.2వేల నోటు రూ.1.50 ల‌క్ష‌ల‌కు అమ్మ‌కం..! ఇంతకీ ఆ నోట్ లో ఏముందో తెలుసా?

ఆన్‌లైన్‌లో సెకండ్ హ్యాండ్ వ‌స్తువులు అమ్మ‌డం అనేది నేటి త‌రుణంలో ఎంత‌గా పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర‌లేదు. జ‌నాలు త‌మ‌కు ఇష్టం లేని ఏ వ‌స్తువునైనా ఆయా సైట్ల‌లో యాడ్ పెట్టి మ‌రీ అమ్మేస్తున్నారు. సెకండ్ హ్యాండ్ వ‌స్తువుల‌ను కొనుగోలు చేసే దుకాణాల్లో క‌న్నా ఇలా అమ్మితేనే ఎక్కువ లాభం వ‌స్తుండ‌డంతో ప్ర‌జ‌లంద‌రూ ఇదే బాట ప‌డుతున్నారు. అయితే వ‌స్తువుల వ‌రకైతే ఆన్‌లైన్‌లో అమ్మ‌డం ఓకే..! కానీ క‌రెన్సీ నోట్ల‌ను అమ్మితే..? అవి కూడా కొత్త నోట్లే అయితే..? ఎలా ఉంటుంది..? వినేందుకు ఆశ్చ‌ర్యంగానే ఉన్నా మీరు విన్న‌ది క‌రెక్టే. కొత్త‌గా వ‌చ్చిన రూ.2 వేల నోట్ల‌ను ఓ వ్య‌క్తి ఆన్‌లైన్‌లో అమ్మ‌కానికి పెట్టాడు. అనంత‌రం ఏం జ‌రిగింది..? అస‌లు ఆ వ్య‌క్తి ఆ నోట్ల‌ను ఎందుకు అమ్మాల‌నుకున్నాడు..? ఇప్పుడు చూద్దాం..!

2000-note-for-1-5-lakhs

ebay.in సైట్ తెలుసుగా. అనేక ర‌కాల వ‌స్తువులు ఇందులో దొరుకుతాయి. కొత్త‌వి, పాత‌వి వేటినైనా వినియోగ‌దారులు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ సైట్‌ల హ‌వాలో ఇప్పుడు దీనికి అంత‌గా పాపులారిటీ కూడా లేదు. అది వేరే విష‌యం. అయితే ఈ సైట్‌లోనే ఓ వ్య‌క్తి తాజాగా త‌న వ‌ద్ద ఉన్న రూ.2వేల నోట్ల‌ను అమ్మ‌కానికి పెట్టాడు. అత‌న‌లా ఎందుకు చేశాడంటే… ఆయా నోట్ల సీరియ‌ల్ నంబ‌ర్లు కొన్ని వ‌ర్గాలు ల‌క్కీగా భావించే నంబ‌ర్లుగా ఉండ‌డ‌మే. ఆ నోట్ల‌పై ముందు వ‌రుస‌లో ఉన్న నంబ‌ర్ల‌ను ప‌క్క‌న పెడితే చివ‌రి మూడు అంకెలు 786 సిరీస్‌తో ముగుస్తాయి. ఈ అంకెను చాలా మంది ల‌క్కీగా భావిస్తారు.

మ‌న దేశంలోనే కాదు ప్ర‌పంచంలో ఎక్క‌డైనా ఇలాంటి లక్కీ నంబ‌ర్ల‌ను న‌మ్మేవారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ఆ వ్య‌క్తి స‌ద‌రు అంకె సిరీస్ ఉన్న రూ.2వేల కొత్త నోట్ల‌ను ఈబే సైట్‌లో అమ్మ‌కానికి ఉంచాడు. ఒక్కో నోటును రూ.1.50 ల‌క్ష‌లకు ఇస్తాన‌ని అందులో ప్ర‌క‌ట‌న పెట్టాడు. దీంతో కొద్ది నిమిషాల్లోనే ఆ ఆఫ‌ర్‌కు చాలా మంది ముందుకు వ‌చ్చారు. అయితే చెలామ‌ణీలో లేని పాత నోట్ల‌ను క‌రెన్సీ క‌లెక్ష‌న్ పేరిట‌, హ్యాబిట్ పేరిట కొనుగోలు చేయ‌వ‌చ్చు, అమ్మ‌వ‌చ్చు కానీ, చెలామ‌ణీలో ఉన్న కొత్త నోట్ల‌ను అమ్మ‌డానికి లేదు. కొన‌డానికి లేదు. ఒక వేళ ఎవ‌రైనా అలా చేస్తే చ‌ట్ట ప‌రంగా శిక్ష త‌ప్ప‌దు. దీంతో ఈబే స‌ద‌రు వ్య‌క్తికి వార్నింగ్ ఇచ్చి వెంట‌నే ఆ ప్ర‌క‌ట‌న‌ను తొల‌గించింది.

అయితే పైన చెప్పిన వ్య‌క్తి మాత్ర‌మే కాదు, ఇంకా కొన్ని సైట్ల‌లో దాదాపుగా ఇలాంటి ఆఫ‌ర్ల‌తోనే రూ.2వేల నోట్ల‌ను అమ్ముతున్నార‌ట‌. కొంద‌రు ఒక్కో నోటును రూ.3500కు అమ్ముతుంటే ఇంకొంద‌రు రూ.2వేల నోటును కొన్న వారికి రూ.500 కొత్త నోటు ఉచితంగా ఇస్తామ‌ని ఆఫ‌ర్లు పెడుతున్నార‌ట‌. ఏది ఏమైనా ఇలాంటి వ్య‌క్తుల చేతిలో మాత్రం ఎవ‌రూ మోస‌పోవ‌ద్దు. కొత్త నోటుపై ఆ మాత్రం ఉత్సుక‌త ఉండ‌డం స‌హ‌జ‌మే. కొన్ని రోజులు పోతే ఎలాగూ అవి వాడ‌కంలోకి వ‌స్తాయి. అంత మాత్రాన ల‌క్కీ నంబ‌ర్ల‌ని చెప్పి, కొత్త నోట‌ని చెప్పి వాటిని కొనుగోలు మాత్రం చేయ‌కండి..!

Comments

comments

Share this post

scroll to top