ఒక్క చాక్ లెట్ ప్లేస్ లో..5 వేల చాక్ లెట్లు… అతడి ఫోస్ట్ ను మెచ్చి పంపిన KitKat కంపెనీ.!

ఆ వ్య‌క్తికి ఎదురుగా చేతికి అందేంత దూరంలో నోరూరించే చాక్లెట్ ఉంది. నోట్లో వేసుకోగానే ఇట్టే క‌రిగిపోయే ప్రీమియం చాక్లెట్ బార్ అది. మ‌రి దాన్ని చూస్తే ఎవ‌రైనా తిన‌కుండా ఉంటారా..? క‌చ్చితంగా దాని రుచిని ఆస్వాదిస్తారు. ఆ వ్య‌క్తి కూడా స‌రిగ్గా అలాగే చేశాడు. చాక్లెట్ బార్ క‌న‌బ‌డ‌గానే చ‌టుక్కున నోట్లో వేసుకున్నాడు. అది ఎవరిది, అది ఎక్క‌డుంది, అలా చేయ‌వ‌చ్చా..? అన్న ఆలోచ‌న లేకుండానే అమాంతం కార్ డోర్ లాక్ ఓపెన్ చేసి మ‌రీ చాక్లెట్‌ను దొంగిలించి తినేశాడు. మ‌రి ఇత‌రుల వ‌స్తువులను దొంగిలించ‌డం నేరం క‌దా. కానీ ఆ వ్య‌క్తికేమో చాక్లెట్‌ను చూస్తే ఉబ్బాగ‌లేదు. వెంట‌నే తినేశాడు. తిన్నాక సోయికొచ్చింది. తాను తిన్న‌ది దొంగిలించిన చాక్లెట్‌న‌ని. దీంతో ఆ వ్య‌క్తి ఫీల‌య్యాడు. అయితే అంత‌టితో అత‌ను ఆగలేదు. అప్పుడు ఆ వ్య‌క్తి ఏం చేశాడంటే..?

hunter-jobbins

నేను మీ కార్‌లో కిట్‌క్యాట్ చాక్లెట్‌ను చూశాను. దాన్ని చూడ‌గానే వెంట‌నే తినాల‌నిపించింది. ఎందుకంటే కిట్‌క్యాట్ చాక్లెట్ అంటే నాకెంతో ఇష్టం. అందుకే మీ కార్ లాక్ తీసి క‌ప్ హోల్డ‌ర్‌లో ఉన్న కిట్‌క్యాట్ తినేశాను. నేన‌లా చేసినందుకు సారీ. నాకు బాగా ఆక‌లి వేసింది. నేను మీ కార్‌లో కిట్‌క్యాట్ త‌ప్ప ఇంకేదీ తీయ‌లేదు. అని ఓ నోట్ రాసి ఆ కార్‌లో పెట్టి ఎంచ‌క్కా అక్క‌డి నుంచి జారుకున్నాడు. అయితే త‌న ప‌నిముగించుకుని క‌న్సాస్ స్టేట్ యూనివ‌ర్సిటీ క్యాంప‌స్ ఎదురుగా ఉన్న త‌న కారు వ‌ద్ద‌కు హంట‌ర్ జాబిన్స్ అనే వ్య‌క్తి వ‌చ్చాడు. అయితే కార్ లాక్ ఓపెన్ చేసి ఉండ‌డంతో ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యాడు. అయినా వెంట‌నే తేరుకుని కార్ డోర్ తీయ‌గా అత‌నికి ఓ లెట‌ర్ క‌నిపించింది. అందులో పైన చెప్పిన నోట్ రాసి ఉంది. దీంతో అత‌నికి ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే జాబిన్స్ వెంట‌నే ఆ సంఘ‌ట‌న గురించి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ వ్య‌క్తి రాసిన నోట్‌ను ఫొటో తీసి మ‌రీ ట్వీట్‌లో పెట్టాడు. దీంతో ఆ పోస్ట్ కాస్తా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

అలా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన జాబిన్స్ పోస్ట్ కిట్‌క్యాట్ కంపెనీ వ‌ర‌కు వెళ్లింది. వారు ఆ పోస్ట్‌ను చూసి జాబిన్స్‌కు వెంట‌నే ఓ బాక్స్ నిండా కిట్‌క్యాట్‌ల‌ను పంపారు. అయితే అది అంత‌టితో ఆగలేదు. మ‌రుసటి రోజు లేచి చూసే స‌రికి జాబిన్స్ కార్ నిండా కిట్‌క్యాట్ చాక్లెట్ బార్లే ఉన్నాయి. దీంతో ఆశ్చ‌ర్యం పోవ‌డం ఈసారి జాబిన్స్ వంతైంది. అయితే జాబిన్స్ ఆ చాక్లెట్ల‌ను తానొక్క‌డే తిన‌లేదు. ఆ సంఘ‌ట‌న జ‌రిగిన యూనివ‌ర్సిటీ క్యాంప‌స్ వ‌ద్ద త‌న‌కు వ‌చ్చిన దాదాపు 5వేల కిట్‌క్యాట్ చాక్లెట్ బార్‌ల‌ను అక్క‌డి స్టూడెంట్స్‌కు పంచిపెట్టాడు. అందులో జాబిన్స్ వేసిన ఎత్తు కూడా ఒక‌టి ఉంది. ఏంటంటే త‌న కారులో చాక్లెట్‌ను దొంగిలించిన వ్య‌క్తి స‌ద‌రు యూనివ‌ర్సిటీ స్టూడెంటే అయి ఉంటాడ‌ని అత‌ను అనుకున్నాడు. అందుకే మ‌ళ్లీ అక్క‌డికే వ‌చ్చి ఆ చాక్లెట్ల‌ను పంచాడు. అలా అయినా ఆ ప‌ని చేసిన‌ వ్య‌క్తి గురించి తెలుస్తుంద‌ని అనుకున్నాడు. కానీ జాబిన్స్‌కు నిరాశే ఎదురైంది. అన్ని చాక్లెట్ల‌ను పంచినా అస‌లు ఆ ప‌ని చేసింది ఎవ‌రో అత‌నికి ఇంకా తెలియ‌లేదు. ఇక‌నైనా అతనికి ఆ విష‌యం తెలుస్తుందో లేదో..!

Comments

comments

Share this post

scroll to top