ఉరివేసుకున్నా…చ‌నిపోకుండా ఉండేట‌టువంటి..ఫ్యాన్ ను క‌నిపెట్టిన వ్య‌క్తి.!!

పరీక్షలో తప్పితే ఆత్మహత్య,అమ్మానాన్న తిట్టారనో ,టీచర్ కొట్టాడనో సూసైడ్… ప్రేమ విఫలమైతే బలవన్మరణం… ఇలలాంటి వార్తలు చదివినప్పుడల్లా.. చూసినప్పుడల్లా గుండెలో కలుక్కుమంటుంది. .మనిషిని మనిషి పట్టించుకోనంత గజిబిజి జీవితాలల్లో ప్రతి చిన్న విషయానికి పెద్ద నిర్ణయం తీసుకుంటున్నారు పిల్లలు.  పిల్లలకు చల్లటి గాలిని పంచాల్సిన పంకాలు.. మూడు రెక్కల ఉరికంబాలై పోయాయంటే ఎంత దయనీయ పరిస్థితి. తమ పిల్లల భవిష్యత్ కోసం  తల్లిదండ్రులు కంటున్న కలలను కల్లలు చేస్తుూ పిల్లలు సాధిస్తున్నదేంటి…

మీకు తెలుసా?ఏటా ఎంతమంది విద్యార్దులు చదువుల భారంతో ప్రాణాలు తీసుకుంటున్నారో .. ఒక్క  కోటా లోని హాస్టళ్లలో గత ఆరేళ్లలో అరవైమందికి పైగా  చనిపోయారు. అంటే నెలకో విద్యార్ధి హాస్టల్ రూంలో తనువు చాలిస్తున్నాడన్నమాట. అందులో అందరూ ఫ్యాన్ కు ఉరివేసుకునే చనిపోయినవారే.అందుకే దీనికో విరుగుడు కనిపట్టాలని కోటా హాస్టళ్ల యాజమాన్యాలు భావించాయి. ఈ క్రమంలోనే ముందుకొచ్చాడు మహారాష్ట్రకు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ రిటైర్డ్ ఉద్యోగి శరద్ ఆశానీ. క్రాంప్టన్ అండ్ గ్రీవ్స్ లో జనరల్ మేనేజర్ గా పనిచేసిన శరద్.. పిల్లల ఆత్మహత్యలకు నివారణోపాయం కనిపెట్టాడు. దానిపేరే యాంటీ సూసైడ్ ఫ్యాన్ రాడ్స్.

దీంట్లో పెద్దగా టెక్నాలజీ మహిమ, మెకానిజం లేవు. చాలా సింపుల్. ఫ్యాన్ తో పాటు వచ్చిన ఒరిజినల్ రాడ్ ని తీసేసి.. స్ప్రింగులతో కూడిన రాడ్ ని అటాచ్ చేస్తారు. దానికి 20 కిలోల కంటే ఎక్కువ బరువు వేలాడితే ఆటోమేటిగ్గా దాంట్లో ఉన్న స్ప్రింగులు యాక్టివేట్ అవుతాయి. రాడ్ కిందికి జారుతుంది. ఉరేసుకున్న మనిషి క్షణాల్లో భూమ్మీద వాలిపోతాడు.ఈ రాడ్ ఖరీదు ఎంతో కాదు. జస్ట్ రూ. 250 మాత్రమే. కొత్తఫ్యాన్లతోపాటు పాత పంకాలకు కూడా దీన్ని అమర్చవచ్చు. ఈ ప్రయోగం అద్భుతంగా ఉంటడంతో కోటా హాస్టల్ అసోసియేషన్ ఉన్నపళంగా 5వేల రాడ్లకు ఆర్డరిచ్చింది.

Comments

comments

Share this post

scroll to top