తన సంపాదనంతా…రైతులకు, సైనికులకు అందేలా వీలునామా రాసిన గొప్ప వ్యక్తి.

మ‌న స‌మాజంలో అనేక ర‌కాలైన వ్య‌క్తులు ఉన్నారు. వారిలో కొంద‌రు కేవ‌లం సంపాద‌నపైనే దృష్టి పెడ‌తారు తప్ప తోటి వారికి స‌హాయం చేయాల‌నే ఆలోచ‌న ఉండ‌దు. ఇంకొంద‌రు తాము సంపాదించే దాన్నుంచి ఎంతో కొంత ఇత‌రుల‌కు దానం చేస్తారు. అయితే వీరే కాదు, ఇంకో విభాగానికి చెందిన వారు కూడా మ‌న స‌మాజంలో ఉన్నారు. కానీ అలాంటి వారు మ‌న‌కు చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తారు. వారు తాము సంపాదించిన మొత్తాన్ని ఇతరుల కోస‌మే ఖ‌ర్చు చేస్తారు. అదిగో, పూణెకు చెందిన ఆ వ్య‌క్తి కూడా స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతాడు. ఆయ‌నే ప్ర‌కాష్ కెల్కార్‌.

prakash

ప్ర‌కాష్ కెల్కార్ పూణె వాసి. అనేక మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీల్లో కాట‌న్ ఎక్స్‌ప‌ర్ట్‌గా ప‌నిచేశాడు. మొన్నా మ‌ధ్యే రిటైర్ కూడా అయ్యాడు. కాగా మొద‌ట్నుంచీ ప్ర‌కాష్‌కు దాన గుణం ఎక్కువ‌. దీనికి తోడు ఆప‌ద‌లో ఉన్న వారికి ఏదో ఒక విధంగా స‌హాయం కూడా చేసే వాడు. అయితే ఆయన త‌న రిటైర్మెంట్ త‌రువాత‌ తీసుకున్న నిర్ణ‌యం ఏమిటో తెలుసా..? త‌న సంపాద‌న మొత్తాన్ని విరాళంగా ఇచ్చేయాలని అనుకున్నాడు. ఆయ‌న నిర్ణ‌యానికి అత‌ని భార్య‌, ఇద్ద‌రు కూతుళ్లు కూడా స‌పోర్ట్ నిచ్చారు. దీంతో ప్ర‌కాష్ త‌న సంపాద‌న‌ను విరాళంగా ఇచ్చే ఉద్దేశం దృష్ట్యా ఆయ‌న ఓ విల్లును ప్ర‌స్తుతం త‌యారు చేస్తున్నాడు.

త‌న సంపాద‌నలో 30 శాతం ధ‌నాన్ని ప్ర‌ధాన మంత్రి రిలీఫ్ ఫండ్‌కు, మరో 30 శాతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు, మ‌రో 30 శాతాన్ని సైనికులు, రైతుల‌కు, మిగిలిన 10 శాతాన్ని టాప్ 5 ఎన్‌జీవో సంస్థ‌ల‌కు ఇచ్చేట్టుగా ప్ర‌కాష్ త‌న భార్య‌తో క‌లిసి జాయింట్ విల్లును ఏర్పాటు చేస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఆ ధ‌న‌మంతా ఆయా విభాగాల‌కు చేర‌నుంది. అయితే ఇదే కాదు, గ‌తంలో ప్ర‌కాష్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న 40 రైతు కుటుంబాల‌కు ఆర్థిక స‌హాయం చేశాడు. సిటీలో ట్రాఫిక్ నియంత్ర‌ణ‌కు పోలీసుల‌కు స‌హాయం చేస్తున్నాడు కూడా. నిజంగా ఇలాంటి వారు మ‌న‌కు చాలా అరుదుగా క‌నిపిస్తారు క‌దా..! ఏది ఏమైనా తాను సంపాదించిన దాన్నంతా ఇచ్చేయ‌డానికి ముందుకు వ‌చ్చిన ప్ర‌కాష్‌కు, అతని కుటుంబానికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top