సుత్తితో భార్య త‌ల‌పై మోది కిరాత‌కంగా హ‌త్య చేసిన భ‌ర్త‌..!

మ‌నిషి ప్రాణాలంటే నిజంగా లెక్కే ఉండ‌డం లేదు. అవ‌త‌ల ఉన్న వ్య‌క్తులు ఎవ‌రైనా సరే… వారు చేసిన త‌ప్పు, నేరం ఏదైనా స‌రే… వారిని చంప‌డ‌మే కొంద‌రి ధ్యేయం… ఇక మ‌ద్యం మ‌త్తులో ఉంటే ఏం చేస్తుందీ తెలియ‌దు. అలాంటి స్థితిలోనే దారుణ హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. న‌ల్గొండ జిల్లాలో ఇటీవ‌ల ఇలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి చోటు చేసుకుంది. మ‌ద్యం మ‌త్తులో ఉన్న భ‌ర్తే స్వ‌యంగా భార్య‌ను చంపేశాడు. సుత్తితో త‌ల‌పై మోది మ‌రీ దారుణానికి పాల్ప‌డ్డాడు. అందుకు అత‌ని కొడుకు స‌హ‌క‌రించ‌డం అంద‌రినీ షాక్‌కు గురి చేసింది.

raju-moti

నల్గొండ జిల్లాలోని చింత‌ప‌ల్ల మండంలో నివాసం ఉండే రాజు, మోతిలు దంప‌తులు. వీరికి ఓ బాలుడు సంతానం. కాగా ఈ నెల 15వ తేదీన రాజు, మోతిలు ఇద్ద‌రూ విపరీతంగా మద్యం సేవించారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రికీ ఓ విష‌య‌మై తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో రాజు త‌న భార్య మోతి త‌ల‌పై సుత్తితో మోది ఆమెను హ‌త్య చేశాడు. అయితే అత‌నికి కొడుకు సుత్తి తెచ్చి ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఆ సుత్తితోనే భార్య‌ను అత్యంత దారుణంగా హ‌త్య చేశాడు. ఈ క్రమంలో ఆ తతంగం మొత్తాన్ని కొడుకు చేత సెల్‌ఫోన్‌లో వీడియో తీయించాడు. దీంతో సంఘ‌ట‌న స్థలానికి పోలీసులు చేరుకుని రాజును అదుపులోకి తీసుకున్నారు.

స‌మాజంలో మ‌నుషుల మ‌ధ్య బంధాలు తెగిపోతున్నాయ‌న‌డానికి ఇంత‌క‌న్నా పెద్ద ఉదాహ‌ర‌ణ ఇంకేం కావాలి. కొంద‌రు చిన్న త‌ప్పుకే ఆత్మ‌హ‌త్య చేసుకుంటుంటే, ఇంకొంద‌రు ఇలా ఎదుటి వారి ప్రాణాలు తీస్తున్నారు. అస‌లు ఎదుటి వారు త‌ప్పు చేశారో లేదో తెలియ‌కుండానే క్ష‌ణికావేశంలో నిర్ణ‌యం తీసుకుని ఇంత‌టి దారుణాల‌కు పాల్ప‌డుతున్నారు. మ‌రి ఇలాంటి వారిని మార్చాలంటే… ఆ దేవుడే దిగి రావాలేమో..!

Comments

comments

Share this post

scroll to top