ఫలానా హీరో లేదా ఫలానా హీరోయిన్లకు చెందిన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు మీడియాలో ఎక్కడ చూసినా వారి గురించి, వారి సినిమా గురించి హడావిడి కనిపిస్తూ ఉంటుంది. వారికి చెందిన న్యూస్ రోజుకొకటి పాఠకులకు, ప్రేక్షకులకు తెలుస్తూ ఉంటుంది. అయితే నిజంగా నేడు మీడియా ఎలా మారిందంటే సినిమా వార్తలకు ఇచ్చిన ప్రాధాన్యత ఇతర ముఖ్యమైన వ్యక్తులకు ఇవ్వడం లేదు. దీంతో ఆయా రంగాల్లో విజయవంతంగా ముందుకు దూసుకెళ్తున్న వారి గురించి అస్సలు చాలా మందికి తెలియడం లేదు. ఎందుకంటే సినిమా వార్తలను హైలైట్ చేసినంతగా సదరు ప్రాముఖ్యం ఉన్న వారి గురించి మీడియా హైలైట్ చేయడం లేదు కదా. కానీ ఈ వేదికపై మేం పలువురు ప్రముఖ వ్యక్తుల గురించి మీకు తెలియజేయబోతున్నాం. వారందరూ సినిమా స్టార్లకు ఏమాత్రం తీసిపోరు. అంతటి గొప్పతనం, ప్రాముఖ్యత వారికి కూడ దక్కాల్సిందే. అందుకే వారి గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం.
ఇప్పుడంటే విద్యాసంస్థలన్నీ కార్పొరేట్‌మయం అయిపోయాయి. చదువు కంటే కూడా ఫీజుల వసూలుకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం అలా కాదు. విద్యాసంస్థ అంటే అది సమాజానికి వెలుగునిచ్చే ఓ గొప్ప వేదికగా, నేటి తరం విద్యార్థులను రేపటి తరం భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే దేవాలయాలుగా ఉండేవి. అయితే భవిష్యత్తులోనూ పాఠశాలలు అలాగే కొనసాగాలనే ఉద్దేశంతో అతను ఓ స్కూల్‌ను చిన్నగా ప్రారంభించాడు. ఇప్పుడదే స్కూల్ దేశంలోనే ఉత్తమ స్కూల్‌గా పేరుగాంచింది, అంతేకాదు గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. మరి అలాంటి అత్యుత్తమమైన స్కూల్‌ను ప్రారంభించి నడిపిస్తుంది ఎవరో తెలుసా..? అతనే జగదీష్ గాంధీ.
జగదీష్ గాంధీ తన భార్య భారతి గాంధీతో కలిసి 1959లో యూపీలోని లక్నోలో సిటీ మాంటెస్సొరీ స్కూల్ (సీఎంఎస్) ను ప్రారంభించారు. అందుకు అప్పుడు వారికి అయిన ఖర్చు ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.300. అది కూడా అప్పు తెచ్చి స్కూల్‌ను పెట్టారు. మొదట్లో స్కూల్లో కేవలం 5 మంది మాత్రమే ఉండేవారు. అయితే 2010-11లో ఆ స్కూల్లో ఉన్న విద్యార్థులు ఎంత మందో తెలుసా..? 39,437 మంది. అవును, మీరు విన్నది కరెక్టే. ‘Glory be to the World (ప్రపంచం ప్రకాశిస్తుంది)’ అనే నినాదంతో ప్రారంభమైన ఆ స్కూల్లో నాణ్యమైన విద్య, ఉత్తమమైన విద్యాప్రమాణాలను పాటిస్తుండడంతో అంచెలంచెలుగా ఎదిగి ఆ స్కూల్ అంతటి స్థాయికి చేరుకుంది. అందుకే అందులో అన్ని వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. దీంతో ఆ స్కూల్ ఓ నగరంలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులను కలిగిన స్కూల్‌గా గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. ఇప్పుడు అంటే 2016లో ఆ స్కూల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య 52వేలు.
సిటీ మాంటెస్సొరీ స్కూల్‌కు ఇప్పుడు లక్నో నగరంలోనే 20 దాకా బ్రాంచ్‌లు ఉన్నాయి. ఆ స్కూల్లో నెలకు రెండు అంతర్జాతీయ ఈవెంట్లు కూడా జరుగుతాయి. వాటిలో ఇప్పటి వరకు దలైలామా, భారత మాజీ రాష్ట్రపతి, స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం వంటి ప్రముఖులు ప్రసంగించారు కూడా. అక్కడి విద్యార్థులకు కలాం అంటే ఎంతగానో అభిమానం. ఆయనంటే వారందరికీ ఆదర్శం. అందుకే అక్కడ చదువుకునే విద్యార్థులు అమోఘమైన ప్రతిభ కనబరుస్తుంటారు. ఇంగ్లిష్‌తోపాటు పలు సైన్స్ సబ్జెక్టుల్లో టాప్ ర్యాంకులు అక్కడి వారికి వస్తాయి. అంతెందుకు, సెలీనా జైట్లీ తెలుసుగా, ఆమె ఓ సినీ నటి. చదుకుంది అదే స్కూల్లో. ఈ క్రమంలో ఆ స్కూల్ దేశంలోనే ఉత్తమమైన స్కూల్‌గా పేరుగాంచింది కూడా. మరి అంతటి అత్యుత్తమమైన స్కూల్‌ను తీర్చిదిద్దిన జగదీష్ గాంధీ స్టార్ కాదంటారా..? ముమ్మాటికీ స్టారే కదా..!
Note:ఇలాంటి వార్తలను డైరెక్ట్ గా మీ వాట్సాప్ లో చదవాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ 7997192411 కు Start అని మెసేజ్ చేయండి.