ఆ యువ‌కుడు ఇంజినీరింగ్ జాబ్ వ‌దిలి గ్రామీణ మ‌హిళ‌ల‌కు శిక్ష‌ణ‌నిస్తున్నాడు. ఎందుకో తెలుసా..?

చ‌దువుకున్న వాళ్లంతా ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో ఉండి త‌మ ప‌ని తాము, త‌మ జీవితం తాము చూసుకుంటే ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి ఎవ‌రు స‌హ‌కారం అందిస్తారు..? వారి బ‌తుకులు ఎప్పుడు బాగుప‌డుతాయి..? వారి జీవితాల్లో మార్పు ఎప్పుడు వ‌స్తుంది..? రాదు క‌దా. అవును, రాదు. స‌రిగ్గా ఇలా ఆలోచించాడు కాబ‌ట్టే ఆ యువ‌కుడు పెద్ద కంపెనీలో మెకానిక‌ల్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారి బాగు కోసం తాను చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వ‌దిలిపెట్టాడు. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

అతని పేరు నీల్ కామ‌త్‌. బెంగుళూరు వాసి. ముంబైలో లార్స‌న్ అండ్ టూబ్రో అనే పెద్ద కంపెనీలో మెకానిక‌ల్ ఇంజినీర్ గా ప‌నిచేస్తున్నాడు. విలాస‌వంత‌మైన జీవితం, క‌ష్టాలు లేని జీవ‌నం గ‌డుపుతున్నా నీల్ కామ‌త్‌కు ఏదో లోటు అనిపించేది. మ‌న‌మంతా ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో ఉండి మ‌న బ‌తుకు మ‌నం బ‌తికితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారిని ఎవ‌రు ప‌ట్టించుకుంటారు..? అన్న ఆలోచ‌న అత‌నికి వ‌చ్చింది. వెంట‌నే చేస్తున్న ఉద్యోగానికి స్వ‌స్తి ప‌లికాడు. త‌న సొంత ప్రాంతానికి తిరుగు ప్ర‌యాణం అయ్యాడు. అలా అత‌ను బెంగుళూరు వ‌చ్చేశాడు. ఆ త‌రువాత ఎస్‌బీఐ యూత్ ఫ‌ర్ ఇండియా, బేర్ ఫుట్ కాలేజీ స్వ‌చ్ఛంద సంస్థ‌ల ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన ప్రాజెక్టులో సేవ‌లు అందించేందుకు సిద్ధ‌మయ్యాడు.

అనంత‌రం అత‌ను ఆ ప్రాజెక్టులో భాగంగా ఉత్త‌రాఖండ్‌, కేర‌ళ ప్రాంతాల్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల‌కు వెళ్లాడు. అక్క‌డ ఉండే మహిళ‌ల‌కు తేనెటీగల పెంపకంపై అవ‌గాహ‌న క‌ల్పించాడు. తేనెటీగ‌లను ఎలా పెంచాలి, ఎన్ని రోజుల‌కు తేనె వ‌స్తుంది, వాటి సంర‌క్ష‌ణ ఎలా అనే ప‌లు అంశాల‌పై అత‌ను తోటి వాలంటీర్ల‌తో క‌లిసి మ‌హిళ‌ల‌కు శిక్ష‌ణ‌నిస్తున్నాడు. దీంతో ఇప్పుడు అక్క‌డి మ‌హిళ‌లు విజ‌య‌వంతంగా తేనెటీగ‌ల‌ను పెంచుతున్నారు. త్వ‌ర‌లో వారు తేనె తీసి విక్ర‌యాలు కూడా ప్రారంభించ‌నున్నారు. అయితే నీల్ కామ‌త్ ఇక్క‌డితో ఆగ‌న‌ని, ఇంకా ఎంతో మందికి ఇలా సేవ‌నందిస్తాన‌ని చెబుతున్నాడు. అత‌ని ఆశ‌యం నెర‌వేరాల‌ని కోరుకుందాం.

Comments

comments

Share this post

scroll to top