భార్య శ‌వాన్ని ద‌హనం చేయాల‌ని చూస్తే… బ్యాంకు అధికారులు క్యాష్ లేదు పొమ్మ‌న్నారు.!

పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌నేమో గానీ సామాన్య జ‌నాలు ప‌డుతున్న క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. నెల మొద‌టి వారం కావ‌డం, జీతాలు ఇచ్చే రోజులు అవ‌డంతో ఎక్క‌డ చూసినా బ్యాంకులు, ఏటీఎంల వ‌ద్ద జ‌నాలు కిలోమీటర్ల లైన్ల‌లో బారులు తీరి క‌నిపిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ న‌గ‌దు విత్ డ్రా చేద్దామంటే వారిని నో క్యాష్ బోర్డులే వెక్కిరిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే నోయిడాకు చెందిన ఓ వ్య‌క్తికి కూడా రెండు, మూడు రోజుల పాటు ఇలాంటి ప‌రిస్థితే ఎదురైంది. చ‌నిపోయిన త‌న భార్య మృత‌దేహాన్ని ద‌హ‌నం చేయ‌డం కోసం డ‌బ్బులు అవ‌స‌రం ప‌డి అత‌ను బ్యాంకు చుట్టూ తిర‌గాల్సి వ‌చ్చింది. చివ‌రికి ప్ర‌భుత్వ అధికారుల జోక్యంతో ఆ వ్య‌క్తి స‌మ‌స్య ప‌రిష్కార‌మైంది.

man-with-wife-dead-body

నోయిడాలో ఉండే మున్నీ లాల్ అనే వ్య‌క్తికి 65 ఏళ్లు. ఇద్ద‌రు కొడుకులు కూడా ఉన్నారు. కానీ వారు వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్నారు. అయితే గ‌త కొంత కాలంగా మున్నీ లాల్ భార్య ఫూల్‌మ‌తి క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూ ఈ నెల 4వ తేదీన హాస్పిట‌ల్‌లో మృతి చెందింది. ఈ క్రమంలో హాస్పిట‌ల్ ఖ‌ర్చుల‌కు గాను మున్నీ లాల్ వ‌ద్ద ఉన్న డ‌బ్బంతా అయిపోయింది. తీరా చూస్తే భార్య మృత‌దేహాన్ని ద‌హ‌నం చేసేందుకు, అంతిమ సంస్కారాలు నిర్వ‌హించేందుకు అత‌ని వ‌ద్ద డ‌బ్బు లేదు. బ్యాంకులో ఉంది. దాన్ని డ్రా చేసుకుందామ‌ని చూస్తే ఏటీఎంలు బంద్ ఉన్నాయి. బ్యాంకుల‌కు వెళితే నో క్యాష్ బోర్డులు వెక్కిరించాయి. అయిన‌ప్ప‌టికీ అత‌ను బ్యాంక్ అధికారుల‌ను రిక్వెస్ట్ చేశాడు. అయినా వారు స్పందించ‌లేదు.

అలా మున్నీ లాల్ రెండు రోజుల పాటు బ్యాంకుకు తిరిగినా స‌ద‌రు బ్యాంక్ ఉద్యోగులు క‌నీసం స్పందించ‌ను కూడా లేదు. అయితే అత‌ని విష‌యం స్థానిక ఎస్ఐకి తెలిసింది. దీంతో అత‌నితోపాటు లోక‌ల్ లీడ‌ర్ ఒక‌త‌ను కూడా మున్నీలాల్ వ‌ద్ద‌కు చేరుకుని అత‌నికి రూ.12వేల వ‌ర‌కు స‌హాయం చేశారు. అయితే మున్నీ లాల్ ఆ డ‌బ్బును నిరాక‌రించాడు. ఎందుకంటే త‌న సొంత డ‌బ్బుతోనే భార్య ద‌హ‌న సంస్కారం చేయ‌మ‌ని చెప్పింద‌ట‌. ఈ విష‌యం చెప్పినా బ్యాంకు అధికారులు స‌సేమిరా అన్నారు. అయితే చివ‌ర‌కు ఈ నెల 6వ తేదీన ఉద‌యం కొడుకులు రావ‌డంతో వారు ఎలాగో త‌మకు ఖాతా ఉన్న మ‌రో బ్యాంకు నుంచి న‌గ‌దు తీసి త‌ల్లి అంత్య‌క్రియ‌లు జ‌రిపించారు. నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో ఇంకా ఇలాంటి బాధాక‌ర‌మైన సంఘ‌ట‌న‌లు ఎన్ని జ‌రుగుతాయో… త‌ల‌చుకుంటేనే అదోలా ఉంది..!

Comments

comments

Share this post

scroll to top