శ్రీదేవి ఇతని భార్య అంట..! మరణించిందని తిండి మానేసి ఆచారం ప్రకారం “గుండు” చేయించుకున్నాడు.?

ప్రముఖ బాలీవుడ్‌ నటి శ్రీదేవి మరణించి దాదాపుగా 10 రోజులు కావస్తుంది. అయినా అనేక మంది అభిమానులు మాత్రం ఇంకా విషాదంలోనే మునిగిపోయారు. ఆమె ఈ భూమిపై లేదన్న విషయాన్ని వారు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పటి నుంచో ఆమెను అభిమానిస్తున్న వారు ఆమె లోదన్న వార్తను ఇంకా మరిచిపోలేకపోతున్నారు. అంతలా ఆరాధించే అభిమానులు శ్రీదేవికి ఉన్నారు. అయితే ఆ వ్యక్తి మాత్రం అభిమానాన్ని మిగతా వారి కన్నా కొంచెం ఎక్కువగానే ప్రదర్శిస్తున్నాడు. శ్రీదేవి తన భార్య అని చెప్పి, ఆమె చనిపోయిన తరువాత ఆమెకు కర్మ చేయించాడు. తాను గుండు చేయించుకున్నాడు. వింటానికి షాకింగ్‌గా ఉన్నా ఇది నిజమే.

మధ్యప్రదేశ్ లోని షియోపూర్‌కు చెందిన ఓం ప్రకాష్‌ మెహ్రా అనే వ్యక్తికి శ్రీదేవి అంటే చాలా ఇష్టం. ఆమెకు ఇతను వీరాభిమాని. అయితే ఆ అభిమానం మాత్రం ఒక దశలో హద్దు దాటింది. ఆమెను పెళ్లి చేసుకుందామనుకున్నాడు. కానీ అది వీలు కాదు కదా. దీంతో ఆమెను ఆరాధిస్తూ ఎంతో కాలంగా పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోయాడు. ఇక అంతటితో ఆగకుండా ఓటర్‌ లిస్ట్ లో తన భార్య ప్లేస్‌లో శ్రీదేవి పేరు రాశాడు. ఆమెకు బోనీ కపూర్‌తో పెళ్లి అయిందని తెలిసినా, ఇద్దరు కూతుళ్లు పుట్టారని తెలిసినా ఆమెనే ఆరాధించడం మానలేదు. ఎవరైనా ఏం పని ఇది అని అడిగితే ఆమెకు పెళ్లి అయినా, ఎలా ఉన్నా ఆమె నా భార్యే అని అనేవాడు.

అలా ఉండగా ఈ మధ్యే శ్రీదేవి చనిపోయింది కదా. దీంతో ఆమె మరణాన్ని ఓం ప్రకాష్‌ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆమె చనిపోయిన దగ్గర్నుంచి తిండి, నీరు మానేశాడు. నిద్రపోవడం లేదు. ఇక తాజాగా ఆమెకు కర్మ చేయించాడు. స్థానికంగా ఉన్న ఓ స్కూల్‌లో సంతాప సభను ఏర్పాటు చేశాడు. అందులో శ్రీదేవి ఫొటో పెట్టి ఆమెకు పూలమాలలతో నివాళులు అర్పించాడు. అనంతరం కర్మ చేసి గుండు కొట్టించుకున్నాడు. దీంతో చుట్టూ ఉన్నవారు చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇక ఈ విషయం తెలిసిన వారు మాత్రం పాపం.. పిచ్చివాడు.. అని అంటున్నారు. ఏది ఏమైనా ఈ ఘటన మాత్రం నెట్‌లో బాగానే వైరల్‌ అవుతోంది..!

Comments

comments

Share this post

scroll to top