అపార్ట్మెంట్స్…ఇలా కూడా కట్టొచ్చని నిరూపించిన మన హైద్రాబాదీ ఆర్టిటెక్చర్.!

దేశంలో ఆయా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖ వ్య‌క్తుల గురించి, రియ‌ల్ హీరోలు, స్టార్ల గురించి తెలుసుకుంటున్నాం క‌దా. అదిగో ఆ జాబితాలో ఈయ‌న కూడా ఉన్నారు. ఆయనే ప్ర‌ముఖ ఆర్కిటెక్ట్ చార్లెస్ కొరియా. ఎన్నో ప్ర‌ముఖ నిర్మాణాలు, క‌ట్ట‌డాల‌ను డిజైన్ చేసిన వ్య‌క్తి ఈయ‌న‌. అంతేకాదు ప‌ట్ట‌ణాల్లో నివ‌సించే పేద‌ల‌కు త‌క్కువ ఖ‌ర్చుతో నిర్మాణాల‌ను క‌ట్టుకునే విధంగా డిజైన్లు చేసి ఇచ్చిన ప్ర‌ముఖ వ్య‌క్తి ఈయ‌న‌. ఈయ‌న గురించే ఇప్పుడు మ‌నం తెలుసుకోబోయేది.

charles-correa

చార్లెస్ కొరియా జ‌న్మించింది మ‌న భాగ్య‌న‌గ‌రంలోనే. 1930 సెప్టెంబ‌ర్ 1వ తేదీన సికింద్రాబాద్‌లో ఈయ‌న జ‌న్మించారు. యూనివ‌ర్సిటీ ఆఫ్ బాంబేలో చ‌దువుకున్నారు. 1949-1953 మ‌ధ్య కాలంలో యూనివ‌ర్సిటీ ఆఫ్ మిచిగ‌న్‌లో, అనంత‌రం 1953 నుంచి 1955 కాలంలో మ‌సాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఎంఐటీ)లోనూ ఆర్కిటెక్చ‌ర్ విద్య‌ను అభ్య‌సించారు. 1958లో ముంబైలో సొంత ప్రాక్టీస్ మొద‌లు పెట్టారు. అన‌తి కాలంలోనే ఈయ‌న ప్ర‌ముఖ ఆర్కిటెక్ట్‌గా పేరు తెచ్చుకున్నారు.

అహ్మ‌దాబాద్‌లోని స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మంలో ఉన్న మ‌హాత్మా గాంధీ మెమోరియ‌ల్ మ్యూజియంను, ముంబైలోని కాంచ‌న్‌జుంగా అపార్ట్‌మెంట్ ట‌వ‌ర్‌ను, జైపూర్‌లోని జ‌వ‌హ‌ర్ క‌ళా కేంద్రాన్ని, న‌వీ ముంబై న‌గ‌రాన్ని, కేంబ్రిడ్జిలోని ఎంఐటీ బ్రెయిన్ అండ్ కాగ్నిటివ్ సైన్సెస్ సెంట‌ర్‌ను, లిస్బ‌న్‌లోని చంపాలిమ్యాడ్ సెంట‌ర్‌ను, పారుమ‌లా చ‌ర్చిని, భోపాల్‌లోని మ‌ధ్య‌ప్ర‌దేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీని, న్యూఢిల్లీలోని నేష‌న‌ల్ క్రాఫ్ట్స్ మ్యూజియంను, భోపాల్ భార‌త్ భ‌వ‌న్‌ను, ఢిల్లీలోని బ్రిటిష్ కౌన్సిల్ భ‌వ‌నాన్ని, కోల్‌క‌తా సిటీ సెంట‌ర్‌ను, చెన్నైలోని మ‌హీంద్రా అండ్ మహీంద్రా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఫెసిలిటీని… ఇలా చెప్పుకుంటూ పోతే చార్లెస్ కొరియా డిజైన్ చేసిన నిర్మాణాల లిస్ట్ కొన్ని పేజీలు అవుతుంది. అంత‌టి ప్ర‌ముఖ ఆర్కిటెక్ట్‌గా ఈయ‌న పేరు గాంచారు.

charles-correa-buildings

centre-astronomy-astrophysics-pune-r270313

dscf0429

1985లో నేష‌న‌ల్ క‌మిష‌న్ ఆన్ అర్బనైజేష‌న్ చైర్మ‌న్‌గా ప‌నిచేశారు. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో నివాసం ఉంటున్న పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు త‌క్కువ ఖ‌ర్చుతో ఇండ్ల‌ను క‌ట్టుకునేందుకు అవ‌స‌ర‌మైన డిజైన్ల‌ను, అందుకు కావ‌ల్సిన మెటీరియ‌ల్స్‌ను ఈయ‌న రూపొందించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఎన్నో అవార్డుల‌ను కూడా అందుకున్నారు. 1984లో రిబా రాయ‌ల్ గోల్డ్ మెడ‌ల్‌, 2006లో ప‌ద్మ విభూష‌ణ్‌, 1972లో ప‌ద్మ‌శ్రీ‌, 1994లో ప్రీమియం ఇంపీరియ‌ల్‌, 1998లో 7వ అగాఖాన్ అవార్డ్‌, 2005లో ఆస్ట్రియన్ డెక‌రేష‌న్ అవార్డుల‌ను చార్లెస్ కొరియా అందుకున్నారు. 2015, జూన్ 16న ఈయ‌న అనారోగ్యం కార‌ణంగా మృతి చెందారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న డిజైన్ చేసిన నిర్మాణాలు ఇంకా అద్భుత‌మైన ఆర్కిటెక్చ‌ర్‌కు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఈయ‌న కూడా ఓ రియ‌ల్ స్టారే క‌దా..!

tumblr_lpuizqek8q1qzglyyo1_1280

Comments

comments

Share this post

scroll to top