కాళ్లు విరిగి చికిత్స పొందుతున్నాడు ఆ వ్య‌క్తి… బ్యాంకుకు వెళ్తే న‌గ‌దు దొర‌క‌డం లేదు..! 

సెంట్ర‌ల్ గ‌వర్న‌మెంటు పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసింది. బాగానే ఉంది. న‌ల్ల కుబేరులు, అవినీతి ప‌రులు తోక ముడుస్తారు. స‌రే వారి సంగ‌తి ఎలా  ఉన్నా సామాన్య జ‌నాల‌కు మాత్రం ఇప్ప‌టికీ ఇంకా నోట్ల ర‌ద్దు క‌ష్టాలు తీర‌నేలేదు. నిత్యం బ్యాంకులు, ఏటీఎంల వ‌ద్ద‌కు వెళ్ల‌డం, అక్క‌డ కిలోమీట‌ర్ల మేర బారులు తీరిన లైన్లో నిలుచోవ‌డం, తీరా టైమ్ వ‌చ్చే స‌రికి నో క్యాష్ బోర్డు వెక్కిరించ‌డం ఇప్పుడు కామ‌న్ అయిపోయింది. స‌రే… వెయిట్ చేస్తాం, తెచ్చుకుంటాం. కాళ్లు, చేతులు, ఇత‌ర అవ‌య‌వాలు అన్నీ దృఢంగా ఉన్న‌వారు ఎంత సేపైనా లైన్లో నిల‌బ‌డ‌తారు. ఎలాగో డ‌బ్బు తెచ్చుకుంటారు. మ‌రి వృద్ధుల ప‌రిస్థితి..? అనారోగ్యాల‌తో ఉన్న వారు, అంగ వైక‌ల్యం ఉన్న వారు, పేషెంట్లు… కిలోమీట‌ర్ల మేర లైన్ల‌లో నిల‌బ‌డ‌గ‌ల‌రా..?  లేరు..! అలాంటి వారు గంట‌ల‌కు గంట‌లు కాదు కదా క‌నీసం ఒక్క నిమిషం కూడా స‌రిగ్గా నిల‌బ‌డ‌లేరు. అలాంటి వారు లైన్ల‌లో నిల‌బ‌డి డ‌బ్బుల‌ను ఎలా తెచ్చుకుంటారు..? ఇలాంటి వారిలో ఇంకా కొంద‌రికి క‌నీసం స‌హాయం చేసేందుకు కుటుంబ స‌భ్యులు, స్నేహితులు కూడా ఉండ‌రు. మ‌రి వారి ప‌రిస్థితి ఏమిటి అధ్య‌క్షా..?

legs-broken-person-bank

పాట్నాలోని చౌక్షిక‌ర్పూర్ ఎస్‌బీఐ బ్యాంక్ అది. షాన్‌వాజ్ అనే వ్య‌క్తికి అక్క‌డికి రోజూ వ‌స్తున్నాడు. గ‌త 10 రోజుల నుంచి బ్యాంక్‌కు రావ‌డం, బ్యాంకులో సిబ్బంది ఏదో ఒక సాకు చెప్ప‌డం, వెన‌క్కి పంపేయ‌డం ఇదే జ‌రుగుతోంది. ఇందులో ఇంకా విచారించే విష‌యం ఏమిటంటే అత‌నికి గత కొద్ది రోజుల కింద‌ట యాక్సిడెంట్ అవ‌డంతో కాళ్లు విరిగాయి. అలా కాళ్లు విరిగి మంచంలో ఉన్నా బ్యాంక్‌కు రాక త‌ప్ప‌డం లేదు. మ‌రో వైపు కుటుంబ స‌భ్యులు, స‌హాయం చేసే వారు ఎవ‌రూ లేరు. క‌చ్చితంగా బ్యాంక్‌కు వెళ్లాల్సిన స్థితి ఏర్ప‌డింది.

అలా షాన్‌వాజ్ గ‌త 10 రోజులుగా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నాడు. నిత్యం రావ‌డం, లైన్లో నిలుచోవ‌డం, వెళ్ల‌డం ఇదీ ప‌రిస్థితి. అయినా డ‌బ్బులు విత్ డ్రా చేసుకుందామంటే ల‌భించ‌డం లేదు. అదీ, యాక్సిడెంట్ అవ‌డం వ‌ల్ల అత‌నికి వ‌చ్చిన ఇన్సూరెన్స్ మొత్తం. అది రూ.36వేల దాకా ఉంది. దాన్ని ఇవ్వ‌డానికే బ్యాంక్ సిబ్బంది గ‌త 10 రోజుల నుంచి తిప్పుకుంటున్నారు. వారు రోజూ షాన్‌వాజ్‌కు ఏదో ఒక సాకు చెబుతున్నారు త‌ప్ప‌, న‌గ‌దు విత్ డ్రా చేసి ఇవ్వ‌డం లేదు. దీంతో అత‌ను ప‌డుతున్న బాధ‌లు అన్నీ ఇన్నీ కావు. బ‌డాబాబుల‌కు వెనుక డోర్ల గుండా పెద్ద ఎత్తున కొత్త నోట్ల‌ను మార్పిడి చేయడం స‌ద‌రు అధికారుల‌కు తెలుసు కానీ, ఇలాంటి సామాన్యుల గోస మాత్రం ప‌ట్ట‌డం లేదు. ఇంకా ఇలాంటి గోస‌లు ఎన్ని చూడాలో..!

Comments

comments

Share this post

scroll to top