అత‌ను ఒక‌ప్పుడు డెలివ‌రీ బాయ్‌… ఇప్పుడు కోటీశ్వ‌రుడు..!

దేశీయ ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్ కార్ట్ అంటే తెలియ‌ని వారుండ‌రు. కొన్ని కోట్ల ప్రోడ‌క్ట్స్‌ను నిత్యం అందులో యూజ‌ర్లు కొంటూ ఉంటారు. ఈ క్రమంలో ఆ సంస్థ‌కు కొన్ని వేల కోట్ల ఆదాయం కూడా వ‌స్తుంది. మ‌న దేశంలో టాప్‌-1 ఈ-కామ‌ర్స్ సైట్‌గా ఫ్లిప్‌కార్ట్ దూసుకుపోతుంది. అయితే మీకు తెలుసా..? ఫ‌్లిప్ కార్ట్‌లో చేరిన తొలి ఉద్యోగి ఎవ‌రో..? అత‌ని పేరు అయ్య‌ప్ప‌..! బెంగుళూరు వాసి. అవును, కంపెనీ ప్రారంభం అయ్యాక అందులో ఉద్యోగులు క‌చ్చితంగా చేరుతారు క‌దా. అలాంటి వారిలో అత‌నే మొద‌టి వ్య‌క్తి అయి ఉండొచ్చు. ఇంత‌కీ… అందులో విశేషమేముందీ..? అంటారా..? అవును, క‌చ్చితంగా విశేషమే ఉంది. ఎందుకంటే అయ్య‌ప్ప మొద‌ట ప‌నిచేసింది డెలివ‌రీ బాయ్‌గా.! అవును, మీరు విన్న‌ది నిజ‌మే. మ‌రి ఇప్పుడు అత‌ని జీత‌మెంతో తెలుసా..? నెల‌కు రూ.6 ల‌క్ష‌లు..! మీరు ఆశ్చ‌ర్య‌పోయినా, మేం చెబుతోంది క‌రెక్టే..!

అయ్య‌ప్ప జీవితం మొద‌ట స్టార్ట్ అయింది డెలివ‌రీ బాయ్ గానే. క‌ర్ణాట‌క‌లోని వెల్లూరు జిల్లా అత‌ని స్వ‌గ్రామం. అశోక్ లేల్యాండ్ లారీల కంపెనీలో మొదట అప్రెంటిస్ షిప్ చేశాడు. ఆ త‌రువాత ఫ‌స్ట్ ఫ్లైట్ కొరియ‌ర్స్‌లో డెలివ‌రీ బాయ్ గా జాయిన్ అయ్యాడు. అలా 4 ఏళ్ల‌పాటు అందులోనే పనిచేశాక ద‌క్షిణ బెంగుళూరుకు వ‌చ్చే లాజిస్టిక్స్‌ను ప‌ర్య‌వేక్షించే స్థాయికి అయ్య‌ప్ప ఎదిగాడు. అయితే ఆ ఫీల్డ్‌లోనే కోర్సు చేస్తే ఇంకా మంచి అవ‌కాశాలు ఉంటాయ‌ని తెలుసుకుని ఆ ఉద్యోగం మానేసి ఓ కోర్సులో జాయిన్ అయ్యాడు.

అయితే తీరా కోర్సు ముగిసి మ‌ళ్లీ ఫ‌స్ట్ ఫ్లైట్ సంస్థ‌కు ఉద్యోగానికి వెళితే అప్పుడు అందులో ఖాళీలు లేవు పొమ్మ‌న్నారు. కానీ వారు అలా పొమ్మ‌న‌డ‌మే అత‌ని త‌ల‌రాత‌ను మార్చింది. ఆ త‌రువాత ఫ్లిప్‌కార్ట్ సంస్థ‌లో తొలి ఉద్యోగిగా అయ్య‌ప్ప చేరాడు. లాజిస్టిక్స్ ను ప‌ర్య‌వేక్షించే ఉద్యోగిగా అందులో రూ.8వేల‌కు అయ్య‌ప్ప చేరాడు. అయితే ఫ్లిప్‌కార్ట్ ఓన‌ర్లు స‌చిన్ బ‌న్స‌ల్‌, బిన్నీ బ‌న్స‌ల్‌లతో అయ్య‌ప్ప‌కు చ‌క్క‌ని స్నేహం కుదిరింది. దీంతో ఫ్లిప్‌కార్ట్‌లో అయ్య‌ప్ప అంచెలంచెలుగా ఎదిగాడు. ఇప్పుడు అత‌ను అందులో అసోసియేట్ డైరెక్ట‌ర్ అయ్యాడు. ప్ర‌స్తుతం అత‌ని జీతం నెల‌కు రూ.6 ల‌క్ష‌లు. అత‌ను త‌న తల్లి, భార్య‌, నాన‌మ్మ‌ల‌తో క‌లిసి బెంగుళూరులో నివాసం ఉంటున్నాడు. అయితే అలా బ‌న్స‌ల్ సోద‌రులు అత‌నికి ఆ ప‌ద‌వి ఇవ్వ‌డ‌మే కాదు, అత‌ని ప‌ని, అత‌ను ఇచ్చే స‌ల‌హాలు న‌చ్చి అయ్య‌ప్ప‌కు వారు త‌మ కంపెనీలో కొన్ని షేర్ల‌ను కూడా ఇచ్చారు. దీంతో అయ్యప్ప కోటీశ్వ‌రుడు అయిపోయాడు. అలా డెలివ‌రీ బాయ్‌గా అత‌ను జీవితం ప్రారంభించి ఇప్పుడు కోటీశ్వ‌రుడు అవ‌డం నిజంగా అత‌ని ప్ర‌తిభే క‌దా..! అందుకే అంటారు, ఓట‌మి అనేది గెలుపుకు తొలి మెట్టు అని. ఓ సంస్థ‌లో ఓట‌మిపాలైనా మ‌రో సంస్థ‌లో విజ‌య‌ప‌థంలో అయ్య‌ప్ప దూసుకెళ్తున్నాడు.

Comments

comments

Share this post

scroll to top