700 ర‌కాల వ్యాధుల‌కు కూడా ఆయ‌న మందు ఇవ్వ‌గ‌ల‌రు..! అంతా ఉచిత‌మే..!

నేటి త‌రుణంలో ఆస్ప‌త్రులు ఎలా త‌యార‌య్యాయో అందరికీ తెలిసిందే. ప్ర‌భుత్వ హాస్పిట‌ల్స్ సంగ‌తి ప‌క్క‌న పెడితే… ప్రైవేటు హాస్పిటల్స్‌లో వైద్యులు ఉన్న దానికీ లేని దానికీ ర‌క ర‌కాల ప‌రీక్ష‌లు చేసి ఫీజులు గుంజ‌డ‌మే కాదు, లేని పోని మందులు రాసి జ‌నాల‌ను బెంబేలెత్తిస్తున్నారు. అవ‌స‌రం ఉన్నా, లేక‌పోయినా స‌ర్జ‌రీలు చేసి పెద్ద ఎత్తున డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో నిక్క‌చ్చిగా, నిజాయితీగా వైద్యం చేసే డాక్ట‌ర్లు, హాస్పిటల్స్ క‌రువ‌య్యాయి. అయితే… ఇలాంటి కాలంలోనూ ఇంకా మాన‌వ‌త్వం గొడ్డు పోలేద‌ని నిరూపిస్తున్నాడు ఆ వైద్యుడు. నిజానికి ఆయ‌న వైద్యుడు కాదు. వైద్య‌మూర్తి. ఆ పేరుతోనే ప్ర‌జ‌లంద‌రూ ఆయ‌న్ను పిలుస్తారు. అందుకు కార‌ణం ఒక్క‌టే… ఆయ‌న అందించే ఆయుర్వేద చికిత్స. అందుకు ఆయ‌న ఎలాంటి ఫీజు తీసుకోడు. పైగా మందుల‌ను కూడా ఉచితంగా ఇస్తాడు.

vaidyamurthy-2

అది క‌ర్ణాట‌క రాష్ట్రంలోని షిమోగా ప్రాంతంలో ఉన్న న‌ర‌సిపురా అనే గ్రామం. ఆ గ్రామంలో నివ‌సించే 60 సంవ‌త్స‌రాల పెద్దాయ‌న‌నే అంద‌రూ వైద్య మూర్తి అని పిలుస్తారు. ఆయ‌న అస‌లు పేరు నారాయ‌ణ మూర్తి. నిజానికి ఆయ‌న ఓ సాధార‌ణ రైతు. అయినా ఆయుర్వేద వైద్యంపై మంచి ప‌ట్టుంది. ఏ వ్యాధికి ఏ మందు ఇవ్వాలో, ఏ రోగికి ఏ చూర్ణం ఇవ్వాలో ఆయ‌నకు బాగా తెలుసు. ఆయ‌నే స్వ‌యంగా సమీపంలో ఉన్న అడ‌వికి వెళ్లి ప‌లు ర‌కాల మూలిక‌లు, వేర్లు, పండ్లు, ఆకుల‌ను తెచ్చి పెట్టుకుంటారు. ఆయ‌న వ‌ద్ద‌కు వ‌చ్చే రోగుల‌ను ప‌రీక్షించాక స్వ‌యంగా మందుల‌ను త‌యారు చేసి ఇస్తారు. ఆయ‌న ఇచ్చే మందులు 15 నుంచి 30 రోజుల వ‌ర‌కు వ‌స్తాయి. అయితే అందుకు గాను ఆయ‌న వైద్యానికి, మందుల‌కు ఎలాంటి ఫీజు తీసుకోరు. ఉచితంగా చేస్తారు.

vaidyamurthy-1

ఈ క్ర‌మంలో ఆయ‌న వ‌ద్ద వైద్యం చేయించుకునేందుకు ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున వ‌స్తుంటారు. ఆయ‌న్ను క‌లవాలంటే ప్ర‌తి ఆదివారం, గురువారం వెళ్ల‌వచ్చు. ఆయ‌న ఇంటి ముందు ఆయా రోజుల్లో తెల్ల‌వారు జాము నుంచే పెద్ద లైన్ ఉంటుంది. ఎవరు ముందుగా వ‌స్తే వారికి ముందు వైద్యం చేస్తారు. అలా అని చెప్పి రోజుకు ఇంత మంది అని ఉండ‌దు. ఎంద‌రు వ‌స్తే అంద‌రికి ఆయ‌న వైద్యం అందిస్తారు. దాదాపుగా 700 వ‌ర‌కు మొండి వ్యాధుల‌ను న‌యం చేసే మందుల‌ను కూడా ఆయ‌న ఇవ్వ‌గ‌ల‌రు. క్యాన్స‌ర్‌, డ‌యాబెటిస్‌, హార్ట్ స‌మ‌స్య‌లు, ఇత‌ర ఏ అనారోగ్య‌మైనా ఆయ‌న మందులు ఇస్తారు. చాలా చివ‌రి ద‌శ‌లో, వ్యాధి ముదిరిపోయి ఉన్నా ఆయ‌న నయం చేయ‌గ‌ల‌ర‌ని, ఆయ‌న వ‌ద్ద వైద్యం పొందిన వారు చెబుతారు. అయితే ఆయ‌న ఒక‌సారి మందులు ఇస్తే గ‌న‌క క‌చ్చితంగా ప‌థ్యం పాటించాలి. అలా పాటించి స‌రైన ప్ర‌కారం మందు వేసుకుంటే దెబ్బ‌కు వ్యాధి త‌గ్గుతుంద‌ట. ఏది ఏమైనా… డ‌బ్బుతో వైద్యం ముడిపడి ఉన్న నేటి కాలంలో అలాంటి ఓ పెద్దాయ‌న ఉచితంగా వైద్యం చేయ‌డ‌మే కాక‌, మందుల‌ను కూడా ఇస్తున్నాడంటే… నిజంగా ఆయ‌న్ను అంద‌రం అభినందించ‌వ‌చ్చు..!

Comments

comments

Share this post

scroll to top