విడిపోయిన ఆ ఇద్ద‌రు చిన్నారి ఫ్రెండ్స్ మళ్లీ క‌లిసేందుకు లెట‌ర్స్ రాసుకున్నారు.. వాటిని చూస్తే షాకవుతారు.

స్నేహితులు అన్నాక అన్ని సంద‌ర్భాల్లోనూ స్నేహంగా ఉండ‌రు. కొన్ని సార్లు కొన్ని విష‌యాల వ‌ల్ల మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌స్తుంటాయి. దీంతో గొడ‌వ ప‌డ‌తారు. కొన్ని సంద‌ర్భాల్లో ఆ గొడ‌వలు తారాస్థాయికి చేరుతాయి. దీంతో ఆ స్నేహితులు విడిపోతారు కూడా. అయితే అలా విడిపోయిన వాళ్ల‌లో మ‌ళ్లీ క‌లిసే వారు, య‌థావిధిగా ఫ్రెండ్‌షిప్ చేసే వారు చాలా త‌క్కువ‌గా ఉంటారు. అలాంటి వారు మళ్లీ క‌ల‌వాలంటే చాలా క‌ష్టం. కానీ ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఆ ఇద్ద‌రు చిన్నారి స్నేహితులు మాత్రం గొడ‌వ‌ప‌డి వెంట‌నే క‌లిసిపోయారు. అది కూడా కేవ‌లం రెండు లెట‌ర్ల వ‌ల్ల‌. అవును, అవే వారిద్ద‌రినీ క‌లిపాయి.

సీయా, అర్నా అనే ఇద్ద‌రు బాలిక‌లు చాలా మంచి ఫ్రెండ్స్‌. కానీ అనుకోకుండా ఓ చిన్న విష‌యం వ‌ల్ల వారు విడిపోయారు. అయితే ఏమ‌నుకున్నారో ఏమో గానీ వారు ఒక‌రికొక‌రు లెట‌ర్స్ రాసుకున్నారు. ముందుగా సీయా లెట‌ర్ రాసింది.. డియ‌ర్ అర్నా, మ‌న‌మిద్ద‌రం మ‌ళ్లీ ఫ్రెండ్స్ అవుదామా, హాలోవీన్ ఫెస్టివ‌ల్‌ను ఇద్ద‌రం మిస్ చేసుకోకూడ‌దు, నాకు ఫ్రెండ్ అవుతావా, మ‌ళ్లీ మనం పార్టీ చేసుకోవ‌చ్చు.. అని సీయా లెట‌ర్ రాసి త‌న త‌ల్లికి ఇవ్వ‌గా, ఆమె దాన్ని ఫొటో తీసి వాట్సాప్‌లో అర్నా త‌ల్లికి పంపింది.

అర్నా త‌ల్లి అది చూసి అర్నాకు ఆ లెట‌ర్‌ను చూపించింది. దీంతో అర్నా కూడా సీయాకు లెట‌ర్ రాసింది.. డియ‌ర్ సీయా, మ‌న‌మిద్ద‌రం ఎప్ప‌టికీ స్నేహితుల‌మే, చిన్న విష‌యాలు మ‌న ఫ్రెండ్‌షిప్‌ను దెబ్బ‌తీయ‌లేవు. మ‌న‌మిద్ద‌రం పార్టీ చేసుకుందాం, హాలోవీన్ పార్టీలో క‌లుద్దాం, ఇద్దరం సెల‌బ్రేట్ చేసుకుందాం.. అంటూ అర్నా లెట‌ర్ రాసి త‌ల్లికి ఇవ్వ‌గా దాన్ని ఆమె దాన్ని సీయా త‌ల్లికి వాట్సాప్ చేసింది. ఈ క్ర‌మంలో ఆ లెట‌ర్‌ను సీయా త‌ల్లి సీయాకు చూపించింది. త‌రువాత సీయా, అర్నాలు ఇద్ద‌రూ ఎప్ప‌టిలాగే మంచి స్నేహితులు అయ్యారు. అయితే ఇది క‌థ కాదు, నిజంగా జ‌రిగిందే. ఈ క్ర‌మంలోనే ఆ ఇద్ద‌రు చిన్నారులు రాసుకున్న లెట‌ర్లు ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి. వాటి ప‌ట్ల నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ చిన్నారుల‌కు ఉన్న స‌మ‌య‌స్ఫూర్తిని అంద‌రూ మెచ్చుకుంటున్నారు. అవును మ‌రి, చిన్న మ‌న‌స్ఫ‌ర్థల కార‌ణంగా ఫ్రెండ్ షిప్‌ను పోగొట్టుకోవ‌ద్ద‌ని వారిద్ద‌రూ చాటి చెప్పారు క‌దా, అందుకు వారిని అభినందించాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top