నోట్ల క‌ట్ట‌ల‌తో ల‌క్ష్మీదేవి పూజ చేసిన వ్య‌క్తి… వైర‌ల్ అయిన ఫొటోలు.. అత‌ను ఎవ‌రో తెలుసా..?

రూ.100, రూ.500, రూ.2000 వేల నోట్ల క‌ట్ట‌లు. వాటిని గుట్ట‌లుగా పేర్చి మ‌ధ్య‌లో దేవుళ్ల ఫొటోలు పెట్టి మొన్నీ మ‌ధ్యే ఓ వ్య‌క్తి ల‌క్ష్మీదేవి పూజ చేశాడు. ఆ దృశ్యాల‌ను ఎవ‌రో ఫొటో తీయ‌గా, అవి అలా అలా ఇంట‌ర్నెట్‌లో షేర్ అయి వైర‌ల్ అయ్యాయి. కేవ‌లం కొన్ని గంట‌ల్లోనే కొన్ని ల‌క్ష‌ల మంది వాటిని వీక్షించారు. అయితే ఆ పూజ చేసింది బెంగుళూరుకు చెందిన ఓ మంత్రి అని మొద‌ట వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఆ పూజ చేసింది మంత్రి కాద‌ట‌..! మ‌రి ఎవ‌రంటే..?

అత‌ని పేరు సూర్య‌నారాయ‌ణ్. బెంగుళూరు వాసి. అత‌ను రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి. బెంగుళూరు అభివృద్ధి సంస్థలో బ్రోకర్ గా, పైరవీకారుగా కూడా పని చేస్తున్నాడు. అయితే అత‌ను ఈ మ‌ధ్యే శుక్ర‌వారం రోజున భార్య‌తో కల‌సి వ‌ర‌ల‌క్ష్మీ పూజ చేశాడు. అలా అత‌ని పూజ‌లో ఏం పెట్టాడో తెలుసా..? రూ.100, రూ.500, రూ.2000 నోట్ల క‌ట్ట‌ల‌ను గుట్ట‌లుగా పెట్టి పూజ చేశాడు. దాన్ని ఎవ‌రో ఫొటో తీయ‌గా, అవి వైర‌ల్ అయి విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే ఈ ఫొటోలు చూసి మొద‌ట పూజ చేసింది బెంగుళూరు రాష్ట్ర ప్ర‌భుత్వ మంత్రి అని అంద‌రూ భావించారు. కానీ తీరా విష‌యం తెలిసే స‌రికి నోరెళ్ల‌బెట్టారు.

అయితే స‌ద‌రు నోట్ల క‌ట్ట‌ల‌పై సూర్య నారాయణ్ స్పందించాడు. అత‌ను మీడియాతో మాట్లాడుతూ… అదంతా తనదేనని.. కష్టపడి సంపాదించుకున్నదని తెలిపాడు. ఇన్ కమ్ ట్యాక్స్ వాళ్లు అడిగినా ఏం భయంలేదని, అన్నింటికీ సమాధానం తన‌ దగ్గరుందని అంటున్నాడు. ఐటీ వారు వ‌చ్చి అడిగినా లెక్క‌లు చెబుతాన‌ని అంటున్నాడు. మ‌రి ఐటీ వారు వ‌స్తారో, రారో వేచి చూడాలి. ఏది ఏమైనా క‌ష్ట‌ప‌డి అన్ని నోట్ల కట్ట‌ల‌ను సంపాదించాడంటే నిజంగా ఆశ్చ‌ర్య‌మే క‌దా. బాబ్బాబూ సూరి గారూ… ఆ ట్రిక్ ఏదో అంద‌రికీ చెప్ప‌రూ.. అలా నోట్ల క‌ట్ట‌ల‌ను క‌ష్ట‌ప‌డి సంపాదించుకుంటారు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top