సలసల కాగే నూనెలో చేతులు పెట్టి బజ్జీలు…..ఎంతో ఫేమస్!

ఆ తాత  పేరు హైదర్. ఆ తాత చేసే బజ్జీలు, పునుగులు అక్కడ ఫేమస్. ఆయనకు మాత్రం ఫేమస్ కావాలని లేదు. ఈ జీవితమే చాలంటాడు. సలసల కాగే నూనెలో చేతులు పెట్టి బజ్జీలు తీస్తాడు. కూసింత వేడి కూడా ఆయన చర్మానికి తగలదట. కొందరు వైద్యులు ఆయన చర్మాన్ని పరిశీలించి చూసి, ఏమి చెప్పలేకపోయారట. దీన్ని దేవుడిచ్చిన వరమని అంటున్నాడు ఆ తాత.  కాసిన్ని వేన్నీళ్ళు పడితే చాలు అబ్బా.. అమ్మా అంటూ పైకి,కిందికి ఎగురుతూ ఏడుస్తాం. కానీ ఈ తాత మాత్రం 100 డిగ్రీలకు పైగా వేడిగా ఉన్న నూనెలో చేతులు పెట్టి ఏమీ పట్టనట్లు తాపిగా కూర్చుంటాడు. 14 ఏళ్ళ వయసు నుండి వీధిలో బండిమీద బజ్జీల కొట్టు పెట్టుకొని బజ్జీలు, పుణుగులు వేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఏదో సరదా సలసలకాగే నూనెలో చేతులు పెట్టిన ఈయన చేతికి ఎటువంటి బాధ తగల్లేదు.అప్పటి నుండి ఇలా వేడి నూనెలో చేతులు పెట్టి రుచికరమైన బజ్జీలను అందిస్తున్నాడు. ఈ తాత బండి ముందు ఎప్పుడు చూసిన గుంపుగుంపులుగా జనం. నీకున్న ప్రతిభతో ఇంకా ఏమైనా చేయచ్చు కదా అని అడుగుతే.. ఈ జీవితం చాలు. ఇంతకు మించిన ఉన్నత స్థానం అక్కర్లేదంటాడు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top