ఫేస్‌బుక్‌లో అత‌ను కొట్టిన లైక్‌ల‌కు… రూ.2.58 ల‌క్ష‌ల జరిమానా చెల్లించాడు తెలుసా..?

ఫేస్‌బుక్‌… సోష‌ల్ మీడియాలో అదొక మ‌హా ప్ర‌పంచం. మ‌హాస‌ముద్రం లాంటిది. చూస్తే పోవాలే గానీ లెక్క‌కు మించిన పోస్టులు క‌నిపిస్తుంటాయి. అయితే కొంద‌రు అలా కేవ‌లం చూడ‌డానికే ప‌రిమితం కారు. అవ‌స‌రం ఉన్నా, లేక‌పోయినా, పోస్టులు పెట్టిన వారు తెలిసినా, తెలియ‌కున్నా, అసలు ఆ పోస్టులో ఏముందో చూడ‌కుండానే కొంద‌రు అదే ప‌నిగా లైక్ కొడుతుంటారు. అయితే అంతా బాగానే ఉంటే ఓకే… లేదంటే ఒక్కోసారి ఇలాంటి లైక్‌లు, కామెంట్లే మ‌న కొంప ముంచుతాయి. మ‌న చేత పెద్ద ఎత్తున ఫైన్ క‌ట్టేలా చేస్తాయి. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అలా పోస్టులో ఏముందో చూడ‌కుండా ఎడా పెడా లైక్‌లు కొట్టినందుకు గాను ఓ వ్య‌క్తికి ఏకంగా రూ.2.58 ల‌క్ష‌ల జ‌రిమానా ప‌డింది.

ఎర్విన్‌ కెస్లర్‌ అనే వ్యక్తి జంతువుల హక్కుల గ్రూపును ఫేస్‌బుక్‌లో ర‌న్ చేస్తున్నాడు. అయితే అత‌ను పెట్టే పోస్టుల మీద కొంద‌రు నెగెటివ్ కామెంట్ల‌ను కూడా పెడుతుంటారు. ఈ క్ర‌మంలోనే అలాంటి కామెంట్ల‌ను స‌మ‌ర్థిస్తున్న‌ట్టుగా ఓ వ్య‌క్తి లైక్ కొట్టాడు. దీంతో అత‌నిపై ఫిర్యాదు చేయ‌గా, కోర్టులో జ‌డ్జి విచారించి స‌ద‌రు లైక్ కొట్టిన వ్య‌క్తిది పరువు నష్టం కలిగించే చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. అనంత‌రం అత‌నికి రూ.2.58 ల‌క్ష‌ల జ‌రిమానా విధించారు. ఈ క్ర‌మంలో కెస్ల‌ర్ పై నెగెటివ్ కామెంట్లు పెట్టిన వారిని కూడా కోర్టు దోషులుగా నిర్ణ‌యించి వారికి శిక్ష వేసింది.

చూశారుగా… పోస్టుల్లో ఏముందో చూడ‌కుండా లైక్‌లు కొడితే జ‌రిగేది ఇదే. అందుకు ఫేస్‌బుక్‌లో క‌నిపించిన ప్ర‌తి దానికి లైక్ కొట్ట‌డం మానేయండి. ఒక వేళ లైక్ కొట్టాల‌ని అనుకున్నా, కామెంట్ పెట్టాల‌ని అనుకున్నా అందులో ఏముందో ఓ సారి చూశాకే ఆ ప‌నిచేయండి. లేదంటే పైన చెప్పిన‌ట్టుగా ఆ వ్య‌క్తి లా మీరూ ఫైన్ క‌ట్టాల్సి వ‌స్తుంది. అవును మ‌రి, ఇత‌రుల‌ను కించ పరిచేయా వ్యాఖ్య‌లు చేసినా, వాటిని స‌మ‌ర్థించినా ఎవ‌రు ఊరుకుంటారు చెప్పండి..! అలాగే న‌ష్ట‌ప‌రిహారం దావా వేస్తారు. అప్పుడు చ‌చ్చిన‌ట్టు ఆ ఫైన్ క‌ట్టాల్సిందే. ఆన‌క బాధ‌ప‌డీ ప్ర‌యోజ‌నం ఉండ‌దు..!

Comments

comments

Share this post

scroll to top