూచించారు. దీంతో అత‌నికి పోలీసు శాఖ వారు స‌న్మానం చేశారు. ధైర్య సాహ‌సాల‌ను ప్ర‌ద‌ర్శించి అంద‌రినీ ర‌క్షించినందుకు గాను అత‌నికి న‌గ‌దు పుర‌స్కారం అందించి స‌త్కారం చేశారు. నిజ‌మే మ‌రి..! భీం రావు లాంటి రియ‌ల్ హీరోల‌ను మ‌నం క‌చ్చితంగా స‌న్మానించాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top