ఆ వ్య‌క్తి ఏకంగా 300 గుడ్లతో కూర చేసి తిన్నాడు… అత‌ని వీడియో ఇప్పుడు హ‌ల్‌చ‌ల్ సృష్టిస్తోంది..!

ఉప్పు, కారం, మ‌సాలా, పోపు దినుసులు, క‌రివేపాకు, ట‌మాట‌లు… ఇవన్నీ దిట్టంగా వేసి ఘుమ‌ఘుమ‌లాడేలా వండిన కోడిగుడ్డు కూర అంటే ఎవ‌రికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. ఎవ‌రైనా అలాంటి కూర‌ను చూస్తే లొట్ట‌లేసుకుంటూ తినేస్తారు. గిన్నెలో ఒక్క కోడిగుడ్డు కూడా మిగ‌ల్చ‌కుండా పూర్తిగా తినేస్తారు. కోడిగుడ్డు కూర‌కు ఉన్న రుచి, అందులోని మ‌హ‌త్మ్యం అటువంటిది మ‌రి. అందుకే ఎవ‌రైనా ఆ కూర‌ను ఆబ‌గా తినేస్తారు. అయితే మ‌రి ఆ వ్య‌క్తి వండిన కోడిగుడ్డు కూర‌నో..? దాన్న‌యితే మీరు ఎలా తింటారు..? ఆబ‌గా అన్నాం క‌దా, అంత‌క‌న్నా ఎక్కువ ఆదుర్దాతోనే ఆ కూరను మీరు లాగించేస్తారు. ఎందుకంటే ఆ వ్య‌క్తి కోడిగుడ్డు కూర‌ను వండిన విధానం అటువంటిది మ‌రి..!

300-eggs-curry-1

చిత్రంలో చూశారుగా అత‌ని వ‌ద్ద ఎన్ని కోడిగుడ్లు ఉన్నాయో. అవును, మీరు ఊహించింది క‌రెక్టే. వంద‌ల సంఖ్యలో గుడ్లు అత‌ని వ‌ద్ద ఉన్నాయి. వాటి మొత్తం సంఖ్య 300. అన్ని గుడ్ల‌తోనూ ఆ వ్య‌క్తి కూర‌ను ఎలా వండాడో ఇప్పుడు చూద్దాం…

ఆ వ్య‌క్తి ముందుగా గుడ్ల‌ను కొన్నింటిని ఉడికించి పొట్టు తీసి వాటిలో ఉప్పు, ప‌సుపు క‌లిపి సిద్ధం చేసుకుని ప‌క్క‌న పెట్టాడు. అనంత‌రం ఓ పెద్ద పాత్ర‌లో స‌రిప‌డా నూనె వేసి అది వేగాక‌, దాంట్లో పోపు గింజ‌లు, ఉల్లిపాయ‌లు, క‌రివేపాకు, ట‌మాటా ముక్క‌లు, ప‌సుపు అన్నీ వేసి గ్రేవీ త‌యారు చేసి అందులో మిగిలిన గుడ్ల‌ను ప‌గ‌ల‌గొట్టి సొన వేశాడు. అనంత‌రం ఆ గ్రేవీని బాగా క‌లిపి స‌రిగ్గా ఉడికాక అందులో అంత‌కు ముందు సిద్ధం చేసుకున్న ఉడికిన గుడ్ల‌ను వేసేశాడు. అంతే, కొద్ది నిమిషాల పాటు వేచి చూశాక చ‌క్క‌ని కోడిగుడ్డ కూర త‌యారైంది. అందులో కారం, ప‌సుపుతోపాటు కొంత నూనె, క‌రివేపాకుల‌ను మ‌ళ్లీ గంటె పోపు పెట్టి వేశాడు. అనంత‌రం కూర‌ను దించేశాడు. ఎంచక్కా నోరూరించే కోడిగుడ్డు కూర త‌యారైంది. మ‌రి కూర ఉడికాక ఎవ‌రైనా ఊరుకుంటారా..? ఇంకేముంది, దాన్ని ఓ అర‌టి ఆకులో వేసుకుని, అన్నం పెట్టుకుని గుడ్ల‌ను లాగించేశాడు.

300-eggs-curry-2

ఇంట‌ర్నెట్‌లో ఈ వీడియో ఇప్పుడు హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. 300 గుడ్లతో కూర చేసి తింటున్న వ్య‌క్తిగా ఆ వీడియో ఇప్పుడు అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టికే దీన్ని యూట్యూబ్‌లో 1.80 కోట్ల మంది వీక్షించారు. అంతే మ‌రి, అంత చ‌క్క‌గా వండిన కూర‌ను ఎవ‌రికి మాత్రం చూడ‌బుద్ది కాదు చెప్పండి. అయితే, ఇంకెందుకాల‌స్యం, మీరు కూడా ఆ వ్య‌క్తి రిసెపిని ఫాలో అయి అలాగే కూర చేసుకుని తిని చూడండి..! కానీ ఎందుకైనా మంచిది అన్ని గుడ్లతో మాత్రం ఒకేసారి ప్ర‌యోగం చేయ‌కండి..!

300 కోడిగుడ్లతో వ్య‌క్తి చేసిన కూర వీడియోను కింద వీక్షించ‌వ‌చ్చు..!

Comments

comments

Share this post

scroll to top