అతడి సంకల్పం ముందు…అవిటితనం చిన్నబోయింది. ఈ వీడియో సోమరులకు అంకితం.

ఓ వైపు హోరున వ‌ర్షం. విడ‌వ‌కుండా కురుస్తోంది. మరో వైపు రెండు చేతులు లేవు. అయినా పూట గ‌డ‌వ‌డం కోసం క‌ష్ట‌ప‌డ‌క త‌ప్ప‌దు క‌దా. అందుకే అంత‌టి వ‌ర్షాన్ని కూడా లెక్క చేయ‌డం లేదు ఆ వ్య‌క్తి. వ‌ర్షం ప‌డుతున్నా అందులోనే త‌డుస్తూ కూర‌గాయ‌లు అమ్ముకుంటున్నాడు. చూసే వారికి ఇది అత్యంత జాలి క‌లిగించ‌వచ్చు. అయినా త‌ప్ప‌దు క‌దా. ఎవ‌రి జీవ‌నం వారిదే. ఎవ‌రి బ‌తుకు వారిదే. ఒక‌రు ఒక చోట‌, ఇంకొక‌రు ఇంకో చోట… ఎక్క‌డైనా క‌ష్ట‌ప‌డ‌క త‌ప్ప‌దు క‌దా. అలా చేస్తేనే నాలుగు వేళ్లూ లోపలికి వెళ్లేది. కడుపు బాధ తీరేది.

vegetable-seller-rain

పైన చెప్పిన సంఘ‌ట‌న ఊహాతీతం, క‌ల్ప‌న కాదు. నిజంగా జ‌రిగిందే. రెండు చేతులు లేకున్నా వ‌ర్షంలో త‌డుస్తూ మ‌రీ కూర‌గాయ‌లు అమ్ముకుంటున్న ఆ వ్య‌క్తి వీడియో ఇప్పుడు నెట్‌లో ట్రెండ్ అవుతోంది. దాన్ని చూసినా చాలా మంది త‌మ‌కు తోచిన‌విధంగా కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇంకొంద‌రు కొటేష‌న్లు చెబుతున్నారు. మ‌రికొంద‌రు ఆ వ్య‌క్తి శ్ర‌మ‌ను, అత‌ని వైకల్యాన్ని చూసి జాలి ప‌డుతున్నారు. ఎవరు ఏం చేసినా అత‌ని బాధ తీరిపోయేది కాదు క‌దా.

ఆ వ్య‌క్తిని చూసి ఎవ‌రెన్ని మాట‌లు అన్నా, ఏం కామెంట్లు పోస్ట్ చేసినా నిజంగా అత‌ని ఆత్మ‌విశ్వాసాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే. అంగ వైకల్యం ఉండి కూడా అంత‌టి క‌ష్టం ప‌డుతున్న ఆ వ్య‌క్తిని చూసి మ‌నం నేర్చుకోవాల్సింది కూడా ఎంతో ఉంది. ఎన్ని క‌ష్టాలు వచ్చినా కుంగిపోకుండా జీవితంలో ముందుకే సాగాల‌ని చెప్ప‌క‌నే చెబుతున్న ఆ వ్య‌క్తి మ‌న‌లోని చాలా మందికి ప‌రోక్షంగా ప్రేర‌ణ కూడా ఇస్తున్నాడు. ఇంత‌కీ ఈ విష‌యంపై మీరేమంటారు..?

Comments

comments

Share this post

scroll to top