200 మంది పిల్ల‌ల‌కు చ‌దువు చెప్పించి గొప్ప‌వారిని చేసిన ఉన్న‌త‌మైన వ్య‌క్తి అత‌ను..!

నేటి స‌మాజంలో మ‌నుషులు నేను… నా భార్య‌, పిల్ల‌లు… కుటుంబం… అనే ఆలోచిస్తున్నారు త‌ప్ప‌, మేము… మ‌నం… మ‌న స‌మాజం అని ఆలోచించ‌డం లేదు. ఈ కార‌ణంగానే చాలా మంది పేద‌లు ఇంకా పేద‌లుగా మారిపోతున్నారు. ధ‌న‌వంతులు ఇంకా ధ‌న‌వంతులు అవుతున్నారు. ఎంత సేపు నా చిన్ని బొజ్జ శ్రీ‌రామ‌ర‌క్ష అనే ప‌ద్ధ‌తిలోనే స‌గ‌టు మ‌నిషి వెళ్తున్నాడు. కానీ ముంబైకి చెందిన వ్య‌క్తి అలా కాదు. పేద కుటుంబాల‌నే త‌న కుటుంబాల‌ని అనుకున్నాడు. వారి పిల్ల‌ల‌నే త‌న పిల్ల‌ల‌ని భావించాడు. ఈ క్ర‌మంలోనే వారి బాగు కోసం, సంక్షేమం కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నాడు.

mumbai-person-education

చిత్రంలోని వ్య‌క్తిని చూశారుగా..! చూసేందుకు చాలా సామాన్యమైన వ్య‌క్తిగా క‌నిపిస్తున్నా ఆయ‌న ఎంతో మంది పిల్ల‌ల‌కు భ‌విష్య‌త్తును ఇచ్చిన వ్య‌క్తి. అది 2001 వ సంవ‌త్స‌రం. అనుకోకుండా జ‌రిగిన ప్ర‌మాదంలో ఆయ‌న ఎడ‌మ కాలులో రంధ్రం ప‌డింది. కుడి క‌న్ను చూపు కూడా దాదాపుగా పోయింద‌నే చెప్పాలి. అదే స‌మ‌యంలో ఆయ‌న‌కు కోలుకునేందుకు దాదాపు 4 ఏళ్లు ప‌ట్టింది. ఓ వైపు బెడ్‌పై చికిత్స పొందుతూనే తాను అనుకున్న ఓ బృహ‌త్ నిర్ణ‌యానికి ప్ర‌ణాళిక‌లు వేసి దాన్ని ఆచ‌ర‌ణ‌లో పెట్టాడు. త‌న నిర్ణ‌యాన్ని భార్య‌తో పంచుకోగా ఆమె కూడా అందుకు మ‌ద్ద‌తు తెలిపింది. అంతే అప్ప‌టి నుంచి పేద పిల్ల‌ల బాగు కోసం ఆయ‌న శ్ర‌మిస్తూనే ఉన్నాడు.

యాక్సిడెంట్ అయి బెడ్‌పై ఉన్న‌ప్ప‌టికీ అత‌ను ఏ నిర్ణయం తీసుకున్నాడంటే త‌న వ‌ద్ద ఉన్న డ‌బ్బు అయిపోయే వ‌రకు పేద పిల్ల‌ల‌కు చ‌దువు చెప్పించాల‌ని. వారు అనుకున్న ల‌క్ష్యాన్ని సాధింప‌జేయాల‌ని అనుకున్నాడు. అందులో భాగంగానే 2001 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న దాదాపుగా 200 మంది పిల్ల‌ల‌కు చ‌దువు చెప్పించాడు. అది స్కూల్, కాలేజీ ఏది అయినా కావ‌చ్చు. ఆ పిల్ల‌ల‌ను భావి భార‌త పౌరులుగా, వాళ్ల కాళ్ల మీద వారు నిల‌బ‌డేలా తీర్చిదిద్దాడు. అంతేకాదు, ఇప్ప‌టికీ ఆయన 40 మంది పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకుని సొంత పిల్ల‌ల్లా చ‌దివిస్తున్నాడు కూడా. అయితే ఎంత ఆస్తి అయినా కూర్చుని తింటే కొండ‌లు క‌రిగినట్టు క‌రిగిపోతుంద‌నే చందంగా, ఆయ‌న చేస్తున్న కార్య‌క్ర‌మం వ‌ల్ల అత‌ని వ‌ద్ద ఉన్న డ‌బ్బు కూడా అయిపోయే స్థితికి చేరుకుంది. అయిన‌ప్ప‌టికీ త‌న ప్ర‌య‌త్నాన్ని మాత్రం అత‌ను ఆప‌డం లేదు. తన శ్వాస ఉన్నంత వ‌ర‌కు పేద పిల్ల‌ల‌కు స‌హాయం చేస్తూనే ఉంటానంటున్నాడు అత‌ను. అయితే అత‌ని వ‌ల్ల బాగా చ‌దువుకుని ఇప్పుడు గొప్ప పొజిష‌న్‌లో ఉన్న‌వారు స‌హాయం చేద్దామ‌ని ముందుకు వ‌స్తున్నారు కూడా. అయినా వారికి ఆయ‌న ఒకటే చెబుతున్నాడు. త‌న‌కే స‌హాయం అక్క‌ర్లేద‌ని. వీలైతే వారిని కూడా అలాగే పిల్ల‌ల‌కు స‌హాయం చేయ‌మ‌ని చెబుతున్నాడు. నిజంగా ఆ వ్య‌క్తికి మ‌నం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top