రాజ‌కీయ నాయకుడికి చుక్కలు చూపించిన డైనమిక్ లేడీ పోలీస్ ఆఫీసర్ ఈమె. ఎవరో తెలుసా..?

ఏ వాహనం అయినా కానివ్వండి. అందులో వెళ్తున్నప్పుడు దారిలో ఎక్కడైనా పోలీసులు ఆపి పత్రాలు చూపించమంటే ఎవరైనా ఏం చేస్తారు..? కొందరు పారిపోతారు. పత్రాలు అన్నీ పర్‌ఫెక్ట్‌గా ఉన్నవారు చూపించి ఎంచక్కా ముందుకు సాగుతారు. అయితే ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ నాయకులు అలా కాదు. ఎలాంటి పత్రాలు లేవు. అయినా వారిని పోలీసులు ఆపకూడదట. పట్టుకోకూడదట. అలా పట్టుకుందని చెప్పి ఓ లేడీ పోలీస్ ఆఫీసర్‌ను ఏకంగా ఆ పార్టీ నాయకులు ఘొరావ్ చేశారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేసి కొంత సేపు హల్‌చల్ చేశారు. అయితే అందరిలా ఆమె భయపడలేదు. తన మాటలతోనే వారికి జవాబు చెప్పింది. దీంతో ఆ నాయకులు తోక ముడిచారు. ఇంతకీ అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే…

అది ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ ప్రాంతం. అక్కడ స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రేష్టా ఠాకూర్ ఇతర పోలీసు సిబ్బందితో కలిసి విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె రహదారిపై వాహనాలను ఆపి పత్రాలను చెక్ చేస్తోంది. అయితే అదే మార్గంలో బులంద్‌షహర్ జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు ప్రమోద్ లోధి కారులో వచ్చారు. ఆయన వాహనాన్ని కూడా పోలీసులు తనిఖీ చేశారు. అయితే ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంది బీజేపీయే కనుక లోధి రెచ్చిపోయాడు. అధికార పార్టీకి చెందిన నాయకుల వాహనాలనే చెక్ చేస్తావా, చలాన్ రాస్తావా అంటూ శ్రేష్టా ఠాకూర్‌పై విరుచుకు పడ్డాడు.

వెంటనే తన అనుచరులతో కలిసి ఆమెకు ఎదురుగా నిలబడి రోడ్డుపైనే నినాదాలు చేయడం మొదలు పెట్టాడు. బీజేపీ నాయకులు ఆమె ఎదుట కొంత సేపు ఘొరావ్ చేశారు. అయితే శ్రేష్టా ఠాకూర్ వారికి తనదైన శైలిలో మాటలతోనే జవాబు చెప్పింది. ”మీరు వెళ్లి పోలీసులకు వాహనాలను తనిఖీ చేసే అధికారం లేదని చెప్పి సీఎం సార్‌తో రాయించుకుని రండి, అప్పుడు మేం తనిఖీలు చేయం, మిమ్మల్ని కూడా వదిలేస్తాం” అని ఘాటుగా బదులిచ్చిందామె. దీంతో వారు కొంత నెమ్మదించారు. ఈ క్రమంలో మళ్లీ ఆమే కల్పించుకుని ”మేం మా కుటుంబ సభ్యులను విడిచి పెట్టి మీకు శాంతి భద్రతలను కల్పించేందుకు కష్టపడి రాత్రి, పగలు డ్యూటీ చేస్తుంటే మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని, మేం సరదా కోసం ఉద్యోగాలు చేయడం లేదని” ఆమె బదులిచ్చింది. దీంతో ఆ పార్టీ నాయకులు నినాదాలు చేయడం ఆపేశారు. ఆ తరువాత ఆమె మళ్లీ అన్నది, ”మీరు ఇలాగే అందరితోనూ ప్రవర్తిస్తే త్వరలో మిమ్మల్ని బీజేపీ గూండాలు అని పిలుస్తారని, ఆ పద్ధతి మానుకుంటే మీ పార్టీకి మంచిదని” ఆమె సమాధానం చెప్పింది. ”మీరు ఏమైనా చేసుకోండి, నా డ్యూటీ నేను చేశా” అంటూ ఆమె ఆ నాయకులకు కౌంటర్ ఇచ్చింది. దీంతో వారు అక్కడి నుంచి వెనుదిరిగారు. కాగా ఆమె అలా మాట్లాడుతున్నప్పుడు కొందరు ఆ సంఘటనను అంతా వీడియో తీశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది..!

Comments

comments

Share this post

scroll to top