ఆ ఊబ‌కాయురాలు చేస్తున్న యోగా చూస్తే ఎవ‌రైనా ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!

స్థూల‌కాయుల‌ను చూస్తే ఎవ‌రికైనా హాస్యాస్ప‌దంగానే ఉంటుంది. లావుగా ఉన్న శ‌రీరాన్ని చూసి అంద‌రూ ఎగ‌తాళి చేస్తారు. న‌వ్వుకుంటారు. ఇది లోకంలో ఎక్క‌డైనా జ‌రిగేదే. కానీ ఆ యువ‌తి మాత్రం అలా కాదు. అధిక స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్నా ప‌ట్టుద‌ల‌తో శ్ర‌మించింది. గంట‌ల త‌ర‌బ‌డి యోగాలో శిక్ష‌ణ తీసుకుంది. ఇప్పుడ‌దే శ‌రీరంతో యోగా టీచ‌ర్ అవ‌తారం ఎత్తి క్లాస్‌లు చెప్ప‌డం, వ‌ర్క్‌షాపులు నిర్వ‌హించ‌డ‌మే కాదు, ఒక‌ప్పుడు త‌న‌ను చూసి న‌వ్విన వారికి చెంప పెట్టులా యోగాలో మాస్ట‌ర్ అయింది. ఆమే డానా ఫాల్సెట్టి.

Dana-Falsetti

అమెరికాలోని పెన్సిల్వేనియా ప్రాంతంలో నివాసం ఉండే 22 ఏళ్ల డానా ఫాల్సెట్టి పుట్టుక‌తోనే ఊబ‌కాయంతో జ‌న్మించింది. దీనికి తోడు చిన్న‌ప్ప‌టి నుంచి విప‌రీతంగా తినే అల‌వాటు ఉండ‌డంతో ఆమె మ‌రింత స్థూల‌కాయురాలిగా మారిపోయింది. దీంతో చిన్న‌ప్పుడు స్కూల్‌లో, పెద్దయ్యాక కాలేజ్‌లో, బ‌య‌ట తిరిగేట‌ప్పుడు డానాను చూసి అంద‌రూ న‌వ్వుకునే వారు. ఎగ‌తాళి కూడా చేసేవారు. అయినా ఆమె దిగులు చెంద లేదు. కాక‌పోతే బ‌రువు త‌గ్గేందుకు శ‌త విధాలా ప్ర‌య‌త్నించింది. కానీ ఆమె వ‌ల్ల అవ‌లేదు. దీంతో ఒక ఫ్రెండ్ ద్వారా యోగా గురించి తెలుసుకుంది. దానికున్న ప‌వ‌ర్ ఏమిటో గ్ర‌హించి యోగాను అభ్య‌సించాల‌ని నిర్ణ‌యించుకుంది.

అయితే డానా అనుకున్నంత సుల‌భంగా యోగాను ఆమె అభ్య‌సించ‌లేక‌పోయింది. కానీ ఎలాగైనా యోగానే సాధ‌న చేయాల‌ని నిశ్చ‌యించుకుంది. ఈ క్ర‌మంలో కాలేజ్‌లో చెప్పే యోగా క్లాస్‌లో జాయిన్ అయింది. అక్క‌డ కూడా ఆమె తోటి విద్యార్థుల న‌వ్వుల‌ను, వారి ప‌రిహాసాల‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ వాటికి ఆమె దిగులు చెంద‌లేదు. ప‌డుతూ, లేస్తూనే క‌ష్ట‌ప‌డి యోగా సాధ‌న చేసింది. కొద్ది నెల‌ల్లోనే యోగా మాస్ట‌ర్‌గా మారింది. కానీ అప్ప‌టికీ ఆమె శ‌రీర బ‌రువులో మాత్రం అంతగా ఏం మార్పు రాలేదు. కానీ ఆ ఊబ‌కాయ శ‌రీరంతోనే ఆమె చేస్తున్న యోగా సాధ‌న చూసి ఒక‌ప్పుడు న‌వ్విన వారే ఆమెను చూసి ముక్కున వేలేసుకున్నారు. ఔరా! అని ఆశ్చ‌ర్య‌పోయారు. మ‌రి డానా అంత‌లా క‌ష్ట‌ప‌డింది మ‌రి. అలా యోగా మాస్ట‌ర్‌గా మారిన ఆమె ఇప్పుడు యోగా క్లాస్‌లు చెబుతూ, వర్క్‌షాప్‌లు నిర్వ‌హిస్తోంది. అంత‌టి లావు శరీరంతో ఆమె చేస్తున్న యోగాను చూసి ఆమెను మెచ్చుకోకుండా ఎవ‌రూ ఉండ‌లేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలో ఆమెకు ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌ల‌లో విప‌రీత‌మైన ఫాలోవ‌ర్లు చేరారు. ఒక విదేశీ యువ‌తి, అందులోనూ ఊబ‌కాయురాలు అంత బాగా యోగా చేస్తుందంటే నిజంగా ఆమెను మ‌నం అభినందించాల్సిందే. కాగా యోగా ద్వారా త్వ‌ర‌లోనే తాను స‌న్న‌బ‌డ‌తాన‌ని ధీమాగా చెబుతోంది డానా. ఆమె క‌ష్టం ఫ‌లించాల‌ని మ‌న‌మూ ఆశిద్దాం.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top