టీ, కాఫీ, స్నాక్స్ అమ్మిన వ్య‌క్తి… రూ.650 కోట్లు సంపాదించాడు..!

టీ, కాఫీ, స్నాక్స్ అమ్మితే… ఏ చిరు వ్యాపారి అయినా త‌న జీవితంలో ఎంత డ‌బ్బును కూడ‌బెట్ట‌గ‌ల‌డు..? అస‌లు నిజానికి చాయ్‌ల‌మ్మే వారికి స‌గ‌టున రోజుకి ఎంత ఆదాయం వ‌స్తుంది..? ఎవ‌రైనా ఊహించ‌గ‌లరా..? ఒక వేళ అది ఎంత ఎక్కువ వ‌చ్చినా… అది ల‌క్ష‌ల్లోనే ఉంటుంద‌ని మాత్రం అంచ‌నా వేయగ‌లం… కానీ అదే వంద‌ల కోట్ల‌కు చేరితే..? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. సూర‌త్‌కు చెందిన ఆ వ్యాపారి టీ, కాఫీ, స్నాక్స్ అమ్ముతూనే వంద‌ల కోట్ల‌ను కూడ‌బెట్టాడు. మ‌న‌మెంత నోరెళ్ల‌బెట్టినా జ‌రిగింది మాత్రం నూటికి నూరుపాళ్లు వాస్త‌వం. ఈ మ‌ధ్య కాలంలో నోట్ల ర‌ద్దు ఎఫెక్ట్ పుణ్యమా అని ఐటీ శాఖ అధికారులు కొంచెం ఎక్కువే ప‌నిచేస్తున్నారు క‌దా. వారి త‌నిఖీల్లోనే స‌ద‌రు సూర‌త్ వ్యాపారి బండారం బ‌య‌ట ప‌డింది.

kishore-bhajiawala

అత‌ని పేరు కిషోర్ భ‌జియావాలా. సూర‌త్‌లో గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా టీ, కాఫీ, స్నాక్స్ అమ్ముతూ జీవ‌నం సాగిస్తున్నాడు. అయితే అత‌నికి ఆ వ్యాపారం అచ్చి రావ‌డంతో అందులో ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అయ్యింది. ఈ క్ర‌మంలోనే అత‌ను ఆ వ్యాపారానికి అనుబంధంగా వ‌డ్డీ వ్యాపారం కూడా ప్రారంభించాడు. దీంతో అత‌ని ఆస్తి ఏటా పెరుగుతూ వ‌చ్చింది. ప్ర‌స్తుతం అత‌ను నెల‌కు రూ.15 కోట్ల వ‌ర‌కు సంపాదిస్తున్నాడ‌ని అధికారుల అంచనా. అలా అత‌ను ఇన్నేళ్ల‌లో దాచి పెట్టిన సంప‌ద విలువ రూ.650 కోట్ల‌ని తేలింది. ఈ మ‌ధ్య కాలంలో నోట్ల ర‌ద్దు వ‌ల్ల కిషోర్ త‌న ద‌గ్గ‌ర బ్యాంక్ లాక‌ర్ల‌లో ఉన్న కోట్లాది రూపాయ‌ల‌ను బ్యాంక్‌ల‌లో డిపాజిట్ చేస్తుండ‌డంతో అత‌ని గురించి ఐటీ శాఖ అధికారుల‌కు స‌మాచారం అందింది. దీంతో వారు కిషోర్ ఇండ్ల‌లో, అత‌ని బంధువుల ఇండ్ల‌లో సోదాలు చేశారు. అయితే ఆ దాడి జ‌రిగి ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని రోజులు గ‌డుస్తున్నా అతని ఆస్తి రోజు రోజుకూ ఇంకా బ‌య‌ట ప‌డుతూనే ఉంద‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కైతే అత‌ని ద‌గ్గ‌ర ఉన్న బంగారం, వెండి, వ‌జ్రాలు, న‌గ‌దు ఇలా… అన్నింటి విలువ క‌లిపి రూ.650 కోట్ల‌ని లెక్క తేలింది. ఇది మ‌రి కొద్ది రోజుల్లో ఇంకా పెర‌గ‌వ‌చ్చ‌ని అంచ‌నా.

ప్ర‌స్తుతం ఐటీ అధికారుల దాడిలో కిషోర్ వ‌ద్ద 50 కిలోల వెండి, రూ.1.39 కోట్ల విలువైన వ‌జ్రాలు, రూ.6.50 కోట్ల న‌గ‌దు, మిగ‌తాది కిలోల కొద్దీ బంగారం రూపంలో ఉన్న‌ట్టు గుర్తించారు. అత‌నికి చెందిన కుటుంబ స‌భ్యులు, బంధువుల ఖాతాలు 40 వ‌ర‌కు ఉన్నాయ‌ట‌. వాటిల్లో కోట్ల కొద్దీ డ‌బ్బు ఉంద‌ట‌. వారికి చెందిన లాక‌ర్ల‌లోనూ కిషోర్ కోట్లు దాచాడ‌ని తెలిసింది. దీంతో వాట‌న్నింటినీ తెరిపించే ప‌నిలో ప‌డ్డారు ఐటీ అధికారులు. అవి తెరుచుకుంటే గానీ అత‌ని ఆస్తి మొత్తం వివ‌రాలు బ‌య‌ట ప‌డ‌వు. అయితే ఇన్నేళ్ల పాటు కిషోర్ వ‌డ్డీ వ్యాపారం చేసినా అత‌ను ఏటా ఐటీ శాఖ‌కు క‌డుతున్న ఆదాయ‌పు ప‌న్ను ఎంతో తెలుసా..? కేవ‌లం రూ.1 కోటి మాత్ర‌మే ఆదాయం ఉన్న‌ట్టు ఐటీ శాఖ‌కు రిటర్న్స్ దాఖ‌లు చేస్తూ వ‌స్తున్నాడు. దీంతో నివ్వెర పోవ‌డం అధికారు వంతైంది. మ‌రి… ఈ కిషోర్ కేసు చివ‌ర‌కు ఏమ‌వుతుందో… వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top